- Home
- Entertainment
- RC16 PoojaCeremony: గ్రాండ్‌గా చరణ్,బుచ్చిబాబు మూవీ ప్రారంభం.. చిరు, శంకర్, సుకుమార్, రెహ్మాన్, ఉపాసన సందడి
RC16 PoojaCeremony: గ్రాండ్‌గా చరణ్,బుచ్చిబాబు మూవీ ప్రారంభం.. చిరు, శంకర్, సుకుమార్, రెహ్మాన్, ఉపాసన సందడి
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో రూపొందబోతున్న `ఆర్‌సీ16` మూవీ ఓపెనింగ్ గ్రాండ్‌గా జరిగింది. బిగ్ సెలబ్రిటీలు ఇందులో సందడి చేశారు.

రామ్‌చరణ్ నెక్ట్స్ మూవీ గ్రాండ్‌గా ప్రారంభమైంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న `ఆర్‌సీ16` మూవీ బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. భారీగా సెలబ్రిటీలు తరలి రాగా అత్యంత గ్రాండియర్ వేలో ఈ మూవీ ప్రారంభం కావడం విశేషం.
Survey:వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
భారీగా వేసిన మండపం సెట్‌లో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో దిగ్గజాలు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన సందడి చేశారు. వీరు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
మరోవైపు జాన్వీ కపూర్, ఆమె తండ్రి నిర్మాత బోనీ కపూర్ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే దర్శకుడు సుకుమార్ కూడా పాల్గొన్నారు. దర్శకుడు బుచ్చిబాబు.. సుకుమార్ శిష్యుడు అనే విషయం తెలిసిందే. పైగా రామ్‌చరణ్‌తో `రంగస్థలం` మూవీ చేశాడు. నెక్ట్స్ మరో సినిమా చేయబోతున్నారు.
ఇక `ఆర్‌సీ16`కి మూవీకి రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం విశేషం. చాలా గ్యాప్ తర్వాత రెహ్మాన్ ఇలా తెలుగు సినిమా ఈవెంట్ పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది.
ఇంకోవైపు దర్శకుడు శంకర్ కూడా ఈ ఓపెనింగ్ సెర్మనీలో మెరిశారు. ఆయన ప్రస్తుతం రామ్‌చరణ్‌తో `గేమ్ ఛేంజర్` మూవీ చేస్తున్నారు. ఆయన కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా పాల్గొన్నారు. ఆయన ఎంట్రీ అదిరిపోయింది. చిరు, చరణ్ కలిసి ఈవెంట్‌కి వచ్చారు. ఈ ఇద్దరు ఓకే రావడంతో ఓపెనింగ్ వేడుకలో ప్రత్యేక కళ నెలకొంది.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో `ఆర్‌సీ16`ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వారితోపాటు బాబీ డియోల్ కూడా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌లో సాగే మూవీ ఇది. స్పోర్ట్స్ నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో రామ్‌చరణ్ పాత్ర చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంటుందట. అలాగే ఈ మూవీకి `పెద్ది` అనే టైటిల్‌ని ఫైనల్ చేసినట్టు సమాచారం.
`ఆర్‌సీ16` మూవీ పూజా కార్యక్రమంలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. ఆమె పట్టు చీరలో మెరిసింది. జస్ట్ వాహ్ అనిపించింది.