- Home
- Entertainment
- Rajamouli sentiment: ఆచార్యతో ఆ సెంటిమెంట్ పోయింది..రాంచరణ్, శంకర్ సేఫ్.. ఓవర్ టు తారక్
Rajamouli sentiment: ఆచార్యతో ఆ సెంటిమెంట్ పోయింది..రాంచరణ్, శంకర్ సేఫ్.. ఓవర్ టు తారక్
మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలయింది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలయింది. దర్శకుడు కొరటాల శివకి తొలి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి, రాంచరణ్ కామ్రేడ్ సోదరులు నటించారు. క్రిటిక్స్ నుంచి కూడా ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలే వచ్చాయి.
సెంటిమెంట్స్ ని కేవలం అపోహలుగా మాత్రమే పరిగణించాలి. చిత్ర పరిశ్రమలో చాలా మంది సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. కొందరు వాటిని పట్టించుకోరు. కానీ రాజమౌళి విషయంలో రిపీట్ అవుతున్న ఓ సెంటిమెంట్ అందరిని గుబులు పెడుతోంది. ముఖ్యంగా రాజమౌళి చిత్రాల్లో నటించిన హీరోలని.
రాజమౌళి దర్శకత్వంలో నటించిన తర్వాత.. ఆయా హీరోలు ఆ తర్వాత చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అనడం పరిపాటిగా మారిపోయింది. రాజమౌళి ఫస్ట్ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ వరకు ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతూనే ఉంది. రీసెంట్ గా గమనిస్తే బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చిత్రంలో నటించాడు. కనీవినీ ఎరుగని అంచనాలతో విదులైన ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరించింది.
రాజమౌళి సెంటిమెంట్ ని కనీసం ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ అయినా బ్రేక్ చేస్తారు అని భావించారు. కానీ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటించిన ఆచార్య చిత్రానికి కూడా నెగిటివ్ టాక్ వస్తోంది. ఈ విషయంలో ఒకరకంగా సేఫ్ అనే చెప్పాలి.ఎందుకంటే.. టెక్నికల్ గా ఆచార్య రాంచరణ్ మూవీ కాదు. కొరటాల, చిరంజీవిల చిత్రం ఇది.
RC15
ఈ చిత్రంలో రాంచరణ్ ఒక పెద్ద పాత్రలో నటించారు అంతే. రాజమౌళి సెంటిమెంట్ గండం రాంచరణ్ కి ఇలా గడిచింది. సో శంకర్, రాంచరణ్ సినిమా సేఫ్ అని అభిమానులు అంటున్నారు. శంకర్, రాంచరణ్ ల చిత్రం పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ఆచార్య లేకుంటే రాంచరణ్.. శంకర్ మూవీ విషయంలో టెన్షన్ పడి ఉండాల్సింది. ఇప్పుడు ఆ బాధ లేదు.
RC15
ఇక ఓవర్ టు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. దీనిపై రాజమౌళి సెంటిమెంట్ ఉంటుంది. మరి ఎన్టీఆర్ అయినా ఆ గండాన్ని అధికమిస్తాడో లేదో చూడాలి.