Ram Charan and NTR:రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రిజెక్ట్ చేశారా.. బడా నిర్మాతకి షాక్ ?
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలు. ఆర్ఆర్ఆర్ మూవీతో వీరిద్దరూ నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేశారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలు. ఆర్ఆర్ఆర్ మూవీతో వీరిద్దరూ నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేశారు. రామరాజుగా రాంచరణ్.. కొమురం భీంగా ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రదర్శించారు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు వీరిద్దరూ బాలీవుడ్ బడా నిర్మాతకి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ చిత్రాలని నిర్మిస్తున్నారు. బాహుబలి చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసింది ఆయనే. కరణ్ జోహార్ హోస్ట్ గా చేస్తున్న కాఫీ విత్ కరణ్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో సమంత, విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్, రణ్వీర్ సింగ్, అలియా, అనిల్ కపూర్ లాంటి సెలెబ్రిటీలు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే సీజన్ 7 ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఆర్ఆర్ఆర్ సంచలనం తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ లని కూడా ఈ షోకి కరణ్ జోహార్ ఇన్వైట్ చేశారట.
కానీ వ్యక్తిగత కారణాలు కావచ్చు, బిజీ షెడ్యూల్ కావచ్చు.. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కరణ్ ఇన్విటేషన్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అలియా భట్ భర్త స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా కాఫీ విత్ కరణ్ షోని రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
గతంలో టాలీవుడ్ నుంచి రాజమౌళి, ప్రభాస్, రానా లాంటి వారు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్, రష్మిక మందన ఈ షోకి హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.
అనేక విషయాలపై నిర్మొహమాటంగా ప్రశ్నించే కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో సమంత.. అర్జున్ కపూర్, మలైకా లాంటి సెలెబ్రిటీలు హాజరు కానుండడం ఆసక్తిగా మారింది.