- Home
- Entertainment
- మోకాళ్లపైకున్న బ్లూ డ్రెస్‌లో రకుల్ అందాల విందు.. ప్రియుడితో కలిసి సక్సెస్ పార్టీలో హంగామా!
మోకాళ్లపైకున్న బ్లూ డ్రెస్‌లో రకుల్ అందాల విందు.. ప్రియుడితో కలిసి సక్సెస్ పార్టీలో హంగామా!
రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడితో ఓపెన్‌గానే తిరుగుతుంది. లవ్ డేటింగ్‌పై బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇస్తూ రచ్చ చేస్తున్న ఈ భామ ఇప్పుడు ఏకంగా సినిమా సక్సెస్ పార్టీలోనూ ప్రియుడితో రచ్చ చేయడం విశేషం.

రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మొదటి నుంచి అందాల విందులో తగ్గేదెలే అంటోంది. కమర్షియల్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ అందాల ఆరబోయడంలో ముందే ఉంటుంది. హీరోలకు లవ్ ఇంట్రెస్ట్ పాత్రలతోనే మెప్పించింది రకుల్. అందుకే ఈ అమ్మడిని గ్లామర్ బ్యూటీ అంటుంటారు.
ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితమైన ఈ అందాల భామ ఇటీవల కాలంలో వరుసగా హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. అందాల విందుతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి దుస్తుల్లో మెరిసింది. బ్లూ కలర్ ట్రెండీ వేర్ ధరించి హోయలు పోయింది. మోకాళ్లపైకున్న డ్రెస్ ధరించి థైస్ అందాలతో కనువిందు చేస్తుంది. సోఫా ఛైర్లపై కూర్చొని కవ్విస్తుంది రకుల్. తాజాగా ఆమె దిగిన ఫోటో షూట్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా,అవి వైరల్ అవుతున్నాయి.
మరోవైపు మిర్రర్‌లో సెల్ఫీ లుక్‌లో అదరగొడుతుంది రకుల్. మిర్రర్ సెల్ఫీలోనూ క్యూట్‌గా, చిలిపిగా ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే కార్తీక్ అర్యన్ నటించిన `భూల్ భులైయ్యా 2` సక్సెస్ పార్టీలో పాల్గొంది రకుల్ ప్రీత్ సింగ్. తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి కలిసి ఆమె ఈ సక్సెస్ బాష్‌లో పాల్గొనడం విశేషం. ఈ పార్టీలో ఆమె చేసిన హంగామా మామూలు కాదు. అందరిలోనూ స్సెష్‌ల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. టబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యాన్‌కి జోడీగా కియారా అద్వానీ నటించింది. మే 20న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాదాపు రెండు వందల కోట్ల కలెక్షన్ల దిశగా రన్ అవుతుంది. కరోనా తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుకి ఆల్మోస్ట్ గుడ్‌బై చెప్పిందనే చెప్పాలి. ఆమె చివరగా `కొండపొలం` చిత్రంలో మెరిసింది. ఈ చిత్రం పరాజయం చెందింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమాకి సైన్ చేయలేదు. బాలీవుడ్‌లోనే `మిషన్ సిండెరెల్లా`, `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `అయలాన్`, `ఛత్రివాలి` చిత్రాలు చేస్తుంది.