Rakul Wedding:పెళ్ళికి కొద్ది రోజులే సమయం, ఇంతలా ఎవరైనా తెగిస్తారా..గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న రకుల్
రకుల్ పెళ్లి వేడుక ఫిబ్రవరి 21న జరగబోతోంది. అయితే మూడు రోజుల పెళ్లి కాబాట్టి ఫిబ్రవరి 19 నుంచి రిసార్ట్ లో సంబరాలు జరగనున్నాయి.
టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్ తో నటించింది. కొంతకాలం రకుల్ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. కానీ ఒక్కసారిగా ఆమెకి అవకాశాలు పడిపోయాయి. బాలీవుడ్ లో కూడా రకుల్ కి కలసి రాలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంది.
బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే మరికొన్ని రోజుల్లో తమ ప్రేమని రకుల్, జాకీ భగ్నానీ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళబోతున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో రకుల్, భగ్నానీ వివాహం జరగబోతోంది.
రకుల్ పెళ్లి కోసం ఆల్రెడీ గోవాలో 45 ఎకరాల్లో ఉన్న ఐటిసి గ్రాండ్ గోవా రిసార్ట్ ని బుక్ చేశారు. ఈ రిసార్ట్ లో 240 పైగా గదులు ఉన్నాయి. సిమ్మింగ్ పూల్స్, బీచ్ కి డైరెక్ట్ చేరుకునే సౌకర్యం, అనేక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇండియన్ వెస్ట్రన్ మిక్స్ చేసి విలేజ్ స్టైల్ లో ఈ రిసార్ట్ ని నిర్మించారట.
రకుల్ పెళ్లి వేడుక ఫిబ్రవరి 21న జరగబోతోంది. అయితే మూడు రోజుల పెళ్లి కాబాట్టి ఫిబ్రవరి 19 నుంచి రిసార్ట్ లో సంబరాలు జరగనున్నాయి. పెళ్ళికి ఇంకెంతో సమయం లేదు. కానీ రకుల్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పిక్స్ చూస్తే కుర్రాళ్ళ గుండెలు బద్దలు కావలసిందే.
అంత హాట్ గా రకుల్ రెచ్చిపోతోంది. దీనితో నెటిజన్లు షాక్ అవుతున్నారు. పెళ్ళికి ముందు ఇలా ఎవరైనా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. ఎల్లే మ్యాగజైన్ కోసం రకుల్ ఈ హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది.
రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్, భగ్నానీ పెళ్లి గోవాలో జరగబోతోంది. అందుకు తగ్గట్లుగా శుభలేఖలో కూడా గోవా అందాలు కనిపించేలా ముద్రించారు. పెళ్లి కార్డుపైన కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మూడు రోజులకు ముగ్గురు డిజైనర్స్ ని ఎంపిక చేశారు. సబ్యసాచి, తరుణ్ తహిల్యాని, మనీష్ మల్హోత్రా ఇలా ముగ్గురు డిజైనర్లు రెడీ చేసిన వస్త్రాలని రకుల్, భగ్నానీ ధరించబోతున్నారు. పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.