MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ గా మొదటి సంపాదనతో రకుల్ ప్రీత్ సింగ్ ఏం చేసిందో తెలుసా...?

హీరోయిన్ గా మొదటి సంపాదనతో రకుల్ ప్రీత్ సింగ్ ఏం చేసిందో తెలుసా...?

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి.. టైమ్ పాస్ కు హీరోయిన్ అయిన రకుల్ తన మొదటి సంపాదనతో ఏం చేసిందో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 22 2022, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కెరటం సినిమాలో ఓ చిన్న పాత్రతో టాలీవుడ్ కు పరిచయం అయిన  రకుల్‌  ప్రీత్ సింగ్... సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌  సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాకు ఫిలింఫేర్‌ అవార్డు అందుకుంది.

28

సినిమాల్లో నటిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు అంటోంది   రకుల్ ప్రీత్ సింగ్. పాకెట్‌ మనీకోసం మొదటి సినిమాకు ఒప్పుకొన్నా. ఆ తర్వాత నా భవిష్యత్తును ఇందులోనే వెతుక్కున్నా. ఇదే మంచి ఎంపిక అనిపించింది. అంటోంది బ్యూటీ. సినిమా టేస్ట్ దొరకడంతో వదిలిపెట్టలేక పోయానంటోంది. 
 

38

అంతే కాదు తన మొదటి సంపాదన గురించి రకుల్ చెపుతూ...  నా మొదటి సంపాదనతో కారు యజమాని అయ్యాను. నిజంగా అదో గొప్ప అనుభూతి అంటూ..  తన కెరీర్‌ స్టార్టింగ్ డేస్ ను గుర్తుకు చేసుకుంది బ్యూటీ. 2011లో ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో రకుల్‌ ఐదు రౌండ్లలో గెలిచింది. ఐదు సబ్‌ టైటిళ్లనూ అందుకుంది.
 

48

టాలీవుడ్‌లో యంగ్ హీరోలతో పాటు సీనియర్‌ స్టార్‌ మీరోలతో కూడా ఆడిపాడిన ముద్దుగుమ్మ నాగార్జున సరసన మన్మథుడు-2   సినిమాలో మెరిపించింది. ఇక మరో సౌత్ సీనియర్ హీరో కమల్ హాసన్   జంటగా భారతీయుడు 2లో కనిపించబోతోంది. 

58

ఇక బాలీవుడ్ లో అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌ వంటి సీనియర్లతో పాటు సిద్ధ్దార్థ్‌ మల్హోత్రా, ఆయుష్మాన్‌ ఖురానా  లాంటి యంగ్ స్టార్స్ తో కూడా జంటగా నటించించింది బ్యూటీ.  తమిళంలో కూడా కార్తీ లాంగ్ స్టార్స్ తో చేసింది.. కమల్ లాంటి సీనియర్లతో నటించబోతోంది. 

68

సోషల్ మీడియాలో  ఫుల్ యాక్టీవ్ గా ఉండే రకుల్ ప్రీత్... తిండి విషయంలో మహా జాగ్రత్తగా ఉంటుంది దే దే ప్యార్‌ దే సినిమాకోసం 50 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గి హీరోలే కాదు, హీరోయిన్లూ సినిమా కోసం శరీరాకృతిని మార్చుకోగలరని నిరూపించింది. 

78

ప్రస్తుతం తొమ్మిది సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌, గతంతో పోలిస్తే మరీ సన్నబడింది. బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తుండటంతో తెలుగు సినిమాల్లో బొత్తిగానల్లపూసైపోయింది. రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ను పరియం చేసిన రకుల్ ప్రీత్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 
 

88

 కాబోయే భర్త జాకీ భగ్నానీతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది.  అంతేకాదు రకుల్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ స్టార్ట్‌ చేసి వంటలు, ఫ్యాషన్‌కు సంబంధించిన వీడియోలులతో తానే సందడి  చేయబోతున్నట్టు వెల్లడించింది. ఇక సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ద్వారా కూడా తన సినిమాల సంగతులు పంచుకుంటానని చెప్పింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Recommended image2
55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
RB Choudary: దళపతి విజయ్‌ తో భారీ ప్లాన్, కోరిక తీరకుండానే ఆర్.బి.చౌదరి కన్నుమూత..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved