- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ స్టిల్స్.. టాప్ గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్!
బ్లాక్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ స్టిల్స్.. టాప్ గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్!
ఫిట్ నెస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఎలాంటి అవుట్ ఫిట్ లోనైనా అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంటోంది. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్ లో ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

రీసెంట్ గా మాల్దీవుల్లో రచ్చరచ్చ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తిరిగి వచ్చింది. ఇక తన పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అభిమానులు, నెటిజన్లను ఆకట్టుుకునేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. లేటెస్ట్ గా ట్రెండ్ లో ఉన్న అవుట్ ఫిట్స్ ను ధరించి.. తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తోంది. ఎప్పుడూ తన బాడీని స్లిమ్ గా ఉంచుకునేందుకు ఎంతలా వర్కౌట్స్ చేస్తుందో తెలిసిందే.
మరోవైపు రోజురోజుకు సరికొత్తగా దర్శనమిస్తూ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తోంది. స్లిమ్ ఫిట్ అందాలకు సరిపడా దుస్తులను ఎంచుకుంటూ.. నయా కలెక్షన్స్ తో తన అభిరుచిని తెలియజేస్తోంది. ట్రెడిషనల్ వేర్ అయినా, వెస్ట్రన్ వేర్స్ అయినా రకుల్ అదరగొడుతోంది.
తాజాగా పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదిరిపోయే అవుట్ ఫిట్ లో రకుల్ గ్లామర్ విందు కూడా చేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. అమ్మడు అందాల ప్రదర్శనకు నెటిజన్లు కూడా ఖుషీ అవుతూ ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు సినిమాలకు ప్రస్తుతం దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇలా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. ఇలా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లలో అందాలను ఆరబోస్తూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది.
బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రకుల్. ఇప్పటికే హిందీలో ఐదు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒక చిత్రం ‘థ్యాంక్ గాడ్’ రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో నెట్టింట సందడి చేస్తోంది. మరోవైపు ‘ఇండియన్ 2’, తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.