MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Dhurandhar 2 Director: ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌తో `ధురంధర్‌ 2` దర్శకుడి మూవీ.. `వారణాసి` కూడా నిలవదు

Dhurandhar 2 Director: ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌తో `ధురంధర్‌ 2` దర్శకుడి మూవీ.. `వారణాసి` కూడా నిలవదు

Dhurandhar 2: `ధురంధర్‌ 2` మూవీతో ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేస్తున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్‌. నెక్ట్స్ ఆయన ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌తో మూవీ చేయబోతున్నాడట. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 14 2026, 06:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధురంధర్‌ 2తో ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన ఆదిత్య ధర్‌
Image Credit : Asianet News

ధురంధర్‌ 2తో ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన ఆదిత్య ధర్‌

`ధురంధర్‌` సినిమాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు దర్శకుడు ఆదిత్య ధర్‌. బాలీవుడ్‌లో ఫేమస్‌ అయిన ఈ దర్శకుడు `ధురంధర్‌` చిత్రాలతో ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఆదిత్య ధర్‌.. హీరోయిన్‌ యామీ గౌతమ్‌ భర్త. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య ధర్‌ అంతకు ముందు `ఊరి` అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సమయంలోనే ఈ దర్శకుడి గురించి చర్చ స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు `ధురంధర్‌` చిత్రాలతో బాగా వినిపిస్తోంది. ఆయన రూపొందించిన `ధురంధర్‌` మొదటి భాగం ఏకంగా రూ.1300కోట్లకుపైగా కలెక్షన్లని సాధిస్తే, ఇప్పుడు `ధురంధర్‌ 2` ఇప్పటి వరకు రూ.1700కోట్లు దాటింది. `పుష్ప 2` వసూళ్లని దాటేయడానికి రెడీ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండియా బిగ్గెక్ట్ దర్శకుడిగా మారిన ఆదిత్య ధర్‌
Image Credit : instagram

ఇండియా బిగ్గెక్ట్ దర్శకుడిగా మారిన ఆదిత్య ధర్‌

ఈ నేపథ్యంలో `ధురంధర్‌ 2` దర్శకుడు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రకరకాల పేర్లు వినిపించాయి. మల్టీస్టారర్‌ మూవీ చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ లేటెస్ట్ గా మరో అదిరిపోయే వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్‌ నటుడా? టాలీవుడ్‌ నటుడా? కోలీవుడ్‌ నటుడా అనేది క్లారిటీ లేదు. అయితే తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఆ ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌ టాలీవుడ్‌ హీరో అని తెలుస్తోంది.

Related Articles

Related image1
Hero Change: పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, బాలకృష్ణ, రామ్‌ చరణ్‌ ఇకపై హీరోలు కాదు.. సినిమాలకు అసలైన హీరో ఎవరో తేలిపోయింది
Related image2
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
35
ప్రభాస్‌తో ఆదిత్య ధర్‌ మూవీ
Image Credit : Asianet News

ప్రభాస్‌తో ఆదిత్య ధర్‌ మూవీ

ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రభాస్‌ని పిలుస్తుంటారు. ఇమేజ్‌, మార్కెట్‌ పరంగా ఆయనే చాలా రోజులుగా బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. చాలా మీడియా మాధ్యమాలు, ఇండస్ట్రీ కూడా అదే భావిస్తోంది. దీంతో ధురంధర్‌ దర్శకుడు ఆదిత్య ధర్‌ నెక్ట్స్ మూవీ ప్రభాస్‌తోనే అనేది కన్ఫమ్‌ అవుతుంది. అయితే ఈ వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. కాకపోతే అది మల్టీస్టారర్‌ రూపంలో వినిపిస్తోంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం మేరకు ప్రభాస్‌తో ఆదిత్య ధర్‌ మూవీ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇటీవల ప్రభాస్‌, సందీప్‌రెడ్డి వంగా.. `ధురంధర్‌ 2` సినిమాని ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా వారుపోస్ట్ లు కూడా పెట్టారు. దీనికి ఆదిత్య ధర్‌ స్పందించి ఆనందం వ్యక్తం చేశారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో `స్పిరిట్‌` మూవీ కోసం వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభాస్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇదే ఇప్పుడు వీరి కాంబో సెట్‌ అయ్యిందనే వార్తలకు బలం చేకూరుతోంది. ఆదిత్య ధర్‌.. నెక్ట్స్ ప్రభాస్‌తోనేనా, లేదంటే బాలీవుడ్‌లో మరో పెద్ద హీరో(షారూఖ్‌ ఖాన్‌)తో ఉంటుందా అనది ప్రస్తుతానికి సస్పెన్స్.

45
రెండు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌
Image Credit : Asianet News

రెండు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌

ఇక ప్రభాస్‌ విషయానికి వస్తే, ఆయన భారీ లైనప్‌తో ఉన్నారు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` మూవీ రూపొందుతుంది. ఇమానీ ఇందులో హీరోయిన్‌. పీరియడ్‌ వార్‌, లవ్‌ స్టోరీగా ఈ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతోపాటు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` మూవీ రూపొందుతుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత `కల్కి 2` రూపొందే అవకాశం ఉంది. ఆ తర్వాత `సలార్‌ 2` ఉంది. ఇప్పుడు ఆదిత్య ధర్‌తో సినిమా సెట్‌ అయితే నెక్ట్స్ ఈ మూవీనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

55
వారణాసి రికార్డులు షేక్‌
Image Credit : Asianet News

వారణాసి రికార్డులు షేక్‌

ఆదిత్య ధర్‌ నెక్ట్స్ మూవీ ప్రభాస్‌తోనే అయితే ఈ కాంబినేషన్‌ ఊహించుకోవడానికి పూనకాలు వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వీరమాస్‌ దర్శకుడిగా, అంతకు మించిన ఊరమాస్‌ హీరో, అందులోనే బిగ్గెస్ట్ కటౌట్‌ ఉన్న హీరో, బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌ పడితే ఆ సినిమా వేరేలెవల్‌ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇండియాలో అత్యంత అంచనాలున్న మూవీ `వారణాసి`. ఇది అన్ని రికార్డులు బ్రేక్‌ చేయబోతుందనే భావన ఉంది. అయితే ప్రభాస్‌తో ఆదిత్య ధర్‌ సినిమా చేస్తే ఇది దాన్ని మించి ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?
Recommended image2
Vishwanath & Sons: రూ.250 కోట్ల సినిమా ఓటీటీలోకి..చాలా ఏళ్ళ తర్వాత సూర్య నుంచి వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ మూవీ
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సెలబ్రిటీల సొంత ఊరు ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Hero Change: పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, బాలకృష్ణ, రామ్‌ చరణ్‌ ఇకపై హీరోలు కాదు.. సినిమాలకు అసలైన హీరో ఎవరో తేలిపోయింది
Recommended image2
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved