MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాఖీ సావంత్‌కు అరెస్ట్ కు సుప్రీం కోర్ట్ ఆదేశం, బూతు వీడియో లీక్ కేసులో...

రాఖీ సావంత్‌కు అరెస్ట్ కు సుప్రీం కోర్ట్ ఆదేశం, బూతు వీడియో లీక్ కేసులో...

బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో రాఖీ సావంత్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతే కాదు వివాదాలతో ఆమె ఎక్కువ ప్రాచుర్యం పొందుతూంటుంది.

4 Min read
Surya Prakash
Published : Apr 23 2024, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Bollywood actress Rakhi Sawant

Bollywood actress Rakhi Sawant

బాలీవుడ్ నటి రాఖీ సావంత్(Rakhi Sawant)పూర్తిగా  చిక్కుల్లో ప‌డినట్లే. ఆమె ద‌ర‌ఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీష‌న్‌ను సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది.  అరెస్ట్ ని ఆపమని ,ఏంటిసిపేటరీ బెయిల్ ఇప్పించమని ఆమె కోర్టుని కోరారు. అయితే సోమవారం నాడు సుప్రీంకోర్టు ఆమె  రిలీఫ్ పిటిషన్‌ను  తిరస్కరించడంతో పాటు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని తీర్పు ఇచ్చారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటి..ఏ కేసులో ఆమె ఇరుక్కుంది?

212

 ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటుంది రాఖీ సావంత్. ఆమె నటిగా కన్నా వివాదాలతోనే బాగా ఫేమస్. అయితే ఆ వివాదాలు ఇలా ఒక్కోసారి పీకకు కూడా చుట్టుకుంటాయి. బిగ్‌బాస్‌ షోతో బాగా క్లిక్‌ అయింది రాఖీ సావంత్‌  గతంలో ఈమె రితేశ్‌ సింగ్‌ను పెళ్లాడింది. ఆల్‌రెడీ అతడికి పెళ్లైన విషయం ఆలస్యంగా తెలిసింది. అతడికి పెళ్లాంపిల్లలు ఉన్నందున తన పెళ్లి చెల్లదంటూ రితేశ్‌తో తెగదెంపులు చేసుకుంది. ఆ తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్‌ దురానీతో ప్రేమలో పడింది.

312

అదిల్ ని రహస్యంగా గా పెళ్లి చేసుకుని  ఆమె ఆ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టింది. కానీ వీరి బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. రాఖీ సావంత్, ఆదిల్ 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహబంధం ఎన్నో రోజులు కొనసాగలేదు. ఆరు నెలలైనా తిరక్కముందే ఆదిల్ తనను హింసిస్తున్నాడంటూ రాఖీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్ ను అరెస్ట్ చేశారు.  అతడితోనూ విడిపోయింది. ఆమధ్య మరోసారి ప్రేమలో పడ్డానంది కానీ దాని గురించి మళ్లీ మాట్లాడనేలేదు. 

412

 ఐదు నెలల తర్వాత జైలునుంచి విడుదలైన ఆదిల్.. రాఖీ తనను మోసం చేసిందన్నాడు. అంతకుముందు రితేశ్ సింగ్ ను పెళ్లి చేసుకున్న రాఖీ, అతనినుంచి విడాకులు తీసుకున్నానని అబద్ధం చెప్పి తనను వివాహం చేసుకుందని ఆరోపించాడు. ఆ తర్వాత ఆదిల్ నుంచి విడాకులు తీసుకున్నట్లు రాఖీ స్పష్టం చేసింది.
 

512

దీంతో ఆగ్రహించిన రాఖీ సావంత్ మరో అడుగు ముందుకు వేసి.. ఆదిల్ తన న్యూడ్ వీడియోలను రూ.47 లక్షలకు దుబాయిలో విక్రయించాడని ఆరోపించింది. ‘‘నేను బాత్ రూమ్ లో ఉన్నాను. అతడు షూట్ చేశాడు. అలాంటివి బోలెడు వీడియోలు ఉన్నాయి. నా శరీరం మొత్తం న్యూడ్ గా కనిపిస్తోంది. నేను అతడి భార్యను. అతడు నాపై అత్యాచారం చేశాడు.

612

నా వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ప్రపంచం అంతా నా వీడియోలను చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలి? ప్రపంచానికి నా ముఖాన్ని ఎలా చూపించాలి? నేను సాధారణ అమ్మాయిని కాదు. భారత్ లో సెలబ్రిటీని. విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలా?’’ అంటూ రాఖీ సావంత్ వాపోయింది.
 

712

ఆ తర్వాత రాఖీ సావంత్‌ తన మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీకి సంబంధించిన అశ్లీల వీడియోను లీక్ చేశారనే  కేసులో ఇరుక్కుంది . సావంత్ తన ప్రైవేట్ వీడియోలను అవీ లైంగిక అసభ్యకరమైన వీడియోలను మీడియా ఛానెల్‌లలో ప్రసారం చేసిందని ఆరోపిస్తూ దుర్రానీ ఫిర్యాదు చేశారు. ఆదిల్‌ దురానీపై పలు ఆరోపణలు చేసిన రాఖీ సావంత్‌ ఇదే విషయమై పలు టీవీ ఛానెల్స్‌, యూట్యూబ్‌ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఒక ఛానెల్‌తో మాట్లాడుతున్నప్పుడు, రాఖీ సావంత్ తనవి ఆదిల్ ప్రైవేట్ చిత్రాలు , వీడియోలను కెమెరాకు చూపించింది.  కొన్ని వాట్సాప్ గ్రూపులలో తనవి ఆదిల్ ప్రైవేట్ వీడియోలను కూడా పంచుకుంది. దాంతో తన ప్రైవేట్ చిత్రాలు, వీడియోలను లీక్ చేసినందుకు రాఖీపై ఆదిల్ దురానీ కేసు పెట్టారు.

812

తన మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీ తన అశ్లీల వీడియోలను సర్క్యులేట్ చేశాడని ఆరోపించడంతో నటి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, ‘ రాఖీ సావంత్ పంపిన వీడియోలు అసభ్యకరమైనవి మాత్రమే కాకుండా లైంగికంగా వేధించేవి కూడా. ఘటనకు సంబంధించిన వాస్తవాలు, ఆరోపణలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సరికాదని, దరఖాస్తును కొట్టివేసింది. 

912

త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు రాఖీ సావంత్ త‌న‌కు చెందిన ప్రైవేటు వీడియోల‌ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసింద‌ని దురానీ ఆరోపించారు. త‌న‌ను ఓ బోగ‌స్ కేసులో ఇరికించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని రాఖీ సావంత్ త‌ర‌పు న్యాయ‌వాది అలీ ఖాసిఫ్ ఖాన్ దేశ్‌ముక్ ఆరోపించారు. రాఖీ సావంత్ రిలీజ్ చేసిన వీడియోలు అస‌భ్య‌క‌రంగా ఉన్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. కేసు ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముంద‌స్తు బెయిల్ జారీ చేయ‌డం లేద‌ని సెష‌న్స్ జ‌డ్జి తెలిపారు.
 

1012

రాఖీపై ఆదిల్ ఖాన్ దుర్రానీ చేసిన ఆరోపణలు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 500 మరియు 34లో వరుసగా పరువు నష్టం మరియు నేరపూరిత ఉద్దేశంతో వ్యవహరించడం వంటివి ఉన్నాయి.    రాఖీ ఒక టెలివిజన్ టాక్ షోలో ఆదిల్ వీడియోను ప్రసారం చేసిందని, ఆ తర్వాత దానిని వాట్సాప్ మరియు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా షేర్ చేసిందని ఎఫ్‌ఐఆర్ లో ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67A ప్రకారం కోర్ట్ రాఖీ సావంత్ ని అరెస్ట్  చేయమంది. 
 

1112

మరోవైపు అదిల్‌ ఖాన్‌ రెండోసారి పెళ్లిపీటలెక్కాడు. హిందీ బిగ్‌బాస్‌(12వ సీజన్‌) కంటెస్టెంట్‌ సోమి ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. ఏడు నెలలుగా ఆమెతో ప్రేమలో ఉన్న అతడు చివరకు పెళ్లితో ఒక్కటయ్యాడు. అయితే ఇది తనకు రెండో పెళ్లి కాదని, మొదటి పెళ్లని చెప్తున్నాడు. అదెలాగో తర్వాతి రోజుల్లో చెప్తానన్నాడు.   అదిల్‌- సోమి ఖాన్‌ వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలను అదిల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమను ఆశీర్వదించమని కోరాడు. ఇది చూసిన జనాలు.. రాఖీతో ఎంగేజ్‌మెంట్‌.. షాదీ.. బ్రేకప్‌ జరిగిపోయాయి అని షాక్ అయ్యారు. 

1212

 రాఖీ సావంత్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా కష్టాలు అనుభవించిందట. ఆమె తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే పని చేయడం మొదలు పెట్టింది. చిన్నతనంలోనే పెళ్లిళ్లలో భోజనం వడ్డించింది రాఖి. ఆ పని చేసినందుకు ఆమెకు 50 రూపాయలు ఇచ్చే వారట. అయితే రాఖీ సినిమాల్లోకి రావడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదట. అయినా కూడా ఆమె సినిమాలోకి వచ్చింది. ఆతర్వాత ఎన్నో కాంట్రవర్సీ కామెంట్స్ చేసి పాపులారిటీ సొంతం చేసుకుంది. హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది .

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన
Recommended image2
Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
Recommended image3
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved