- Home
- Entertainment
- కొత్త ప్రియుడితో రాఖీ సావంత్ ఎంగేజ్మెంట్.. ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చిన నటి , మామూలు ట్విస్ట్ కాదుగా
కొత్త ప్రియుడితో రాఖీ సావంత్ ఎంగేజ్మెంట్.. ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చిన నటి , మామూలు ట్విస్ట్ కాదుగా
భర్త నుంచి విడిపోయిన కొన్ని నెలలకే రాఖీ మరో యువకుడితో ప్రేమలో పడింది. అదిల్ దురాని అనే వ్యక్తితో రాఖీ సావంత్ ప్రస్తుతం గాఢంగా ప్రేమలో మునిగితేలుతోంది.

రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. ఎలాంటి విషయం గురించి అయినా మొహమాటం లేకుండా మీడియా ముందు మాట్లేడేస్తుంది.
భర్త నుంచి విడిపోయిన కొన్ని నెలలకే రాఖీ మరో యువకుడితో ప్రేమలో పడింది. అదిల్ దురాని అనే వ్యక్తితో రాఖీ సావంత్ ప్రస్తుతం గాఢంగా ప్రేమలో మునిగితేలుతోంది. ఆమె వెలికి ఉంగరం కూడా కనిపిస్తుండడంతో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఫంక్షన్ లో రాఖీ సావంత్ తన కొత్త ప్రియుడితో మెరిసింది.
రాఖీ సావంత్ తన మాజీ భర్త రితేష్ విషయంలో జరిగిన వ్యవహారం లాంటిదే అదిల్ విషయంలో కూడా రిపీట్ అవుతోందా అనిపిస్తోంది. రితేష్ కు ఆల్రెడీ పెళ్లి అయింది. అతడు తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకపోవడంతో.. రాఖీ సావంత్ వివాహం చెల్లలేదు. దీనితో అతడి నుంచి ఆమె విడిపోవాల్సి వచ్చింది.
Rakhi Sawant
ఇప్పుడు అదిల్ విషయంలో రాఖీ సావంత్ కి కొత్త తలనొప్పి వ్యవహారం వచ్చిందట. అదిల్.. నటి రోషిన దెలవరి అనే యువ నటితో నాలుగేళ్లు రిలేషన్ లో ఉన్నాడట. ఇప్పుడు అదిల్ ని రాఖీ సావంత్ ప్రేమిస్తుండడంతో రోషిని రంగంలోకి దిగింది.
రోషిన తనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిందని రాఖీ సావంత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అదిల్ తనకు మాత్రమే సొంతం అని.. అతడి నుంచి దూరంగా వెళ్లాలని.. లేకపోతే ఊరుకోనని రోషిన బెదిరించినట్లు రాఖీ పేర్కొంది. దీని గురించి అదిల్ ని రాఖీ నిలదీసిందట.
తనతో గతంలో ప్రేమలో ఉన్న సంగతి వాస్తవమే అని ఆ తర్వాత విడిపోయామని అదిల్ చెప్పాడట. ప్రస్తుతం ఆమెతో ఎలాంటి రిలేషన్ లేదని రాఖీకి అదిల్ హామీ ఇచ్చాడట. దీనితో రాఖీ హ్యాపీగా ఫీల్ ఐంది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.