- Home
- Entertainment
- అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నన్ను కొనుక్కుంటే సన్నగా చేసేస్తా
అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నన్ను కొనుక్కుంటే సన్నగా చేసేస్తా
ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకేలా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక ఖర్చు 1200 కోట్లు దాటిపోయిందని వార్తలు వస్తున్నాయి.

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకేలా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక ఖర్చు 1200 కోట్లు దాటిపోయిందని వార్తలు వస్తున్నాయి. కేవలం హాలీవుడ్ పాప్ సింగర్ రిహన్న పెర్ఫార్మెన్స్ కే 50 కోట్లు సమర్పించుకున్నారు.
Anant Ambani
ఇలా దేశం మొత్తం అనంత్ అంబానీ పెళ్లి వేడుక గురించి మాట్లాడుకుంటుంటే.. కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్ మాత్రం మరో కోణంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అనంత్ అంబానీ అధిక బరువు సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది.
Rakhi Sawant
అంబానీ తనని 5 రోజుల పాటు కొనుక్కుంటే సన్నగా కట్టెపుల్లలా తయారు చేసి పంపిస్తానని కామెంట్స్ చేసింది. 'అంబానీజీ నమస్తే.. నేను మీఎకు బాగా ఉపయోగపడుతాను. నన్ను మీరు హయర్ చేసుకుని 5 రోజుల పాటు అనంత్ అంబానీని నా దగ్గరకు పంపండి. ఆయన బాగా బరువు ఉన్నారు. మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. అందుకే నాదగ్గరికి కేవలం 5 రోజులు పంపండి.
ఎలాంటి ఎక్సర్సైజ్ చేయిస్తానంటే.. ఆయన బాగా తృప్తి పొందుతారు. అంతేకాదు సన్నగా అవుతారు. నేను ఏం చేస్తానో మీరే అర్థం చేసుకోండి. 100 నుంచి 10 తీసేస్తే సున్నా మిగులుతుంది. అంతలా మీ కొడుకు జీరో సైజ్ అయిపోతాడు. అప్పుడు మీతో పాటు మీ కోడలు కూడా హ్యాపీ. నన్ను వెంటనే కొనుక్కోండి అంటూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
దీనితో నెటిజన్లు రాఖీ సావంత్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. అనంత్ అంబానీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వ్యక్తి గురించి ఇలా వల్గర్ గా మాట్లాడడానికి సిగ్గులేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అనంత్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
లక్షల కోట్లు ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించానని అనంత్ ఎమోషనల్ అయ్యాడు. నీతా అంబానీ కూడా అనంత్ ఆరోగ్య సమస్యలని వివరించింది. అనంత్ కి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది. దీనితో కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. అందువల్లే బరువు పెరిగాడు అని పేర్కొంది.