- Home
- Entertainment
- మహేష్, రవితేజ, రామ్ ఇలా స్టార్ హీరోలకు అదిరిపోయే కొరియోగ్రఫీ ఇచ్చిన రాకేష్ మాస్టర్..ఆయన ట్యాలెంటే వేరబ్బా
మహేష్, రవితేజ, రామ్ ఇలా స్టార్ హీరోలకు అదిరిపోయే కొరియోగ్రఫీ ఇచ్చిన రాకేష్ మాస్టర్..ఆయన ట్యాలెంటే వేరబ్బా
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణం టాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ వడదెబ్బకి గురయ్యారు. ఆల్రెడీ రాకేష్ మాస్టర్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణం టాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ వడదెబ్బకి గురయ్యారు. ఆల్రెడీ రాకేష్ మాస్టర్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనితో వడదెబ్బ తగలడంతో రాకేష్ మాస్టర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీనితో ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
రాకేష్ మాస్టర్ కి గొప్పగా ప్రచారం లభించలేదు కానీ లేకుంటే ఆయన ప్రతిభ ఈ తరం వాళ్ళకి కూడా తెలిసి ఉండేది. 90వ దశకం చివరి నుంచి రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. రవితేజ తనని కెరీర్ ఆరంభంలో బాగా ప్రోత్సహించారని రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్టార్ హీరోలు, చిన్న, మీడియం ఇలా అన్ని చిత్రాలు కలుపుకుని రాకేష్ మాస్టర్ దాదాపు 1500 చిత్రాలకు పనిచేశారు.
మానసిచ్చాను చిత్రంలో 'వెండితెరకి మా వందనాలు' అనే సాంగ్ కి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆ సాంగ్ లో యంగ్ రాకేష్ మాస్టర్ ని రవితేజ పక్కనే డ్యాన్స్ చేయడం చూడొచ్చు. ఆ సాంగ్ తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది అని రాకేష్ మాస్టర్ తెలిపారు. పొడవైన జుట్టుతో రాకేష్ మాస్టర్ యంగ్ ఏజ్ లో మంచి రిథమ్ తో డ్యాన్స్ చేసేవారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చేత కూడా రాకేష్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు వేయించారు. యువరాజు చిత్రంలో.. సూపర్ హిట్ సాంగ్ గుంతలకడి గుంతలకడి గుమ్మా అనే సాంగ్ ఆరంభంలో మహేష్ శ్రీకృష్ణుడి గెటప్ లో కనిపిస్తారు. ఆ పార్ట్ తో పాటు సాంగ్ లో మరికొంత భాగం రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చారు. అలాగే హీరో వేణు చిత్రాలు, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోల చిత్రాలకు ఎన్నో పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. నువ్ యాడికెళితే ఆడికొస్త సువర్ణ అనే సూపర్ హిట్ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించింది రాకేష్ మాస్టరే .
Rakesh Master
రాకేష్ మాస్టర్ కెరీర్ ని పీక్ కి తీసుకెళ్లిన చిత్రం దేవదాసు. అప్పట్లో వైవిఎస్ చౌదరి రాకేష్ మాస్టర్ పై బాగా నమ్మకం ఉంచేవారు. దేవదాసు చిత్రంలో పలు పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఓ సాంగ్ కి అయితే కొండల్లో భయంకరమైన విషసర్పాలు ఉన్న చోట కూడా కొరియోగ్రఫీ చేశానని పేర్కొన్నారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు ఇలా ఎన్నో చిత్రాలకు రాకేష్ మాస్టర్ అద్భుతంగ కొరియోగ్రఫీ ఇచ్చారు.
Rakesh Master
ఆట, ఢీ లాంటి షోలు రాకేష్ మాస్టర్ కి మరింతగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ కొంతకాలంగా రాకేష్ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. యూట్యూబ్ లో వైరల్ వీడియోలతో వార్తల్లో నిలుస్తున్నారు. కానీ సడెన్ గా 53 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడంతో టాలీవుడ్ మొత్తం షాక్ కి గురైంది. రాకేష్ మాస్టర్ ఆత్మకి శాంతి చేకూరాలని ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.