MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: అత్తకి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన దివ్య.. కోర్టులో అడ్డంగా బుక్కైన లాస్య!

Intinti Gruhalakshmi: అత్తకి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన దివ్య.. కోర్టులో అడ్డంగా బుక్కైన లాస్య!

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన కాపురాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న అత్తకి చుక్కలు చూపిస్తున్న కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Navya G
Published : Jun 10 2023, 08:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

 ఎపిసోడ్ ప్రారంభంలో బాగా నీరసంతో ఆఖరి బిందెతో నీళ్లు తెస్తుంది దివ్య. ఇదే ఆఖరి బింద దివ్య ఓపిక తెచ్చుకో అని చెప్తాడు విక్రమ్. దివ్య జాగ్రత్త అంటూ ఎంతో అభిమానం వలకబోస్తుంది రాజ్యలక్ష్మి. ఆకలి బిందువు కూడా అభిషేకం అయిపోవడంతో అమ్మ..అభిషేకం పూర్తయింది ఇప్పుడు హోమం చేయాలి. అఖండ దీపం చేత్తో పట్టుకోండి.

210

 హోమం అయిన వరకు దానిని చేత్తో పట్టుకొని హోమం పూర్తయిన తర్వాత హోమంలో వేయాలి అప్పుడు పూర్తిగా దోష నివారణ  జరుగుతుంది అంటారు పంతులుగారు. అఖండ దీపాన్ని చేత్తో పట్టుకొని ఓపిక లేక తూలిపోతూ ఉంటుంది దివ్య. దివ్య పడుతున్న బాధ చూడలేకపోతున్నాను ఇక ఈ పూజని పక్కన పెట్టేద్దాము అంటుంది రాజ్యలక్ష్మి.

310

తల అత్తగారి భుజం మీద పెట్టి పోసి నా పిచ్చి అత్త నేను పూజ చేస్తున్నది నీ కోసం కాదు మా నాన్న కోసం అయినా జైలు నుంచి విడుదల అవ్వాలని అంటూ చిన్నగా చెప్తుంది దివ్య. ఒక్కసారిగా షాక్ అవుతుంది రాజ్యలక్ష్మి. ఇక పూజ ఆపేయండి ఇక ఈ పూజ దివ్య చేయలేదు అంటుంది రాజ్యలక్ష్మి. నేను చేయగలను నాకు ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు అని మొండిగా చెప్తుంది దివ్య.

410

విక్రమ్ కూడా దివ్య నే సపోర్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే కోర్టులో సాక్షి కోసం జడ్జితో సహా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అతను ఎంతకీ రాకపోవడంతో కోర్టు టైము వేస్ట్ అవుతుంది అని చెప్పి కేసు క్లోజ్ చేయడానికి సిద్ధపడతారు జడ్జ్. సరిగ్గా అదే సమయానికి శేఖర్ కోర్టులోకి వచ్చి తన సాక్ష్యం వినిపిస్తాడు. నందుని ట్రాప్ చేసి తన వైపు తిప్పుకుందని, నా కొడుకుని నాకు ఇవ్వటం లేదు తను పట్టించుకోవడం లేదు అని చెప్తాడు శేఖర్.
 

510

అవును సార్ లాస్య ప్లాన్ ప్రకారం నందుని రెచ్చగొట్టి తనని కొట్టేలాగా చేసింది అప్పుడే వీడియో తీసి సాక్షానికి వాడుతుంది అంటాడు మాధవి భర్త. అవును సార్ అది నిజమే అందుకు నేనే సాక్ష్యం అంటూ లాస్య కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది భాగ్య. లాస్యనే బోనులోకి పిలిచి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు నిజమేనా అని అడుగుతాడు జడ్జ్.
 

610

ఇక వేరే దారి లేక తన తప్పు ఒప్పుకుంటుంది లాస్య. నందు తనకి ఎక్కడ దూరమైపోతాడో అని ఇదంతా చేశాను నందు లేకపోతే నేను బ్రతకలేను నాకు నందుతో కలిసి బ్రతికే అవకాశాన్ని ఇవ్వండి అని బ్రతిమాలుతుంది లాస్య. తనని నా జీవితంలోకి రానివ్వకండి నేను ఆ టార్చర్ భరించలేను దయచేసి మాకు విడాకులు ఇప్పించండి అని బ్రతిమాలితాడు నందు.
 

710

 నందగోపాల్ గారి మాటల్లో ఆవేదన ఆయన పడిన బాధ తెలుస్తుంది. కానీ మూడుముళ్ల బంధం అంత తేలికగా వదులుకునేది కాదు అందుకే లాస్యని నందగోపాల్ గారిని కలిసి నెల రోజులు ఉండమని తీర్పు ఇస్తున్నాము. అప్పటికీ కుదరకపోతే అప్పుడు విడాకులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి.. ఆడవాళ్ళ రక్షణ కోసం ఉపయోగించే చట్టాలని స్వార్థానికి వాడుకున్నందుకు మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాము.
 

810

 మళ్ళీ ఇలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని లాస్యకి చివాట్లు పెడతాడు జడ్జి. నందగోపాల్ ని జైలు నుంచి విడుదల చేస్తూ తీర్పు ఇస్తాడు. అందరూ ఎంతో ఆనందిస్తారు. అదే సమయంలో అఖండ దీపం హోమంలో వేస్తుంది దివ్య. అదే సమయంలో విక్రం కి ఫోన్ చేసి నందు విడుదలైనట్లుగా చెప్తారు తులసి వాళ్ళు. అదే విషయాన్ని దివ్యకి చెప్తాడు విక్రమ్.
 

910

 సంతోషంతో అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది దివ్య. పూజ నీకోసం చేస్తే రిజల్ట్ అక్కడ వచ్చింది ఏంటి అని అక్కని అడుగుతాడు. ఆ తాటకి పూజ చేసింది వాళ్ళ నాన్న కోసమే అని కోపంగా చెప్తుంది రాజ్యలక్ష్మి. ఒక్కసారిగా షాక్ అవుతాడు బసవయ్య. అమ్మవారి నిదర్శనాన్ని మొదటిసారి చూస్తున్నాను.
 

1010

అమ్మ.. ఇంక నీ ప్రాణానికి కూడా ఎలాంటి ప్రమాదము ఉండదు అని చెప్పి భార్యని లోపలికి తీసుకెళ్లి పోతాడు విక్రమ్. తరువాయి భాగంలో తన దగ్గరికి వచ్చిన భర్తతో అత్తయ్య అన్ని సమస్యలకి పరిష్కారం వెతుకుతున్నారు కానీ మన శోభనం విషయంలో ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేయటం లేదు మనసుతో ఆలోచించండి అని చెప్తుంది దివ్య.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
Recommended image2
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
Recommended image3
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved