Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • తమ కొడుకు చిత్రంతో సుమ, రాజీవ్ కనకాలకి భారీ నష్టం.. ప్రీరిలీజ్ ఈవెంట్స్ తో వచ్చిందంతా పోయిందా ?

తమ కొడుకు చిత్రంతో సుమ, రాజీవ్ కనకాలకి భారీ నష్టం.. ప్రీరిలీజ్ ఈవెంట్స్ తో వచ్చిందంతా పోయిందా ?

సుమ, రాజీవ్ కనకాల దంపతులు టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న సెలెబ్రిటీలు. సుమ యాంకర్ గా టాలీవుడ్ లో నంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్నారు. తెలుగులో హైయెస్ట్ పైడ్ యాంకర్ సుమనే కావడం విశేషం.

tirumala AN | Published : Apr 10 2025, 03:02 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Suma Kanakala

Suma Kanakala

సుమ, రాజీవ్ కనకాల దంపతులు టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న సెలెబ్రిటీలు. సుమ యాంకర్ గా టాలీవుడ్ లో నంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్నారు. తెలుగులో హైయెస్ట్ పైడ్ యాంకర్ సుమనే కావడం విశేషం. ఇక రాజీవ్ కనకాల టాలీవుడ్ లో సీనియర్ నటుడిగా కొనసాగుతున్నారు. 

25
Asianet Image

సుమ, రాజీవ్ కనకాల దంపతులకు ఒక కొడుకు, కుమార్తె సంతానం. 2023లో సుమ, రాజీవ్ కనకాల తమ కొడుకు రోషన్ ని హీరోగా లాంచ్ చేశారు. రోషన్ నటించిన తొలి చిత్రం బబుల్ గమ్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ రోషన్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రానికి డబ్బులు పెట్టింది సుమ, రాజీవ్ కనకాల దంపతులే. ఈ విషయాన్ని రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. 

35
Asianet Image

సుమ, రాజీవ్ ఈ చిత్రంతో చాలా డబ్బు నష్టపోయారట. కోట్లల్లో లాస్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. బబుల్ గమ్ మూవీతో మాకు మొత్తం నష్టమే. ఓటీటీ ద్వారా కొంత, శాటిలైట్ కొంత డబ్బులు వచ్చాయి తప్ప మిగిలిందంతా లాసే అని రాజీవ్ తెలిపారు. కోట్లల్లో నష్టం ఉంటుంది అని అన్నారు. 

45
Asianet Image

ఈ చిత్రంతో జరిగిన ఒకే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే రోషన్ నటనకి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ తర్వాత రోషన్ కోసం దాదాపు 70 కథలు వచ్చాయి. తన కొడుకు కోసం కథలు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని రాజీవ్ కనకాల తెలిపారు. త్వరలో ఏదో ఒక చిత్రం సెట్ కావాలని కోరుకుంటున్నట్లు రాజీవ్ తెలిపారు. ఇన్నేళ్ళలో సుమ కనకాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, టీవీ షోల ద్వారా కోట్లల్లో సంపాదించింది. 

55
Asianet Image

సంపాదించిన మొత్తంలో చాలా వరకు బబుల్ గమ్ చిత్రంతో నష్టపోయారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బబుల్ గమ్ చిత్రంలో కమర్షియల్ గా వర్కౌట్ కావడం కోసం లిప్ లాక్ సన్నివేశాలు కూడా పెట్టారు. కానీ అవి కూడా వర్కౌట్ కాలేదు. ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
తెలుగు సినిమా
వైరల్ న్యూస్
 
Recommended Stories
Top Stories