- Home
- Entertainment
- NTR: నువ్వు అడుగుపెట్టావు, ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అయ్యింది.. దెబ్బకి శ్రీనివాస్ రెడ్డి బాడీ షేకింగ్
NTR: నువ్వు అడుగుపెట్టావు, ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అయ్యింది.. దెబ్బకి శ్రీనివాస్ రెడ్డి బాడీ షేకింగ్
జూ ఎన్టీఆర్, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కలిసి చాలా సినిమాలు చేశారు. కానీ అనూహ్యంగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దానికి కారణం యాక్సిడెంట్ అట. తారక్‌కి జరిగిన రోడ్డు ప్రమాదం సమయంలో ఏం జరిగిందంటే?

శ్రీనివాస్ రెడ్డికి, ఎన్టీఆర్‌కి మధ్య గ్యాప్
ఎన్టీఆర్, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మంచి స్నేహితులు. కలిసి చాలా సినిమాలు చేశారు. కానీ ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దానికి అసలు కారణాలు రివీల్ చేశాడు శ్రీనివాస్ రెడ్డి. అసలు రోడ్డు ప్రమాదం సమయంలో ఏం జరిగింది.? తమ మధ్య గ్యాప్ కి కారణాలేంటి అనేది ఆయన రివీల్ చేశారు. షాకింగ్ విషయాలను పంచుకున్నారు.
తారక్‌తో గ్యాప్‌కి కారణం ఏంటంటే
ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తారక్ తో గ్యాప్‌పై ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తారక్ కి పెళ్లి కావడం, నాకు పెళ్లికావడం.. పాత్రలకు ఇంపార్టెన్స్ లేకపోవడం.. వేరే సినిమాలు చేయడం.. ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దానికి చుట్టుపక్కల వ్యక్తులు కారణం అవుతారు. తారక్‌కి ఆ ఆలోచన లేకపోయినా, చుట్టుపక్కల వాళ్లు కట్ చేయోచ్చు, చిన్నచిన్న మనస్పర్థాలకు ఇతరులు చెప్పే మాటలతో మరింత దూరం పెంచే అవకాశం ఉంది` అని చెప్పాడు.
`ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్టీఆర్ వేసిన ప్లాన్ అద్భుతం. ఖమ్మం ప్రచారంలో భారీగా సభ నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వరుసగా స్పీచ్‌లు ఇచ్చి ఎన్టీఆర్ అలసిపోతుంటారు. ఆయన్ని కూల్ చేసేందుకు, ఎంటర్‌టైన్ చేసేందుకు మేం నలుగురు కమెడియన్లం ఆయనతో వెళ్లేలా ప్లాన్ చేశారు. ఫ్రెండ్స్ ఉంటే రిలాక్స్ కావచ్చు. మొదట రాజీవ్ ఎంటర్ కావడం, తర్వాత సమీర్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత రఘు అన్నా వస్తాడు. చివర్లో ఖమ్మంలో నేను వస్తాను అని చెప్పాను. ఖమ్మంలో భారీ ఎత్తున సభ జరిగింది. వేలాది మంది జనం వచ్చారు. పెద్ద సక్సెస్ అయ్యింది.
ఎన్టీఆర్ కార్‌కి యాక్సిడెంట్
సభ అయిపోయిన తర్వాత మేమంతా కలిసి ఒక కారులో వెళ్లాల్సి ఉంది. అయితే నా బ్యాగ్ వెనకాల కారులో ఉంది. అది తీసుకొని వచ్చే లోపు మరో వ్యక్తి అందులో కూర్చున్నారు. దీంతో ఆ కారు వెళ్లిపోయింది. ఆ వెనకాల కారులో నేను వచ్చాను. కొద్ది దూరం వెళ్లాక కారు కింద పడి ఉంది, అందులో దారుణమైన స్థితిలో ఒకరున్నారు, మిగిలిన వాళ్లు కనిపించడం లేదు. తారక్ ఎక్కడా అని చూస్తే ఆ పిచ్చిగా ఉన్న వ్యక్తే ఎన్టీఆర్. వెంటనే సూర్యపేటలోని ఓ ఆసుపత్రికి తలరించాం, ఆతర్వాత కిమ్స్ కి తరలించి చికిత్స అందించాం.
గ్యాప్ క్రియేట్ అయ్యింది అక్కడే
అయితే ఆ సమయంలోనే వాళ్లలో ఒకరు ఒక మాట అన్నాడు. నువ్వు అడుగుపెట్టావ్, యాక్సిడెంట్ అయ్యిందని, ఆ దెబ్బకి నాకు బాడీ షేక్ అయిపోయింది. తట్టుకోలేకపోయాను. దీంతో వెంటనే కౌంటర్ ఇచ్చాను. నేను ఉండబట్టే ప్రాణాలతో వచ్చాడు, నేను లేకపోతే ఏమయ్యేదో అన్నాను. ఆ విషయం ఆయన వద్దకు వెళ్లిందా, ఎవరైనా ఏమైనా చెప్పారా? ఎవరో పక్కనుంచి ఇంకా లేనిపోనివి క్రియేట్ చేశారా తెలియదు. ఆ తర్వాత తారక్‌ని కలిశాను, అదే సరదా, అది బాండింగ్ ఉంటుంది. కానీ ఆ ఎటాచ్‌మెంట్ మాత్రం తగ్గింది. చిన్న గ్యాప్ అయితే వచ్చింది. మళ్లీ మేం మాట్లాడతాం, కలుస్తాం, క్లీయర్ చేసుకుంటాం. అయితే మేం కలిసే విషయంలో నా ప్రయత్న లోపం ఉంది. నా కూతురుకి ఏం పేరు పెట్టాలో తననే అడిగాను, అతను కూడా సలహా ఇచ్చాడు` అని తెలిపారు శ్రీనివాస్ రెడ్డి. ఇది చాలా రోజుల క్రితం నాటి ఇంటర్వ్యూ క్లిప్. ఇప్పుడు వీరి బాండింగ్ ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.

