MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజనీకాంత్ vs విజయ్ దళపతి.. ఫస్ట్ డే 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు ఎవరివి ఎక్కువ?

రజనీకాంత్ vs విజయ్ దళపతి.. ఫస్ట్ డే 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు ఎవరివి ఎక్కువ?

Rajinikanth vs Vijay: కోలీవుడ్ సినిమాలో మొదటి రోజే 100 కోట్ల వసూళ్లు రాబట్టడం అంటే అది రజనీకాంత్, విజయ్‌లకే సాధ్యం. అయితే, వీళ్లిద్దరిలో ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్‌లో ఎక్కువ సినిమాలు ఎవరివి ఉన్నాయో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 16 2026, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జైలర్ 2 సినిమాకు భారీ రెస్పాన్స్..
Image Credit : X

జైలర్ 2 సినిమాకు భారీ రెస్పాన్స్..

కోలీవుడ్ సినిమాలో రజనీకాంత్ తిరుగులేని సూపర్ స్టార్. ఆయనకు 75 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ ఎంతో యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో రజనీ నటించిన 'జైలర్ 2' నిన్న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు బయటికొచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
100 కోట్లు దాటిన జైలర్ 2 కలెక్షన్స్
Image Credit : others

100 కోట్లు దాటిన జైలర్ 2 కలెక్షన్స్

జైలర్ 2 సినిమా మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇండియాలో 75 కోట్లు, ఓవర్సీస్‌లో 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఏడాది రిలీజైన తమిళ సినిమాల్లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా జైలర్ 2 రికార్డ్ క్రియేట్ చేసింది. జైలర్ పార్ట్ 1 మొదటి రోజు 96 కోట్లు రాబట్టి తృటిలో 100 కోట్ల మార్క్‌ను మిస్ అయింది. ఆ లోటును జైలర్ 2 తీర్చేసింది. నిన్న ఒక్కరోజే ఈ మూవీ 125 కోట్లు కొల్లగొట్టింది.

34
100 ఓపెనింగ్స్ సాధించిన రజినీకాంత్ సినిమాలు
Image Credit : X

100 ఓపెనింగ్స్ సాధించిన రజినీకాంత్ సినిమాలు

జైలర్ 2 కంటే ముందు రజనీకాంత్ రెండు సినిమాలతో ఫస్ట్ డే 100 కోట్ల మార్క్ అందుకున్నారు. అందులో మొదటిది 2018లో వచ్చిన '2.0'. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ తొలిరోజే 115 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు రజనీకి 100 కోట్ల ఓపెనింగ్ రాలేదు. కానీ, గతేడాది వచ్చిన 'కూలీ' సినిమా మొదటి రోజే వరల్డ్ వైడ్‌గా 150 కోట్లకు పైగా రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు జైలర్ 2 కూడా చేరడంతో, రజనీ ఖాతాలో మొత్తం మూడు 100 కోట్ల ఓపెనింగ్ సినిమాలు ఉన్నాయి.

44
విజయ్ కెరీర్ లో 100 కోట్ల సినిమాలెన్ని..
Image Credit : X

విజయ్ కెరీర్ లో 100 కోట్ల సినిమాలెన్ని..

టాప్ హీరోగా ఉన్న విజయ్, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆయన ప్రజాసేవ కోసం సినిమాలకు దూరమయ్యారు. ఆయన నటించిన కొన్ని సినిమాలు ఫస్ట్ డే 100 కోట్లు దాటాయి. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన 'లియో' తొలిరోజే 149 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత 2024లో వచ్చిన 'గోట్' (GOAT) సినిమా 126.32 కోట్లు రాబట్టింది. మొత్తంగా విజయ్ కెరీర్‌లో రెండు 100 కోట్ల ఓపెనింగ్ సినిమాలు ఉన్నాయి.

గతేడాది వరకు రజనీకాంత్, విజయ్ ఇద్దరూ చెరో రెండు 100 కోట్ల ఓపెనింగ్ సినిమాలతో ఈక్వల్‌గా ఉన్నారు. కానీ, ఈ ఏడాది విజయ్‌ను రజనీ దాటేశారు. జైలర్ 2 మొదటి రోజే 125 కోట్లు రాబట్టడంతో, రజనీ 100 కోట్ల ఓపెనింగ్ సినిమాల సంఖ్య 3కి చేరింది. ఎప్పటికీ తానే సూపర్ స్టార్ అని రజనీకాంత్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ మాస్ రికార్డ్‌ను రజనీ ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
గవర్నమెంట్ జాబ్ వదిలేసి.. జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన కమెడియన్‌, యాక్టర్‌గా సక్సెస్
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని ఎయిర్ పోర్ట్ లో కలిసి రిక్వస్ట్ చేశా, నాకు మిగిలింది మాత్రం మొండి చెయ్యే
Recommended image3
Jailer 2 Collection Day 1: జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ, ఫస్ట్ డే సెంచరీ కొట్టిన రజనీకాంత్, రికార్డుల వేట.. 1000 కోట్లు పక్కా..
Related Stories
Recommended image1
గవర్నమెంట్ జాబ్ వదిలేసి.. జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన కమెడియన్‌, యాక్టర్‌గా సక్సెస్
Recommended image2
90s Biscuits: పార్లే-జీ నుంచి లిటిల్ హార్ట్స్ వరకు.. 90s కిడ్స్ ఎంతో ఫేవరెట్ బిస్కెట్స్ ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved