- Home
- Entertainment
- Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్, విక్రమ్.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్, విక్రమ్.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Top 5 Flop Movies: రిలీజ్‌కు ముందు ఓవర్ బిల్డప్ ఇచ్చి, తీరా థియేటర్లలోకి వచ్చాక అట్టర్ ఫ్లాప్ అయిన టాప్ 5 తమిళ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం. ఇందులో రజనీకాంత్, సూర్య, విక్రమ్, అజిత్ చిత్రాలుండటం గమనార్హం.

ఓవర్ హైప్ ఇచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు
ఓవర్ బిల్డప్ ఆరోగ్యానికి హానికరం అని ఊరికే అనలేదు. సినిమాలకు కూడా ఇది సూట్ అవుతుంది. ఓవర్ హైప్‌తో వచ్చిన చిత్రాలు ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమవుతుంటాయి. థియేటర్లలో డిజాస్టర్లుగా మిగులుతాయి. అలా తమిళ సినిమాలకు కూడా ఇది పక్కాగా సరిపోతుంది. రిలీజ్‌కు ముందు ఆకాశానికి ఎత్తేసి, తీరా సినిమా వచ్చాక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
5. ఐ
బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్ శంకర్ 2015లో తీసిన సినిమా 'ఐ'. ఇందులో చియాన్ విక్రమ్ హీరో. 'అన్నియన్' (అపరిచితుడు) లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విక్రమ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. టైటిల్ వెరైటీగా ఉందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ఓవర్ హైప్ ఇచ్చారు. కానీ థియేటర్‌లో సినిమా చూశాక, దీనికా ఇంత బిల్డప్ అని ప్రేక్షకులు పెదవి విరిచారు. కథలో పస లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది.
4. అంజాన్
సూర్య, లింగుసామి కాంబినేషన్‌లో 2014లో వచ్చిన సినిమా 'అంజాన్'. రిలీజ్‌కు ముందు సూర్య గెటప్ ఓ రేంజ్‌లో ట్రెండ్ అయింది. ఈ సినిమా దారుణంగా ట్రోల్ అవ్వడానికి దర్శకుడు లింగుసామి ఇచ్చిన ఇంటర్వ్యూనే ప్రధాన కారణం. "నేను నేర్చుకున్న విద్య అంతా ఇందులో దించేశాను" అని ఆయన చెప్పిన మాటలు విని థియేటర్‌కు వెళ్లిన అభిమానులకు భారీ నిరాశే ఎదురైంది. దీంతో అప్పట్లో ఈ సినిమాను జనాలు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.
3. లింగా
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా 'లింగా'. వీళ్ల కాంబినేషన్‌లో ముత్తు, పడైయప్ప లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లు రావడంతో, లింగాతో హ్యాట్రిక్ కొడతారని అభిమానులు ఆశించారు. అనారోగ్యం కారణంగా రజనీకాంత్ కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉండి, ఆ తర్వాత చేసిన తొలి సినిమా ఇదే. అందుకే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కానీ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ తప్ప మరేమీ వర్కవుట్ కాకపోవడంతో లింగా ఫ్లాప్ అయింది.
2. వలిమై
నటుడు అజిత్ కుమార్ కెరీర్‌లోనే భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'వలిమై'. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, రిలీజ్‌కు ముందు అప్‌డేట్స్ కోసమే బాగా ఫేమస్ అయింది. చిత్రబృందం అప్‌డేట్ ఇవ్వకపోవడంతో, అజిత్ అభిమానులు క్రికెట్ స్టేడియం నుంచి ఎన్నికల ప్రచారం వరకు వెళ్లిన ప్రతి చోటా అప్‌డేట్ అడిగి రచ్చ చేశారు. తీరన్ సినిమాలో లాగా ఓ మాస్ బస్ ఛేజింగ్ సీన్ ఉందని హైప్ ఎక్కించారు. కానీ సినిమా మాత్రం అభిమానులను శాటిస్‌ఫై చేయలేక ఫ్లాప్ అయింది.
1. కంగువ
ఓవర్ హైప్ వల్ల బోల్తా కొట్టిన సినిమాల లిస్టులో సూర్య 'కంగువ' కూడా ఉంది. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన చిత్రమిది. రిలీజ్‌కు ముందు మేకింగ్ వీడియో, ట్రైలర్ చూసి ఇది తమిళ సినిమాకే బాహుబలి అని బిల్డప్ ఇచ్చారు. అంతేకాదు, ఆడియో లాంచ్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా "ఇప్పుడు ఇచ్చిన పాస్‌ను జాగ్రత్తగా దాచుకోండి, వచ్చే నెల సక్సెస్ మీట్‌కు అవసరం అవుతుంది" అని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్పారు. సినిమా వేరే లెవెల్‌లో ఉంటుందని థియేటర్‌కు వెళ్లిన అభిమానులకు, చెవుల్లో రక్తం రాని లోటు మాత్రమే మిగిల్చింది కంగువ. తమిళ సినిమాలో ఇది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటి.

