అమెరికాలో ప్రముఖ హాస్పిటల్ ఎదుట కూతురు ఐశ్వర్యతో రజినీకాంత్.. వైరల్ గా మారిన ఫోటోస్!
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం రజినీకాంత్ భార్యతో లతతో కలిసి అమెరికా వెళ్లారు. ఇక రజినీకాంత్ ఆకస్మిక ప్రయాణం వెనుక కారణం రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కోసం అంటూ వార్తలు రావడం జరిగింది.
ఈ వార్తలను ధృవీకరిస్తూ తాజాగా అమెరికాలోని ఓ ప్రముఖ హాస్పిటల్ నుండి బయటికి వస్తున్న రజినీకాంత్ ఫోటో బయటికి వచ్చింది. ఆయన కూతురు ఐశ్వర్యతో పాటు మయో క్లినిక్ నుండి బయటికి వస్తున్నారు.
rajinikanth
rajinikanth 70ఏళ్ల రజినీకాంత్ కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన వైద్యం కోసం తరచుగా అమెరికా వెళ్లడం జరుగుతుంది. రజినీకాంత్ అమెరికా వెళ్లిన ప్రతిసారి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఏమవుతుందో అన్న భయం వ్యక్తం చేస్తున్నారు.
rajinikanth
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ చేయాలని మొదట భావించారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా, దేవుని ఆదేశం మేరకు ఆ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు రజినీ ప్రకటించారు. రజినీ ప్రకటన ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
రజినీకాంత్ రాజకీయాలలోకి రావలసిందే అంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలు చేశారు. ఆయన ఇంటి ఎదుట ధర్నాలకు దిగారు. అయినా రజినీకాంత్ తన నిర్ణయం మార్చుకోలేదు.
ప్రస్తుతం ఆయన దర్శకుడు శివతో అన్నాత్తే మూవీ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. కీర్తి సురేష్, మీనా, కుష్బు లతో పాటు జగపతిబాబు ఈ మూవీలో నటిస్తున్నారు.
ఇక ఈ అమెరికా ట్రిప్ లో రజినీకాంత్ అల్లుడు ధనుష్ ని కూడా కలిసే అవకాశం కలదు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ది గ్రే మాన్ షూటింగ్ కోసం ధనుష్ లాస్ ఏంజెల్స్ లో ఉన్నట్లు సమాచారం.