MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `కూలీ` మూవీ తెలుగు రైట్స్ ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. ఏకంగా ముగ్గురు పోటీ, దక్కిందెవరికంటే?

`కూలీ` మూవీ తెలుగు రైట్స్ ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. ఏకంగా ముగ్గురు పోటీ, దక్కిందెవరికంటే?

రజనీకాంత్‌, నాగార్జున నటించిన `కూలీ` చిత్రం తెలుగు రైట్స్ కి సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. షాకింగ్‌ రేట్‌కి ముగ్గురు నిర్మాతలు ఈ రైట్స్ ని తీసుకున్నారట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 25 2025, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రజనీకాంత్‌ `కూలీ` మూవీకి భారీ డిమాండ్‌
Image Credit : our own

రజనీకాంత్‌ `కూలీ` మూవీకి భారీ డిమాండ్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం `కూలీ` సినిమాలో నటిస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ ఖాన్‌ వంటి బిగ్‌ స్టార్స్ నటిస్తుండటంతో సినిమా రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా మూవీకి పర్‌ఫెక్ట్ గా నిలిచింది.

 అదే సమయంలో అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే ఓవర్సీస్‌ రైట్స్ విషయంలో దుమ్మురేపింది. అక్కడి రైట్స్ ఏకంగా రూ.80కోట్లకు అమ్ముడు పోయాయట. ఇప్పుడు తెలుగు రైటర్స్ పరంగానూ సత్తా చాటుతోంది.

25
`కూలీ` తెలుగు రైట్స్ ఎంతంటే?
Image Credit : Twitter

`కూలీ` తెలుగు రైట్స్ ఎంతంటే?

లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు రైట్స్ కి సంబంధించిన సమాచారం లీక్‌ అయ్యింది. భారీ రేట్‌కి తెలుగు స్టేట్స్ రైట్స్ అమ్ముడు పోయాయట. ముగ్గురు నిర్మాతలు ఈ రైట్స్ కోసం పోటీ పడ్డారట. 

అయితే చివరికి ముగ్గురు కలిపి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సునీల్‌ నారంగ్‌, సురేష్‌ బాబు, దిల్‌ రాజు కలిసి ఈ మూవీ కోసం ఏకంగా రూ.48 కోట్లు పెట్టినట్టు సమాచారం.

 సినిమాకి బజ్‌ ఉన్న నేపథ్యంలో, పైగా లోకేష్‌ కనగరాజ్‌ మూవీ కావడంతో ఇంత భారీ రేట్‌కి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

Related Articles

Related image1
రజినీకాంత్ కూలీ సినిమా పేరు మారింది, కొత్త టైటిల్ ఏంటో తెలుసా?
Related image2
ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే పవన్‌ కళ్యాణ్‌ ఇంట్లో ఆమెకి భయపడాల్సిందే.. ఎవరా రూలర్‌ ?
35
`కూలీ` తెలుగు బిజినెస్‌లో నాగార్జున క్రేజ్‌
Image Credit : Asianet News

`కూలీ` తెలుగు బిజినెస్‌లో నాగార్జున క్రేజ్‌

ఇదిలా ఉంటే ఈ రైట్స్ విషయంలో నాగార్జున ప్రభావం కనిపిస్తుంది. ఆయన ఇటీవల నటించిన `కుబేర` చిత్రం మంచి ఆదరణ పొందింది. హిట్‌ దిశగా వెళ్తుంది. తెలుగులో ఈ చిత్రం భారీ వసూళ్లని రాబడుతుంది. 

తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఓవర్సీస్‌ అన్నీ కలిపి ఓ ఎత్తైతే, తెలుగు కలెక్షన్లు అంతకు మించి ఉన్నాయి. దీంతో సినిమా మంచి వసూళ్లని రాబట్టింది. అందులో నాగార్జున, శేఖర్‌ కమ్ముల ల ప్రభావం స్పష్టంగా కనిపించింది.

45
`కూలీ`లో విలన్‌గా కనిపించబోతున్న నాగార్జున
Image Credit : X

`కూలీ`లో విలన్‌గా కనిపించబోతున్న నాగార్జున

అదే మ్యాజిక్‌ `కూలీ` విషయంలో వర్కౌట్‌ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. పైగా ఈ మూవీలో నాగార్జున పాత్ర మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందట. ఆయనది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తోంది. 

లోకేష్‌ సినిమాల్లో విలన్‌ పాత్ర అయినా చాలాస్ట్రాంగ్‌గా ఉంటుంది. పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నటుడిగా ఎలివేట్‌ అవ్వడానికి ఉంటుంది. అదే ఉద్దేశ్యంతో నాగ్‌ ఈ మూవీ చేసినట్టు సమాచారం. 

ఇప్పటికే నాగ్‌కి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్‌ లీక్‌ గూస్‌బంమ్స్ తెప్పించింది. అంచనాలను పెంచేసింది. ఇదంతా తెలుగు రైట్స్ డిమాండ్‌ పెరగడానికి కారణమయ్యిందని చెప్పొచ్చు.

55
గోల్డ్ స్మగ్లింగ్‌ నేపథ్యంలో `కూలీ`
Image Credit : Instagram

గోల్డ్ స్మగ్లింగ్‌ నేపథ్యంలో `కూలీ`

ఇక లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన `కూలీ` చిత్రంలో రజనీకాంత్‌ హీరోగా నటించగా, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమీర్‌ ఖాన్‌ గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. 

క్లైమాక్స్ లో ఆయన ఎంట్రీ ఇచ్చి అదరగొడతాడని అంటున్నారు. సన్‌ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించింది. ఇందులో పూజా హెగ్డే ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా దీన్ని రిలీజ్‌ చేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. లోకేష్‌ మార్క్ యాక్షన్‌ ఇందులో హైలైట్‌గా ఉండబోతుందని టాక్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Trisha: ఇక దాచిపెట్టేది ఏమీ లేదు.. మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష
Recommended image2
Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్, స్టార్ హీరోతో రొమాన్స్.. ఇక దశ తిరిగినట్లే
Recommended image3
Mamitha Baiju: మమితా యాక్టింగ్‌కు రాధికా ఫిదా..స్టార్ హీరోయిన్ కి నోట మాట రాలేదట!
Related Stories
Recommended image1
రజినీకాంత్ కూలీ సినిమా పేరు మారింది, కొత్త టైటిల్ ఏంటో తెలుసా?
Recommended image2
ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే పవన్‌ కళ్యాణ్‌ ఇంట్లో ఆమెకి భయపడాల్సిందే.. ఎవరా రూలర్‌ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved