MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajinikanth: హీరోయిన్‌ ని చూసి డైలాగ్‌ మర్చిపోయిన రజనీ.. 60ఏళ్ల సూపర్‌స్టార్‌ని ఫిదా చేసిన నటి ఈమెనే

Rajinikanth: హీరోయిన్‌ ని చూసి డైలాగ్‌ మర్చిపోయిన రజనీ.. 60ఏళ్ల సూపర్‌స్టార్‌ని ఫిదా చేసిన నటి ఈమెనే

Rajinikanth: రజనీకాంత్‌ ఓ హీరోయిన్‌ని చూసి ఫిదా అయిపోయాడట. తన ముందుకు రాగానే ఆమె అందాన్ని చూసి డైలాగ్‌ మర్చిపోయాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 07 2026, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
75ఏళ్లలోనూ హీరోగా రాణిస్తున్న రజనీకాంత్‌
Image Credit : Rajinikanth\Instagram

75ఏళ్లలోనూ హీరోగా రాణిస్తున్న రజనీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవలే 75ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రేజీ సినిమాలతో రాబోతున్నారు. ఆయన త్వరలో `జైలర్‌ 2` మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. దీంతోపాటు కమల్‌ హాసన్‌ ప్రొడక్షన్‌లో మూవీ చేస్తున్నారు. ఇలా ఈ ఏజ్‌లో కూడా హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్న ఏకైక ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కావడం విశేషం.

25
హీరోయిన్‌ని చూసి డైలాగ్‌ మర్చిపోయిన రజనీకాంత్‌
Image Credit : Rajinikanth\Instagram

హీరోయిన్‌ని చూసి డైలాగ్‌ మర్చిపోయిన రజనీకాంత్‌

ఇదిలా ఉంటే యాభై ఏళ్లు దాటయంటే అబ్బాయిల్లో అమ్మాయిలపై అంతగా ఆకర్షణ ఉండదు. తగ్గిపోతుంది. కానీ రజనీకాంత్‌ ఆరవై ఏళ్లలోనూ అమ్మాయికి ఫిదా అయ్యారట. ఓ హీరోయిన్‌ని చూసి మైండ్‌ బ్లాక్‌ అయిపోయిందట. డైలాగ్‌ మార్చిపోయాడట. ఆమె అందాన్ని చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదట. ఈ విషయాన్ని రజనీకాంత్‌ స్వయంగా వెల్లడించడం విశేషం.

Related Articles

Related image1
Chandra Hass: జేడీ చక్రవర్తిది డబుల్‌ ఫేస్‌.. తిరగబడ్డ చంద్రహాస్‌.. పెద్ద సినిమాలను టార్గెట్‌ చేస్తూ కౌంటర్‌
Related image2
MSG 26th Day Collections: `మన శంకర వర ప్రసాద్‌ గారు` ఓటీటీ డేట్‌.. చిరంజీవి సినిమా 26 రోజుల కలెక్షన్లు
35
ఐశ్వర్య హీరోయిన్‌ అని చెప్పగానే ఆనందంతో గంతులు
Image Credit : Rajinikanth\Instagram

ఐశ్వర్య హీరోయిన్‌ అని చెప్పగానే ఆనందంతో గంతులు

రజనీకాంత్‌ 15ఏళ్ల క్రితం `రోబో` చిత్రంలో నటించారు. శంకర్‌ దీనికి దర్శకుడు. ఇందులో ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె హీరోయిన్‌ అని చెప్పినప్పుడే షాక్‌ అయ్యారట. లోలోపల సంతోషంతో ఎగిరి గంతేశాడట. ఈ విషయాన్ని `రోబో` ఈవెంట్‌లోనే రజనీకాంత్‌ చెప్పారు. మరో సందర్భంలో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు రజనీకాంత్‌.

45
ఐశ్వర్యా రాయ్‌ని దగ్గరగా చూసి డైలాగ్‌ మర్చిపోయిన రజనీ
Image Credit : instagram/@aishwaryaraibachchan_arb

ఐశ్వర్యా రాయ్‌ని దగ్గరగా చూసి డైలాగ్‌ మర్చిపోయిన రజనీ

ఐశ్వర్య రాయ్‌ తన దగ్గరకు వచ్చే సీన్‌ ఒకటి ఉందట. తన లవ్‌ ట్రాక్‌కి సంబంధించిన సీన్‌ అది. ఐశ్వర్యా రాయ్‌ తన దగ్గరకు వచ్చిందట. ఆమెని అంత దగ్గర నుంచి చూసే సరికి సూపర్‌ స్టార్‌కి మతిపోయింది. ఆమె అందాన్ని చూసి మైండ్‌ బ్లాక్‌ అయ్యిందట. దీంతో చెప్పాల్సిన డైలాగ్‌ మర్చిపోయాడట. ఆ సమయంలోనే దర్శకుడిని పట్టుకుని `ఇది న్యాయం కాదు. ఆమె ఇంత అందంగా ఉన్నప్పుడు నేను మామూలుగా ఎలా నటించగలను` అని వెల్లడించారట. సరదాగా ఈ విషయాన్ని పంచుకున్నారు రజనీ. ఇప్పుడీ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

55
ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసిన రోబో
Image Credit : Facebook / Rajinikanth

ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసిన రోబో

రజనీకాంత్‌, ఐశ్వర్య రాయ్‌ జంటగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన `రోబో` మూవీ 2010లో విడుదలైంది. సంచలన విజయం సాధించింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. సౌత్‌లోనే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసింది. ఇందులో సైంటిస్ట్ గా, రోబోగా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. దుమ్మురేపారు. ఈ మూవీ చేసేటప్పుడు రజనీకాంత్‌ ఏజ్‌ 60ఏళ్లు. ఆ టైమ్‌లో కూడా ఆయన హీరోయిన్‌ని చూసి ఫిదా అయ్యాడంటే మామూలు విషయం కాదు, అది ఐశ్వర్య రాయ్‌ అందానికి సంబంధించిన గొప్పతనంగా చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
MSG 26th Day Collections: `మన శంకర వర ప్రసాద్‌ గారు` ఓటీటీ డేట్‌.. చిరంజీవి సినిమా 26 రోజుల కలెక్షన్లు
Recommended image2
Chandra Hass: జేడీ చక్రవర్తిది డబుల్‌ ఫేస్‌.. తిరగబడ్డ చంద్రహాస్‌.. పెద్ద సినిమాలను టార్గెట్‌ చేస్తూ కౌంటర్‌
Recommended image3
Karthika Deepam 2 Today Episode: స్వప్నను తాళి తీసేయమన్న శ్రీధర్- నోరుజారిన పారు-బాధలో దీప, కార్తీక్
Related Stories
Recommended image1
Chandra Hass: జేడీ చక్రవర్తిది డబుల్‌ ఫేస్‌.. తిరగబడ్డ చంద్రహాస్‌.. పెద్ద సినిమాలను టార్గెట్‌ చేస్తూ కౌంటర్‌
Recommended image2
MSG 26th Day Collections: `మన శంకర వర ప్రసాద్‌ గారు` ఓటీటీ డేట్‌.. చిరంజీవి సినిమా 26 రోజుల కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved