రజనీకాంత్ సినిమాని చూసి భయపడుతున్న నిర్మాతలు.. `కూలీ` తెలుగు రైట్స్ ఎంతంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే ఇండియా వైడ్‌గా ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. చాలా చోట్ల సాఫ్ట్ వేర్ కంపెనీలకు హాలీడేస్ ప్రకటిస్తారు. బెంగుళూరు వంటి సిటీస్‌లో ఇదే జరుగుతుంటుంది. అయితే ఆ క్రేజ్ ఇప్పుడు లేదు. రజనీకాంత్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోతున్నాయి. చాలా కాలం తర్వాత `జైలర్` సినిమా సత్తా చాటింది. రజనీ మార్కెట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ తర్వాత రెండు సినిమాలు డిజప్పాయింట్ చేశాయి.

rajinikanth coolie
సౌత్ సూపర్ స్టార్‌గా రాణిస్తున్న రజనీకాంత్ చివరగా `వేట్టయాన్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఆయన `కూలీ` చిత్రంతో రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే కాదు, ఇందులో కాస్టింగ్ కూడా అంచనాలను పెంచడానికి ఓ కారణమని చెప్పొచ్చు.
Lokesh Kanagaraj Rajinikanth Coolie film
ఈ మూవీలో తెలుగు నుంచి నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్ కనిపించబోతున్నారు. కన్నడ నుంచి ఊపేంద్ర కనిపిస్తారు. శృతి హాసన్ కూడా కనిపిస్తుంది. వీరితోపాటు పలువురు పాపులర్ యాక్టర్స్ ఇందులో నటించబోతున్నారు.
దీంతో కాస్టింగ్ పరంగానూ దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా లోకేష్ యూనివర్స్‌కి రజనీకాంత్ పడితే ఆ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీంతో ఆ అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు.
Lokesh Kanagaraj Rajinikanth Coolie film update
`కూలీ` సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో భారీ రేట్ కోట్ చేస్తున్నారు. దాదాపు 55 కోట్ల వరకు అడుగుతున్నారని తెలుస్తుంది. ఇంతటి భారీ మొత్తాన్ని పెట్టి తెలుగు రైట్స్ కొనేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఆ స్థాయిలో పెట్టలేమని తెగేసి చెబుతున్నారట.
rajinikanth coolie
రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ `జైలర్` కూడా తెలుగులో యాభై కోట్లు వసూలు చేయలేదు. అలాంటిది 55కోట్లు ఎలా పెడతామని భావిస్తున్నారట. ఈ అమౌంట్ పెట్టాలంటే ఈ మూవీ తెలుగులోనే వంద కోట్లకుపైగా వసూలు చేయాలి. మరి అది సాధ్యమా అనేది పెద్ద సస్పెన్స్. అందుకే తెలుగు నిర్మాతలు వెనకాడుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు రైట్స్ కి సంబంధించిన డైలమా కొనసాగుతుందట. మరి ఈ విషయంలో మేకర్స్ ఏం చేయబోతున్నారో చూడాలి. ఇక `కూలీ` మూవీ ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. అదే రోజు ఎన్టీఆర్ `వార్ 2` కూడా రిలీజ్ కానుంది. దీంతో `కూలీ`పై తెలుగులో గట్టి దెబ్బ పడే ఛాన్స్ ఉంది.
read more: