- Home
- Entertainment
- Heroes Without Makeup: మేకప్ లేకుండా స్టార్ హీరోలు.. అసలు రూపాలు చూస్తే ఫ్యూజులు ఔట్
Heroes Without Makeup: మేకప్ లేకుండా స్టార్ హీరోలు.. అసలు రూపాలు చూస్తే ఫ్యూజులు ఔట్
Heroes Without Makeup: సల్మాన్ ఖాన్ నుంచి సన్నీ డియోల్ వరకు, బాలీవుడ్‌లోని ఐదుగురు సూపర్ స్టార్లు 55 నుంచి 69 ఏళ్ల వయసు దాటారు. మేకప్ లేకుండా వీళ్లని చూస్తే షాక్ అవ్వాల్సిందే. తాతలను తలపిస్తున్నారు.

మేకప్ లేకుండా సూపర్ స్టార్స్ అసలు రూపాలు
రియల్ లుక్ తో షాకిచ్చిన సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ 1965 డిసెంబర్ 27న పుట్టారు. ఆయన వయసు ఇప్పుడు 60 ఏళ్లు. సినిమాల్లో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చే 'భాయ్ జాన్' ముఖంలో ఇప్పుడు వయసు ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల బయటకొచ్చిన ఒక ఫొటోలో ఆయన వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఇటీవల ఆయన `సికిందర్` చిత్రంలో నటించారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ ఆమె వయసు 29. వీరి మధ్య ఏజ్ గ్యాప్ 31ఏళ్లు కావడం విశేషం.
మేకప్ లేకుండా తాతలా కనిపిస్తున్న అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ 1965 మార్చి 14న జన్మించారు. ఆయన కూడా 60 ఏళ్ల వయసు దాటారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో మేకప్ లేకుండా కనిపించినప్పుడు, ఆయన తెల్ల జుట్టు, ముడతలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలి ఆయన సితారే జమీన్ పర్ (2025 చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో జెనీలియా డిసౌజా ఆయనతో కీలక పాత్రలో కనిపించారు. ఇద్దరి వయసు మధ్య దాదాపు 13 ఏళ్ల తేడా ఉండటం గమనార్హం.
అక్షయ్ కుమార్ అసలు లుక్ చూస్తే షాకే
బాలీవుడ్ 'ఖిలాడీ కుమార్' అక్షయ్ కుమార్‌కు ఇప్పుడు 58 ఏళ్లు. ఆయన 1967 సెప్టెంబర్ 9న పుట్టారు. ఫిట్‌నెస్‌లో ఇప్పటికీ అక్షయ్ అందరికీ ఆదర్శం. కానీ ఆయన గడ్డం మొత్తం తెల్లబడింది. ఇటీవల ఆయన వయసు పైబడిన లుక్‌లో కనిపించారు. ఇటీవల ఆయన`వెల్కమ్ టు ది జంగిల్ (2026) లో నటించారు. ఈ సినిమాలో దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి హీరోయిన్లు ఆయనతో నటిస్తున్నారు. దిశా ఆయన కంటే దాదాపు 25 ఏళ్లు చిన్నది కావడం గమనార్హం.
షారూఖ్ రియల్ లుక్
షారుఖ్ ఖాన్ 1965 నవంబర్ 2న జన్మించారు. ఆయన వయసు ఇప్పుడు 60 ఏళ్లు. మేకప్ లేకుండా ఎయిర్‌పోర్టుల్లో, ఇతర ప్రదేశాల్లో కనిపించినప్పుడు ఆయన ముఖంపై వయసు, తెల్ల గడ్డం, ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే సినిమాల్లో మేకప్, ఫిట్‌నెస్, VFX సహాయంతో యంగ్‌గా కనిపిస్తారు. ప్రస్తుతం ఆయన కింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్‌తో పాటు దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా ఈ సినిమాతోనే వెండితెరపై కనిపించనుంది.
సన్నీ డియోల్ మేకప్ లేని లుక్
సన్నీ డియోల్ 1956 అక్టోబర్ 19న పుట్టారు. ఆయన వయసు ఇప్పుడు 69 ఏళ్లు. మేకప్ లేని ఫొటోల్లో ఆయన వయసు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, సిల్వర్ స్క్రీన్‌పై ఆయన యాక్షన్ అవతార్‌కు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ఆయన జాట్ (2025) లో నటించారు. ఈ సినిమాలో ఆయనతో రెజీనా కసాండ్రా కీలక పాత్రలో నటించారు. ఆమె సన్నీ కంటే సుమారు 35 ఏళ్లు చిన్నది.

