- Home
- Entertainment
- నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఎర్ర చందనం దొంగ హీరోనా.. అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు వివాదం?
నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఎర్ర చందనం దొంగ హీరోనా.. అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు వివాదం?
పుష్ప 2 సినిమాపై అల్లు అర్జున్‌పై నటకిరీటి రాజేంద్రప్రసాద్ నోరు జారారు. ఇందులో ఎర్రచందనం దొంగగా బన్నీ నటించిన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రెస్ మీట్ ఏదైనా పాజిటివ్‌గా ఉంటాడు. అందరి గురించి పాజిటివ్‌గా మాట్లాడతాడు. అంతేకాదు బాగా ప్రశంసిస్తుంటాడు, కానీ ఆయన ఉన్నట్టుండి నోరు జారాడు. `పుష్ప 2` సినిమాపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజేంద్రప్రసాద్ తాజాగా `హరికథ` అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మ్యాగీ దీనికి దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్‌తోపాటు శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని వంటివారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఇది ఈ నెల 13 డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఈవెంట్ నిర్వహించింది టీమ్. ఇందులో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఇప్పుడు కలియుగంలో కథలు చాలా మారిపోయాయని తెలిపారు.
ఈ క్రమంలో వాడెవడో చందనం దొంగ వాడు హీరో అంటూ నోరు జారాడు రాజేంద్రప్రసాద్. కానీ ఆయన రెగ్యూలర్‌గానే మాట్లాడుతూ వెళ్లిపోయారు. అంతేకాదు తనపై తాను కూడా విమర్శలు చేసుకున్నారు. హీరోల్లో మీనింగ్‌లు మారిపోయాయని తెలిపారు.
`లేడీస్ టైలర్ వాడు హీరోనా, వాడు పెద్ద సన్నాసి, అప్పుల అప్పారావు హీరోనా, పేకాట పాపారావు హీరో, ఏప్రిల్ ఒకటో తారీఖలు వాడు పెద్ద దొంగ వాడు హీరోనా, కానీ మన సమాజంలో మన చుట్టూ, మన పక్కనే ఉన్న పాత్రలను తీసుకుని హీరోగా నటించి మెప్పు పొందాను అని తెలిపారు రాజేంద్రప్రసాద్.
ఈ సిరీస్ గురించి చెప్పినప్పుడు నామీద ఇంత పెద్ద సిరీస్ తీస్తారా అని ఆశ్చర్యపోయాను, నేనే చేయాలన్నప్పుడు సవాల్‌గా తీసుకున్నాను. ఇప్పటి వరకు నేను నమ్మిన కథలను జనం ఆదరించారు. నా నమ్మకం నిజమని తెలిపారు.
ఇప్పుడు అదే నమ్మకంతో చెబుతున్నా ఈ సిరీస్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇది చూసి దీన్ని థియేటర్లో ఎందుకు విడుదల చేయలేదని ప్రతి ఒక్కరు ఫీలవుతారు. అలా అనుకోకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ మరో బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చారు రాజేంద్రప్రసాద్.
`పుష్ప 2`పై, పరోక్షంగా అల్లు అర్జున్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. రాజేంద్రప్రసాద్ బన్నీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు సరికొత్త వివాదానికి తెరలేపుతున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ కూడా అలాంటి కామెంట్లే చేశారు. ఎర్రచందనం దొంగలను హీరోలుగా చేస్తున్నారంటూ పరోక్షంగా కామెంట్ చేశారు.
ఇప్పుడు రాజేంద్రప్రసాద్ సైతం నోరు జారడం షాకిస్తుంది. ఇప్పటికే పలు వివాదాల్లో ఉంది `పుష్ప 2`. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కి వెళ్లడం వల్ల తొక్కీసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది. వాళ్ల అబ్బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు రాజేంద్రప్రసాద్ ఇలాంటి కామెంట్ చేయడం చర్చనీయాంశం అవుతుంది. అయితే ఎన్ని వివాదాలు వచ్చినా ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృస్టిస్తుంది. ఇది నాలుగురోజుల్లో 829 కోట్లు వసూలు చేసినట్టు టీమ్ ప్రకటించింది.
also read: ఆస్తుల్లో టాప్ 10 హీరోయిన్లు..తమన్నా అనుష్క త్రిష సమంతలో టాప్ ఎవరు?