విజయ నిర్మల కాకుండా సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువ సినిమాలు చేసింది ఏ హీరోయిన్‌తోనో తెలుసా? ఏకంగా 45 చిత్రాలు!
సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్‌లో ఎక్కువగా భార్య విజయ నిర్మలతో సినిమాలు చేశారు. ఆమె తర్వాత ఓ హీరోయిన్‌తో ఆయన అత్యధిక సినిమాలు చేసి బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. మరి ఆమె ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్‌గా ఎదిగారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. 350కిపైగా సినిమాలు చేసి మెప్పించారు. అటు తొలి తరం ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతోపాటు ఇటు ఇప్పుటి స్టార్ హీరోలతోనూ కలిసి సినిమాలు చేశారు. హీరోగా అనేక సూపర్ హిట్స్ చేశారు. అనేక ప్రయోగాలు చేశారు. తెలుగు సినిమాలకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన హీరోగా నిలిచారు.
కృష్ణ 350 సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. వారిలో కొందరితో మాత్రం ఎక్కువ సినిమాలు చేశారు. రికార్డు స్థాయిలో విజయ నిర్మలతో ఏకంగా 50 సినిమాలకుపైగా చేశారు. వీరిద్దరు బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఉత్తమ జంటగా నిలిచిన విషయం తెలిసిందే. సినిమాల ద్వారా క్రియేట్ అయిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు.
విజయ నిర్మలతో కాకుండా సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన మరో హీరోయిన్ ఉంది. ఆమెనే జయప్రద. ఆమెతో ఏకంగా 45 సినిమాలు చేశారట. ఈ విషయాన్ని కృష్ణనే తెలిపారు. విజయ నిర్మలతో కాకుండా ఎక్కువ సినిమాలు చేసింది జయప్రదతోనే అని తెలిపారు.
తమని మంచి జోడీగా అంతా ప్రశంసించేవారని, తమ మధ్య కెమిస్ట్రీ కూడా అంత బాగా పండిందన్నారు. కలిసి చేసిన సినిమాల్లో చాలా వరకు విజయం సాధించినట్టు తెలిపారు సూపర్ స్టార్ కృష్ణ. తన కూతురు మంజులతో చిట్ చాట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు కృష్ణ.
కృష్ణ, జయప్రద కాంబినేషన్‌లో మొదటి సారి `శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్` అనే చిత్రం వచ్చింది. ఇది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత `మనవూరి కథ` సినిమాలో నటించారు. ఇది కూడా హిట్ కాలేదు. అనంతరం వీరి కాంబినేషన్‌లో వచ్చిన `ఈనాటి బంధం ఏనాటిదో` అనే సినిమా సక్సెస్ అయ్యింది, కానీ ఫ్యాన్స్ హ్యాపీగా లేరే, ఏదో వెలితి.
ఆ విషయం గమనించిన నిర్మాత డుండి గ్లామర్ పాళ్లు పెంచారు. కమర్షియల్ అంశాలు జోడించి `దొంగలకు దొంగ` సినిమా చేశారు. ఇందులో జయప్రదని కాస్త గ్లామర్‌గా చూపించారు. అదే సమయంలో పాటల్లో డాన్సులతోనూ హుషారెత్తించింది. దీంతో ఫ్యాన్స్ హ్యాపీ. ఇక ఈ పెయిర్‌కి బ్రహ్మరథం పట్టడం స్టార్ట్ చేశారు ఆడియెన్స్.
అలా వీరి కాంబినేషన్‌లో `సింహాసనం`, `కురుక్షేత్రం`, `ఊరుకు మొనగాడు`, `ముందడుగు`, `కృష్ణార్జునులు`, `మండే గుండెలు`, `సూర్య చంద్ర`, `ఏజెంట్ గోపీ`, `అడవి సింహాలు`, `చంద్రవంశం`, `మహాసంగ్రామం`, `విశ్వనాథ నాయకుడు`, `కొత్త అల్లుడు`, `కొత్తపేట రౌడీ`, `కుమారా రాజా`, `ఇద్దరు అసాధ్యులే`, `మహామనిషి`, `బంగారు కాపురం`, `భలే కృష్ణుడు`, `జతగాడు`,
`నివురు గప్పిన నిప్పు`, `యుద్ధం`, `సిరిపురం మొనగాడు`, `కృష్ణగారడి`, `అత్త మెచ్చిన అల్లుడు`, `పగబట్టిన సింహం`, `దొంగలకు సవాల్`, `నాయకులకు సవాల్`, `దొంగల వేట`, `అతని కంటే ఘనుడు`, `బండోడు గుండమ్మ`, `తేనేమనుషులు`, `మాయదారి అల్లుడు` వంటి సినిమాలు చేసి మెప్పించారు కృష్ణ, జయప్రద. సూపర్ స్టార్ కృష్ణ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
read more: దర్శకుడు రోజూ తాగి సెట్‌కి వచ్చేవాడు, బాలకృష్ణ సినిమా డిజాస్టర్ కారణం అతనే