- Home
- Entertainment
- Rajeev Kanakala: ఎన్టీఆర్ తనకు ఎవరూ లేరని మాట్లాడానికి కారణం ఇదే.. సంచలన విషయం చెప్పిన రాజీవ్ కనకాల
Rajeev Kanakala: ఎన్టీఆర్ తనకు ఎవరూ లేరని మాట్లాడానికి కారణం ఇదే.. సంచలన విషయం చెప్పిన రాజీవ్ కనకాల
ఎన్టీఆర్ ఆ మధ్య ఓ ఈవెంట్లో తనకు ఎవరూ లేరని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజీవ్ కనకాల స్పందించారు. ఆయన కామెంట్ల వెనుక ఉన్న నిజాలు బయటపెట్టారు.

నందమూరి వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్
జూ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. `నిన్ను చూడాలని` చిత్రంతో ఆయన హీరోగా పరిచయం అయ్యాడు. `స్టూడెంట్ నెం 1` చిత్రంతో హిట్ అందుకున్నాడు. `ఆది`, `సింహాద్రి` చిత్రాలతో స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. `ఆర్ఆర్ఆర్`తో ఆయన పాన్ ఇండియా హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.
మొదటి సినిమా టైమ్‌లో ఫ్యామిలీ తన వెంట లేదని ఎన్టీఆర్ కామెంట్
ఇదిలా ఉంటే ఆ మధ్య `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గెస్ట్ గా పాల్గొన్నాడు. తనకు కెరీర్ మొదట్లో ఎవరూ లేరని, మొదటి సినిమా ఓపెనింగ్‌కి ఒక్కడినే వెళ్లానని తెలిపారు. ఆ సమయంలో తన తండ్రి కూడా తన వెంట రాలేదని, అమ్మ రానని చెప్పిందని, కుటుంబం నుంచి ఎవరూ తనతో లేరని చెప్పారు. ఆ మధ్య ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై ఎన్టీఆర్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, రాజీవ్ కనకాల కెరీర్ బిగినింగ్ నుంచి ఫ్రెండ్స్. `స్టూడెంట్ నెంబర్ 1` టైమ్‌లో ఏర్పడిన పరిచయం ఇప్పటికీ సాగుతుంది. తారక్ బెస్ట్ ఫ్రెండ్స్ లో రాజీవ్ ఒకరిగా ఉన్నారు. అది ఎంతగా అంటే తారక్ ఉన్న ప్రతి సినిమాలో రాజీవ్ ఉండాల్సిందే.
ఎన్టీఆర్ కామెంట్స్ పై రాజీవ్ కనకాల రియాక్షన్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కామెంట్స్ పై రాజీవ్ కనకాల స్పందించారు. కెరీర్ బిగినింగ్‌లో తన వెంట ఎవరూ లేరనే మాట నిజమే అన్నారు. ఆ సమయంలో ఇద్దరు కజిన్స్ ఉండేవారని, స్నేహల్ ఒక ఫ్రెండ్, లవ్ రాజన్ అని మరో ఫ్రెండ్ ఉండేవారు, ఈ నలుగురే ఉండేవారు తప్ప ఆయనకు పెద్దగా ఎవరూ లేరని చెప్పారు. మేం పరిచయం అయ్యాక ఫ్రెండ్స్ గా యాడ్ అయ్యామని వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో చాలా ఎనర్జిటిక్ గా ఉండేవాడని, ఏ సీన్ అయినా ఈజీగా చేసేవాడని తెలిపారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ గురించి ఎమోషనల్ అవుతుంటాడు తప్పితే, ఎనర్జీ విషయంలో ఎవరూ సాటి రారని తెలిపారు రాజీవ్. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





