MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ తో విభేదాలపై.. రాజీవ్ కనకాల సంచలన కామెంట్స్, తారక్ కు ఫోన్ చేస్తే ఏమన్నాడంటే?

ఎన్టీఆర్ తో విభేదాలపై.. రాజీవ్ కనకాల సంచలన కామెంట్స్, తారక్ కు ఫోన్ చేస్తే ఏమన్నాడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయాని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో రాజీవ్ ఇచ్చిన క్లారిటీ ఏంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 24 2025, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్   రాజీవ్ కనకాల స్నేహం
Image Credit : Asianet News

ఎన్టీఆర్ - రాజీవ్ కనకాల స్నేహం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ -రాజీవ్ కనకాల మధ్య స్నేహం ఇప్పటిది కాదు. తారక్ ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 అప్పటి నుంచి వీరు బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఈసినిమా అయిపోయిన తరువాత ఎన్టీఆర్ తో రాజీవ్ ఓ మాట అన్నారు.. ''నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను.. నన్ను కూడా మార్చిపోవు కదా'' అని అడిగారు. దానికి ఎన్టీఆర్ కూడా '' నేను కూడా నిన్ను మర్చిపోను.. మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం'' అని మాటిచ్చారు. అప్పటి నుంచి వీరు బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల కనిపిస్తుంటారు. సినిమాల్లో మాత్రమే కాదు.. ఇద్దరు కలిసి గతంలో ఎన్నో టూర్లు వెళ్లిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలకు ఇద్దరు కలిసి హాజరైన సందర్భాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇద్దరి మధ్య విభేదాలు
Image Credit : Facebook / NTR Fans

ఇద్దరి మధ్య విభేదాలు

దాదాపు 25 ఏళ్లుగా ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహం కొనసాగుతోంది. ఈ ఇద్దరి ఫ్యామిలీల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే వీరి మధ్య విభేదాలు వచ్చినట్టు కొన్ని రూమర్స్ గతంలో వైరల్ అయ్యాయి. అశోక్ సినిమా టైమ్ లో వీరిమధ్య మనస్పర్ధలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ సినిమా విషయంలో వీరిద్దరు మాట మాట అనుకున్నారని టాక్. అయితే ఈ విషయంలో పలు ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇస్తూ వచ్చారు రాజీవ్ కనకాల. కానీ ఆయన ఎక్కడికి వెళ్లిన ఈ ప్రశ్న మాత్రం వదలిపెట్టడం లేదు. రీసెంట్ గా కూడా ఈ విషయంలో రాజీవ్ మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

35
రాజీవ్ కు ఫోన్ చేసిన తారక్
Image Credit : Asianet News

రాజీవ్ కు ఫోన్ చేసిన తారక్

ఎన్టీఆర్ తో విభేదాల విషయంలో క్లారిటీ ఇస్తూ.. రాజీవ్ కనకాల ఈ విధంగా వెల్లడించారు. '' నాకు అర్ధం కావడంలేదు.. మాకే తెలియకుండా మా మధ్య గొడవలు ఎప్పుడు జరిగాయి..ఇప్పుడే కాదు  ఇలాంటివి గతంలో కూడా చాలా వచ్చాయి.. ఓ ఏడేనిమిదేళ్ల క్రితమే ఇలాంటి వార్త ఒకటి స్టార్ట్ అయ్యింది. అది బాగా వైరల్ అయ్యింది. అప్పుడు నేను వెంటనే తారక్ కు ఫోన్ చేసి.. ఇదిగో ఇలా వస్తుంది.. ఏంటి, ఏంచేయాలి అని అడిగాను. వెంటనే తారక్ .. కంగారు పడకు.. ఇలాంటివి కామన్ గా వస్తుంటాయి, ముందు ముందు ఇంకా ఎక్కువ వస్తాయి.. నీ దగ్గరకు కూడా వచ్చి అడుగుతారు.. కానీ కంగారు పడకు, వాటిని పట్టించుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారు.. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటారు. అస్సలు పట్టించుకోవద్దు..'' అని ఎన్టీఆర్ ముందే చెప్పినట్టు రాజీవ్ కనకాల వెల్లడించారు.

45
గతంలో కూడా ఇలానే..
Image Credit : Asianet News

గతంలో కూడా ఇలానే..

ఈ విషయంపై గతంలో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాజీవ్ కనకాల. ఓ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీలో ఎవ్వరినీ వదులుకోను.. నన్ను దూరం పెట్టాలని భావిస్తే అది వారి ఇష్టం, ఎన్టీఆర్ కు, నాకు మధ్య విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం కొందరు సృష్టించిన పుకార్లు మాత్రమే, నాకు, ఎన్టీఆర్ కు విధేదాలు ఉంటే.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల్లో ఎందుకు నటిస్తాను అని రాజీవ్ కనకాల ప్రశ్నించాడు. అలాగని ఎన్టీఆర్ ప్రతి సినిమాలో నేను నటించాలంటే కుదరదు. అది దర్శకుల ఛాయిస్ అని కనకాల తెలిపాడు. ఎన్టీఆర్ నాకన్నా వయసులో చిన్నవాడు. మా ఫ్రెండ్ షిప్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని రాజీవ్ కనకాల గతంలోనే తెలిపాడు.

55
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే..
Image Credit : Asianet News

ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే..

పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ బిజీ అయిపోయాడు. దేవర,వార్2 లాంటి వరుస సినిమాలతో సందడి చేసిన ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే.. దేవర పార్ట్ 2 లో జాయిన్ అవ్వబోతున్నాడు తారక్. ఇక మరో వైపు రాజీవ్ కనకాల విషయం చూసుకుంటే.. టాలీవుడ్ లో రాజీవ్ కు నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజీవ్ కనకాల మునుపటిలా ఎక్కువ చిత్రాలు చేయడం లేదు. కానీ అప్పుడప్పుడూ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Related Stories
Recommended image1
1000 కోట్ల కలెక్షన్స్ కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్, కాంతార చాప్టర్ 1 నెక్ట్స్ రిలీజ్ ఎక్కడో తెలుసా?
Recommended image2
ప్రభాస్ టాప్ 10 సినిమాలు, 4 డిజాస్టర్లు.. 600 కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved