సుమ ముందే వెక్కి వెక్కి ఏడ్చిన రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ.. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వీళ్ళు ఇలా..
బుల్లితెరపై యాంకర్ సుమ ఒక రేంజ్ లో హంగామా చేస్తున్నారు. సుమ అడ్డా అనే షోకి ఆమె హోస్ట్ గా చేస్తున్నారు. సుమ షోకి సెలెబ్రిటీలు అతిథులుగా హాజరవడం చూస్తున్నాం. తాజాగా సుమ అడ్డా దావత్ అనే షోని ప్లాన్ చేశారు.
బుల్లితెరపై వచ్చే కామెడీ షోలు ఆడియన్స్ ని బాగా నవ్విస్తూ ఉంటాయి. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలు ఎంత పాపులారిటీ దక్కించుకున్నాయో తెలిసిందే. బుల్లితెరపై యాంకర్ సుమ కూడా ఒక రేంజ్ లో హంగామా చేస్తున్నారు. సుమ అడ్డా అనే షోకి ఆమె హోస్ట్ గా చేస్తున్నారు. సుమ షోకి సెలెబ్రిటీలు అతిథులుగా హాజరవడం చూస్తున్నాం. తాజాగా సుమ అడ్డా దావత్ అనే షోని ప్లాన్ చేశారు.
దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. వివిధ కళాకారుల ఆటపాటలు, కామెడీ పంచ్ లతో ప్రోమో రసవత్తరంగా ఉంది. రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, నటుడు సమీర్ ముగ్గురూ కలసి కామెడీ స్కిట్ చేసి నవ్వించారు. లేడీస్ పై పంచ్ లు వేస్తూ వీరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, యాంకర్ సౌమ్య రావు, ఇమ్మాన్యూల్, నూకరాజు, అరియనా ఈ షోలో సందడి చేశారు.
రాజీవ్ కనకాల.. సుమని ఆటపట్టిస్తూ తమని తాము శివుడు పార్వతితో పీల్చుకున్నారు. సౌమ్య రావు అయితే వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ హైపర్ ఆదితో కలసి కామెడీ చేసింది. మగధీర చిత్రంలో అనగనగా అనే సాంగ్ పాడిన సింగర్ జెస్సి కూడా ఈ షోలో సందడి చేశారు. తన మెస్మరైజింగ్ వాయిస్ తో పాటలు పాడి అలరించారు.
ఆ తర్వాత రాజీవ్ కనకాల, సుమ ఇద్దరూ కలసి తమ ప్రేమని ప్రదర్శితో లక్కీ భాస్కర్ చిత్రంలోని కోపాలు చాలండి శ్రీమతిగారు అనే పాటకి రొమాంటిక్ గా పెర్ఫామ్ చేశారు. చివర్లో స్టేజి మొత్తం ఎమోషనల్ గా మారిపోయింది. రాజీవ్ కనకాల, సుమ కలసి దేవదాస్ కనకాల, లక్ష్మి కనకాల స్టాచ్యూ లని ఆవిష్కరించారు. వీరిద్దరూ రాజీవ్ కనకాల తల్లిదండ్రులు. ఎన్ని జన్మల పుణ్యమో నేను వీరి కడుపున పుట్టాను అని రాజీవ్ కనకాల ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే బ్రహ్మాజీ కూడా వాళ్ళ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
నేను రాజీవ్ కనకాల తల్లిదండ్రులని మాస్టారు, మేడం అని పిలుస్తాను. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం వాళ్లే అని బ్రహ్మాజీ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. దేవదాస్ కనకాల తన యాక్టింగ్ స్కూల్ ద్వారా ఎందరో నటీనటుల్ని టాలీవుడ్ కి అందించారు. తమ ఫ్యామిలీ ఫోటో చూసి రాజీవ్ కనకాల వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ ఫొటోలో ముగ్గురు ఇప్పుడు లేరు.. నన్ను కన్నవాళ్ళు లేరు నా తోడ పుట్టిన సోదరి కూడా లేదు అంటూ రాజీవ్ కనకాల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజీవ్ కనకాలని చూసి అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. నటుడు సమీర్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 31న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా ఈ షో ప్రసారం కానుంది.