- Home
- Entertainment
- Guppedantha Manasu: వసు ముందే రిషిని కొట్టిన రాజీవ్.. టెన్షన్ పడుతున్న మహేంద్ర, జగతి..?
Guppedantha Manasu: వసు ముందే రిషిని కొట్టిన రాజీవ్.. టెన్షన్ పడుతున్న మహేంద్ర, జగతి..?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఈ రోజు ఏప్రిల్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎపిసోడ్ ప్రారంభంలో రిషి (rishi)కారులో వెళ్తూ వసు విషయంలో గౌతమ్ పై సీరియస్ అవుతాడు. వసు విషయంలో నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను నాకు ఏమయింది అని అనుకుంటూ ఉంటాడు. వసు(vasu) నన్ను ఎందుకు ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటాడు రిషి.
మరొకవైపు వసు రూమ్ కీ వెళ్లగా అక్కడ రాజీవ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వసు. అప్పుడు రాజీవ్(rajeev) కూర్చొ మాట్లాడుకుందాం అంటూ వసుకీ తాగడానికి నీళ్ళు ఇస్తాడు. ఇంతలో రిషి, వసుకీ కాల్ చేస్తాడు. అప్పుడు రాజీవ్ కాస్త దురుసుగా మాట్లాడడంతో వసు కోప్పడుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోమని కసురు ఉంటుంది.
ఒకవైపు రిషి, వసు పనిచేసే రెస్టారెంట్ కి వచ్చి కూర్చొని ఉంటాడు. అప్పుడు రిషి (rishi) ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు అని అడుగుతూ ఉండగా ఇంతలో రాజీవ్ హలో వెయిటర్ అని అంటాడు. అప్పుడు రాజీవ్ (rajeev) హలో రిషి సార్ ఎలా ఉన్నారు జిమ్ కీ వెళ్తున్నట్టున్నారు అని అనడంతో రిషి కోపంతో రగిలి పోతూ ఉంటాడు.
నాపై ఇంకా కోపం తగ్గలేదా సార్,చాలా రోజులు అయ్యింది కదా నా మరదలిని చూసి వెళ్దాం అని వచ్చాను అని అంటాడు రాజీవ్. హలో వసు(vasu) ఎప్పుడు మీ రిషి సార్ సేవలోనే తరిస్తావా, నాకు సేవలు చేయవా అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు వాడతాడు. వచ్చి నా ఆర్డర్ కుడా తీసుకో అని అంటాడు.
నువ్వు ఏమి రిషి(rishi) సార్ ప్రాపర్టీవి కాదు కదా అని అనడంతో అప్పుడు రిషి, రాజీవ్ పై సీరియస్ అవుతాడు. అప్పుడు కావాలనే వసు వాళ్ళ ఫ్యామిలీ గురించి సెంటిమెంట్ గా మాట్లాడుతూ వసు(vasu) ని ఇబ్బంది పెట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తరువాత రాజీవ్ కారులో వెళ్తూ వసు ని నా సొంతం చేసుకుంటాను అని అనుకుంటూ వెళ్తుంటాడు.
ఇంతలో రిషి,రాజీవ్ (rajeev)కార్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ తర్వాత వసు కీ కాల్ చేసి రాజీవ్ కార్ నేను ఫాలో అయ్యాను ఎటువంటి భయం లేదు నువ్వు జాగ్రత్తగా పడుకో అని అనడంతో వసు ఆనందపడుతుంది. మరొకవైపు రిషి(rishi)ఇంటికి రాకపోవడంతో జగతి బయటపడుతూ ఉంటుంది.
అప్పుడు మహేంద్ర(mahendra), రిషి కీ కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడగడంతో మీరు పడుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రిషి. జగతి(jagathi) రిషి గురించి బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు వసు పడుకుని ఉండగా ఇంతలో అక్కడికి రాజీవ్ వచ్చి వసుని భయపెడతాడు. అప్పుడు వసు, రిషి కీ ఎన్నిసార్లు చేసినా కాల్ లిఫ్ట్ చేయడు.
ఇంతలో రాజీవ్ తలుపులు తెరిచి వసు(vasu)రూమ్ లోకి వెళ్ళాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో వసు మీరు సమయానికి రాకపోతే నా జీవితం ఏమై ఉండేది సార్ అని ఎమోషనల్ అవుతూ ఉండగా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నేనే వసు అని అంటాడు రిషి. ఇంతలో అక్కడికి రాజీవ్ వచ్చి రిషి కీ కొడతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.