MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్, రాజశేఖర్ కాంబినేషన్ లో మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న యాంగ్రీ స్టార్

అల్లు అర్జున్, రాజశేఖర్ కాంబినేషన్ లో మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న యాంగ్రీ స్టార్

సీనియర్ హీరో రాజశేఖర్ గతంలో టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. యాంగ్రీ స్టార్ అనే గుర్తింపు కూడా ఆయనకు ఉంది. అంకుశం, ఆహుతి, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, సింహరాశి ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు రాజశేఖర్ ఖాతాలో ఉన్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 08 2025, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Allu Arjun

Allu Arjun

సీనియర్ హీరో రాజశేఖర్ గతంలో టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. యాంగ్రీ స్టార్ అనే గుర్తింపు కూడా ఆయనకు ఉంది. అంకుశం, ఆహుతి, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, సింహరాశి ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు రాజశేఖర్ ఖాతాలో ఉన్నాయి. కానీ ఆ తర్వాత రాజశేఖర్ రేసులో వెనకబడిపోయారు. ఇటీవల దశాబ్దం నుంచి రాజశేఖర్ కెరీర్ నెమ్మదించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
rajasekhar

rajasekhar

అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో గరుడవేగ చిత్రంతో అదరగొట్టారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన గరుడవేగ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి వర్కౌట్ కాలేదు. ఆ మధ్యన రాజశేఖర్ విలన్ రోల్స్ లో కూడా నటించడానికి ఆసక్తి చూపుతున్నారు అంటూ ప్రచారం జరిగింది. దీనిపై రాజశేఖర్ ఇటీవల ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

35
Rajashekar

Rajashekar

నేను హీరోగా నటిస్తూనే మంచి కంటెంట్ ఉన్న పాత్రలు వస్తే విలన్ గా చేయడానికి కూడా సిద్ధం. కాకపోతే నేను పెర్ఫార్మ్ చేయడానికి అందులో మంచి కంటెంట్ ఉండాలి. విలన్ గా మాత్రమే కాదు చిన్న హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నా. అదేవిధంగా సినిమాలో కీలకమైన పాత్ర ఏదైనా ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి కూడా సిద్ధం అని రాజశేఖర్ అన్నారు.

45

గరుడవేగ మూవీ తర్వాత గతంలో చేసిన తప్పులు తిరిగి చేయకూడదని తెలిసింది. గరుడవేగ కథ నాతో పాటు, నా భార్య జీవితకి, పిల్లలకి కూడా నచ్చింది. అందుకే బడ్జెట్ ఎక్కువైనా ఆ చిత్రంలో నటించాను అని రాజశేఖర్ అన్నారు. తాను, అల్లు అర్జున్ కలిసి నటించాల్సిన కాంబినేషన్ మిస్ అయిందని రాజశేఖర్ స్వయంగా చెప్పారు. మిస్సయిన చిత్రం ఇంకేదో కాదు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి.
 

55

ఆ చిత్రంలో ఉపేంద్ర క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర అది. నన్ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ గారు ఆ పాత్ర రాశారట. త్వరలో త్రివిక్రమ్ నన్ను కలిసి కథ కూడా చెబుతారని ఆయన సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది. కానీ చివరికి ఏమైందో నాకు తెలియదు నా వరకు ఆ చిత్రం రాలేదు. ఒకవేళ త్రివిక్రమ్ అడిగి ఉంటే తప్పకుండా సన్నాఫ్ సత్యమూర్తి లో నటించేవాడిని అని రాజశేఖర్ అన్నారు. అదేవిధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్రకి కూడా ముందుగా నన్నే అనుకున్నారు అని రాజశేఖర్ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అల్లు అర్జున్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Highest Grossing Telugu Movies: తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఏవి?
Recommended image2
#Cult Day 1 Collections: కల్ట్ మూవీ మొదటి రోజు వసూళ్లు.. విశ్వక్‌ సేన్‌ సినిమాకి బాక్సాఫీసు షాక్‌
Recommended image3
Sobhan Babu: 500 పెట్టుబడితో 5 కోట్లు సంపాదించాడు.. శోభన్ బాబు మనీ సేవింగ్ సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
కొత్త ప్రారంభం అంటూ రాజ్ నిడిమోరుతో సమంత సెల్ఫీ, అఫీషియల్ గా చెప్పేసినట్లేనా ?
Recommended image2
భాగ్యశ్రీతో రామ్ పోతినేని డేటింగ్ ? ఆమెని అలా పిలిచి రూమర్స్ మరింత పెంచేశాడుగా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved