- Home
- Entertainment
- RRR సూపర్ సక్సెస్ వెనుక రాజమౌళి మాస్టర్ స్ట్రాటజీ... తెర వెనుక అంత పెద్ద టీం తో అంత చేశాడా.!
RRR సూపర్ సక్సెస్ వెనుక రాజమౌళి మాస్టర్ స్ట్రాటజీ... తెర వెనుక అంత పెద్ద టీం తో అంత చేశాడా.!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఈ ఏడాది తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’. అయితే, మూవీ రిలీజ్ కు ముందే జక్కన్న ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ షాకింగ్ గా ఉంది. స్పెషల్ టీంతో తెరవెనక అమలు చేసిన వ్యూహం ఆసక్తికరంగా మారింది.

తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. రీసెంట్ గా జక్కన్న తెరకెక్కించిన RRR సినిమా 2022లో ఇండియన్ సినిమాల్లోనే అతిపెద్ద చిత్రం. మార్చి 24న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియన్ ఫిల్మ్ గాప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రిలీజ్ తర్వాత సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రతిచోటా ప్రేక్షకులను మెప్పించింది ‘ఆర్ఆర్ఆర్’. అంతర్జాతీయంగానూ ఆడియెన్స్ ను ఫిదా చేసింది. అయితే ఇంతటి రెస్పాన్స్ వెనుక రాజమౌళి రచించిన వ్యూహాన్ని తాజాగా మార్కెటింగ్ ఎక్స్ పర్ట్ వరుణ్ గుప్తా వివరించారు..
ఆయన మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ విషయంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ హిందీ బెల్డ్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఏండేండ్ల కింద ‘బాహుబలి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లారన్నారు.
సినిమా రిలీజ్ కు ముందే వారంపాటు స్పెషల్ టీంతో నార్త్ లోని పట్టణాల్లో జక్కన్న సర్వే నిర్వహించారని చెప్పారు. సర్వేలో భాగంగా హిందీ బెల్డ్ లోని నాగ్‌పూర్, ఇండోర్, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో డైరెక్ట్ గా ఆడియెన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారన్నారు. అన్ని ఏజ్ గ్రూప్ ల వారితో సర్వే చేయించారన్నారు.
ఏడేండ్ల కింద Baahubaliతో నార్త్ ఆడియెన్స్ కు పరిచయం అయిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాస్టర్ స్ట్రాటజీ వాడాన్నారు. సర్వేలో తనను ఎలా గుర్తిస్తున్నారని తెలుసుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎవరు? ఈగ, బాహుబలి సినిమాలు తెలుసా? రాజమౌళి ఎవరనే ప్రశ్నలకు ప్రేక్షకుల సమాధానాలు తెలుసుకొన్నారని తెలిపారు. సర్వేలో రాజమౌళిని బాహుబలి చిత్రంతోనే ఆడియెన్స్ గుర్తుపెట్టుకుంటున్నారని తేలిందన్నారు.
దీంతో బాహుబలి బ్రాండ్ నే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో వాడారని అన్నారు. అందుకే హోర్డింగ్స్, బ్యానర్లలో ‘డైరెక్టర్ ఆఫ్ బాహుబలి’ అని మెన్షన్ చేసినట్టు చెప్పారు. అందుకే అలియా భట్, అజయ్ దేవగన్ ను పేర్లను కూడా ప్రమేషన్స్ లో ఎక్కువగా వాడలేదని తెలిపారు. ఇంటర్నేషన్ లోనూ గుర్తింపు పొందుతున్న ఆయనలాంటి దర్శకుడు కూడా ఇంతటి వ్యూహాన్ని అమలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇక చిత్రం ఆస్కార్ బరిలోనూ దూసుకుపోతోంది. రీసెంట్ గా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ షార్ట్ లిస్ట్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ కూడా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేట్ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉద్యమ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో నటించారు. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా సరసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.