- Home
- Entertainment
- Mahesh-Rajamouli Movie: మహేష్‌తో సినిమాపై బిగ్ అప్‌డేట్ రాబోతుందా? రాజమౌళి ఏం చెప్పబోతున్నారు?
Mahesh-Rajamouli Movie: మహేష్‌తో సినిమాపై బిగ్ అప్‌డేట్ రాబోతుందా? రాజమౌళి ఏం చెప్పబోతున్నారు?
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఆల్మోస్ట్ సెట్ అయ్యింది. అదే సమయంలో సినిమాపై అనేక సందేహాలున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ `సర్కారు వారి పాట` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాబోతుందని తెలుస్తుంది.

మహేష్‌బాబు(Maheshbabu) ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారువారి పాట`(Sarkaru Vaari Paata) చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఈ నెల(మే) 12న విడుదల కాబోతుంది. కీర్తిసురేష్(Keerthy Suresh) కథానాయికగా నటించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు(శనివారం) హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరగబోతుంది. రెండేళ్ల తర్వాత మహేష్ నుంచి సినిమా వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం, ఆయన సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ రోజు జరిగే ఈవెంట్‌కి మొదట పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గెస్ట్ గా రాబోతున్నారని, సర్‌ప్రైజింగ్ గెస్ట్ గా ఆయన హాజరవుతారని సోషల్‌మీడియాలో కొన్ని పుకార్లు హల్‌చల్ చేశాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి హాజరయ్యే అవకాశాలున్నాయి. `ఆర్‌ఆర్‌ఆర్` హడావుడి పూర్తి కావడంతో జక్కన్న ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. అందుకే వరుసగా ఆయన ఈవెంట్లకి హాజరవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు `సర్కారు వారి పాట` ఈవెంట్‌కి (Sarkaru Vaari Paata Pre Release Event) కూడా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
దీంతో మహేష్ ఫ్యాన్స్ మరింత ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ ఈవెంట్‌లో అభిమాన హీరోని చూడటంతోపాటు, రాజమౌళితో సినిమా(Mahesh-Rajamouli Movie) అప్‌డేట్ కూడా వస్తుందనే ఆశతో ఉన్నారు. అందుకే ఈవెంట్‌గా భారీగా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ రాజమౌళి వస్తే కచ్చితంగా మహేష్‌తో సినిమాకి సంబంధించిన హింట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఫ్యాన్స్ ని సంతోష పరిచే ప్రకటన ఉంటుందని ఇన్‌సైడ్ టాక్.
మహేష్-రాజమౌళితో సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు జక్కన్ననే చెబుతూ వచ్చారు. కానీ మహేష్ ఒక్కసారి కూడా స్పందించలేదు. అంటే రాజమౌళి ఇంకా మహేష్‌కి కంప్లీట్ స్టోరీని వినిపించలేదని తెలుస్తుంది. అయితే ఇటీవల వీరిద్దరు విదేశాలకు టూర్ వెళ్లారు. అక్కడ కథా చర్చలు జరిగాయని సమాచారం. ఒకవేళ రాజమౌళి ఈ ఈవెంట్‌కి వస్తే దాని సారాంశం రాబోతుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మహేష్ సినిమా ఈ ఏడాది ఎండింగ్‌లో ప్రారంభమవుతుందని గతంలో రాజమౌళి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దాని అప్‌డేట్ కోసం అభిమానులే కాకుండా, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తికరంగా వేచి చూస్తున్నాయి.
మరోవైపు మహేష్‌తో సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని, మహేష్ అడ్వెంచరర్‌గా కనిపిస్తాడనే వార్తలు చాలా రోజులుగా ఫిల్మ్ నగర్‌లో, ఇటు ఇంటర్నెట్‌లో సర్క్యూలేట్ అవుతున్నాయి. అదే సమయంలో `ఇండియానా జోన్స్` సినిమాల స్టయిల్‌లో సాగుతుందని, `థోర్` సినిమాని పోలి ఉంటుందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి ఏం చెప్పబోతున్నారనేది హాట్ టాపిక్ అవుతుంది. అసలు రాజమౌళి వస్తారా;? లేదా? అనేది మరో ప్రశ్న. ఏదైనా `సర్కారు వారి పాట` ప్రీ రిలీజ్ ఈవెంట్‌పైనే అందరి చూపు ఉండటం విశేషం. మహేష్-రాజమౌళి సినిమా అప్‌డేట్ వస్తుందా? లేదా అనేది తేలాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.