- Home
- Entertainment
- రాజమౌళి స్కెచ్ వేస్తే తిరుగుంటుందా.. ఎన్టీఆర్ వ్యవహారంతో సింపతీ, చివరకి అది కూడా చేశారా..
రాజమౌళి స్కెచ్ వేస్తే తిరుగుంటుందా.. ఎన్టీఆర్ వ్యవహారంతో సింపతీ, చివరకి అది కూడా చేశారా..
దర్శకధీరుడు రాజమౌళికి జనరంజకమైన సినిమాలు తీయడం మాత్రమే కాదు.. ఆ సినిమాకి పబ్లిసిటీ ఎలా దక్కించుకోవాలో కూడా తెలుసు.

దర్శకధీరుడు రాజమౌళికి జనరంజకమైన సినిమాలు తీయడం మాత్రమే కాదు.. ఆ సినిమాకి పబ్లిసిటీ ఎలా దక్కించుకోవాలో కూడా తెలుసు. తన సినిమాలకు ఎలాంటి ప్రమోషనల్ టెక్నిక్స్ ఉపయోగిస్తారో ప్రస్తుతం బ్రహ్మాస్త్రం చిత్రానికి కూడా జక్కన్న అలాంటి వ్యూహాలే రచిస్తున్నాడు.
బ్రహ్మాస్త్రం చిత్రం కోసం శుక్రవారం ఒక రేంజ్ లో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ ని కూడా ఇన్వైట్ చేశారు. కానీ చివరి నిమిషంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రత కల్పించలేమని పోలీసులు ఈవెంట్ కి అనుమతి ఇవ్వలేదు. దీనితో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. వెంటనే మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడానికి కారణాలు ఏమైనప్పటికీ.. ఇటీవల తారక్, అమిత్ షాతో భేటీ కావడం వల్ల రాజకీయంగా చర్చ జరిగింది. సో ఈవెంట్ కి అనుమతి దక్కకపోవడం వెనుక తెలంగాణ ప్రభుత్వం హస్తం ఉందంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కేసీఆర్ ని ట్రోల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ విధంగా కూడా సింపతీతో బ్రహ్మాస్త్రం చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ లభించింది.
మీడియా సమావేశం కూడా జక్కన్న మార్క్ కనిపించింది. ప్రెస్ మీట్ కి ఎన్టీఆర్ హాజరయ్యారు. తారక్ ఎమోషనల్ స్పీచ్ ఆకట్టుకుంది. అలియా భట్, రణబీర్ కపూర్ తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నించారు. అలియా అయితే ఏకంగా తెలుగు పాట పాడింది. రణబీర్ కపూర్ అక్కినేని అభిమానులు, నందమూరి అభిమానులని ఆకట్టుకునేలా ప్రసంగించాడు.
ఈ చిత్రానికి జక్కన్న ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. దీనితో ఎలాగైనా బ్రహ్మాస్త్రం చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా రాజమౌళి ప్రమోషన్స్ చేస్తున్నారు. అంతే కాదు స్క్రిప్ట్ దశ నుంచే బ్రహ్మాస్త్రం మూవీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడట.
స్క్రిప్ట్ లో రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని ఇన్వాల్వ్ చేసి మార్పులు సూచించాడని టాక్. అలాగే రాజమౌళి సలహాతో కొన్ని సీన్స్ ని రీషూట్ కూడా చేశారని అంటున్నారు. సెప్టెంబర్ 9 న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. జనాలకి రీచ్ అయ్యేలా అన్ని మార్గాలని అన్వేషిస్తున్నాడు రాజమౌళి. తాజాగా అలియా, రణబీర్ కపూర్ లని యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రాంకి హాజరయ్యేలా చేశాడు. అలియా భట్, రణబీర్ కపూర్ లాంటి బిగ్ స్టార్స్ ని క్యాష్ ప్రోగ్రాంకి తీసుకువచ్చాడంటే.. జక్కన్న చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు అని అర్థం అవుతోంది.
జక్కన్న ఏం ప్లాన్ చేసినా తిరుగుండదు. బ్రహ్మాస్త్రం చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన భుజాలపై మోస్తున్నాడు. ఇటీవల బాలీవుడ్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద తుస్సు మంటున్నాయి ఈ తరుణంలో బ్రహ్మాస్త్రం చిత్రంపై ఆసక్తి పెరిగింది.