- Home
- Entertainment
- ఎన్టీఆర్ ఫీల్ అవుతాడని తెలుసు, ముఖం మీదే చెప్పేసిన రాజమౌళి..సింహాద్రి బ్లాక్ బస్టరే కదా, తారక్ కి షాక్
ఎన్టీఆర్ ఫీల్ అవుతాడని తెలుసు, ముఖం మీదే చెప్పేసిన రాజమౌళి..సింహాద్రి బ్లాక్ బస్టరే కదా, తారక్ కి షాక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ కి ఒక రేంజ్ లో జోష్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ముందుగా రాజమౌళి పేరు చెప్పాల్సిందే. ఎన్టీఆర్ కి ఫస్ట్ హిట్ ఇచ్చింది రాజమౌళినే. స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో ఎన్టీఆర్ తో రాజమౌళి తొలి విజయం అందించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ కి ఒక రేంజ్ లో జోష్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ముందుగా రాజమౌళి పేరు చెప్పాల్సిందే. ఎన్టీఆర్ కి ఫస్ట్ హిట్ ఇచ్చింది రాజమౌళినే. స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో ఎన్టీఆర్ తో రాజమౌళి తొలి విజయం అందించారు. ఆయా తర్వాత సింహాద్రి చిత్రం చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్ ని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం సింహాద్రి.
ఆ తర్వాత వచ్చిన యమదొంగ సూపర్ హిట్. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే వీటిలో యమదొంగ చిత్రమే ఎన్టీఆర్ కి స్పెషల్ మూవీ. తన కెరీర్ తిరిగి గాడిలో పడాలంటే హిట్ తప్పనిసరి. అంతకు ముందు వచ్చిన చిత్రాలన్నీ ఫ్లాప్స్ గా నిలిచాయి.
రాఖీ చిత్రంలో ఎన్టీఆర్ బరువు పెరిగి కనిపించారు. దీనితో ఎన్టీఆర్ లుక్స్ పై విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ తన లుక్స్ పై కేర్ తీసుకోవడం లేదు ఏంటి అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఆ సమయంలోనే రాజమౌళితో యమదొంగ చిత్రం ఫిక్స్ అయింది. అయితే తారక్ ఉన్న ఈ లుక్ లో సినిమా చేస్తే వర్కౌట్ కాదు అని రాజమౌళి భావించారు.
దీనితో ఉన్నమాట చెబితే ఎన్టీఆర్ ఫీల్ అవుతాడని తెలిసినా.. జక్కన్న ఎన్టీఆర్ తో చెప్పాలనుకుంది చెప్పేశాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. 'తారక్ మీ లుక్స్ ఏమాత్రం బాగాలేవు. రాను రాను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మీ సినిమాలు చూడడం మానేస్తున్నారు. లుక్ మార్చాలి. బరువు తగ్గాలి అని చెప్పారట. దీనితో ఎన్టీఆర్.. ఈయన ఏంటి ఇలా అంటున్నాడు.. దాదాపుగా ఇదే బరువు సింహాద్రి చిత్రంలో కూడా ఉన్నాను.
ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది కదా.. సరే జక్కన్న ఎంత చెబుతున్నావు బరువు ఎలా తగ్గాలో కూడా నువ్వే చెప్పు అని అడిగారట. అప్పుడు లైపో సక్షన్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు తారక్ విదేశాలకు వెళ్లి లైపో చేయించుకుని బరువు తగ్గారు.
యమదొంగ రిలీజ్ అయ్యాక.. రాజమౌళి తారక్ ని అభినందించారు. తాను కోరుకున్న విధంగా తారక్ బరువు తగ్గి పాత్రకి న్యాయం చేశాడు అని రాజమౌళి అన్నారు. ఆ మూవీలో ఎన్టీఆర్ పాట కూడా పాడారు. యమదొంగ చిత్రం నుంచి ఎన్టీఆర్ తన ఫిట్నెస్ విషయంలో చాలా కేరింగ్ గా ఉన్నారు.