- Home
- Entertainment
- మహేష్ బాబు మూవీ చూసి తన పుస్తకాన్ని చించిపడేసిన రాజమౌళి, జక్కన్నకి దిమ్మతిరిగేలా చేసిన చిత్రం ఏంటి ?
మహేష్ బాబు మూవీ చూసి తన పుస్తకాన్ని చించిపడేసిన రాజమౌళి, జక్కన్నకి దిమ్మతిరిగేలా చేసిన చిత్రం ఏంటి ?
రాజమౌళికి ఇంతవరకు ఒక్క పరాజయం కూడా లేదు. సో ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయం రాజమౌళికి బాగా తెలుసు అని చాలామంది భావిస్తారు.

Rajamouli
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29 అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందిస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం సంచలనాలు సృష్టించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళికి ఇంతవరకు ఒక్క పరాజయం కూడా లేదు. సో ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయం రాజమౌళికి బాగా తెలుసు అని చాలామంది భావిస్తారు.
దీని గురించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చర్చించారు. యాంకర్ కి, వర్మకి మధ్య రాజమౌళి గురించి చర్చ జరిగింది. గతంలో రాజమౌళి ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయం గురించి ఒక పుస్తకం రాశారట. కొన్ని రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని రాజమౌళి చించిపడేసారట. మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ మూవీ వల్లే రాజమౌళి అలా చేశారని తెలిసింది. అప్పటివరకు తనకి ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయంలో క్లారిటీ ఉండేది అని, కానీ బిజినెస్ మాన్ మూవీ చూశాక మైండ్ బ్లాక్ అయిందని రాజమౌళి తెలిపారట. అందుకే ఆ పుస్తకాన్ని చించేసినట్లు చెప్పారు.
బిజినెస్ మాన్ మూవీ లో మహేష్ బాబు యాంటీ హీరో. తప్పుడు మాటలు మాట్లాడుతాడు. కేవలం మహేష్ బాబు క్యారెక్టర్ వల్లే ఆ సినిమా హిట్ అయిపోయింది. అలాంటప్పుడు సినిమా హిట్ కి కారణాలు ఇంకేం చెబుతాం, ఈ పుస్తకాలని వేస్ట్ అని రాజమౌళి అన్నారట. ఒక మూవీ హిట్ కావడానికి ఎలాంటి ఫార్ములా ఉండదని రాజమౌళి ఆ టైంలో భావించారు. రాజమౌళి చెప్పిన మాటలు కరెక్ట్ అని రాంగోపాల్ వర్మ అంగీకరించారు.
Mahesh Babu
శివ మూవీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. నా వల్ల శివ మూవీ లేదు అని వర్మ అన్నారు. నా వల్లే శివ మూవీ అంత పెద్ద హిట్ అయి ఉంటే..అలాంటి చిత్రాలు ఎన్నో రూపొందించి ఉండాలి. కానీ నేను అలా చేయలేకపోయాను కదా అని రాంగోపాల్ వర్మ అన్నారు.
Mahesh Babu
బిజినెస్ మాన్ మూవీ రిలీజ్ టైంలో రాజమౌళి..పూరి జగన్నాధ్ గురించి ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించారు. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు.. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొడతాను అనే డైలాగ్ రాజమౌళికి విపరీతంగా నచ్చేసింది.