మాస్‌ సినిమా, క్లాస్‌ సినిమా అనే బారియర్స్ ని బ్రేక్‌ చేసే `చెక్‌`ః రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

First Published Feb 21, 2021, 10:15 PM IST

``చెక్‌` సినిమా మాస్‌ సినిమా, క్లాస్‌ సినిమా అనే బారియర్స్ ని బ్రేక్‌ చేస్తుంది. ఇదొక డిఫరెంట్‌ మూవీ అవుతుంది` అని అన్నారు రాజమౌళి. నితిన్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మించిన చిత్రం `చెక్‌`. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది.