కొమురం భీముడో సాంగ్ వెనుక ఇంత కథ ఉందా... అమ్మ రాజమౌళి అక్కడ నుండి తీసుకున్నావా!
ఆర్ ఆర్ ఆర్ విడుదలై నెలలు గడచినా ఏదో రూపంలో మూవీ గురించి చర్చ నడుస్తూనే ఉంది. హాలీవుడ్ మేకర్స్ ని సైతం అబ్బురపరిచిన ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళి ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇండియన్ మార్వెల్ మూవీగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

RRR Movie
మరి ఇంత గొప్ప మూవీ తెరకెక్కించాలంటే చాలా రీసెర్చ్ చేయాలి. పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాలి. అద్భుతమైన సన్నివేశాలు రాసుకోవాలి. అందులోనూ మెగా, నందమూరి కుటుంబాలకు చెందిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ కావడంతో ఆయన మరింత శ్రద్దగా సినిమాను రూపొందించారు. ఈ మూవీలో పాత్రలకు, సన్నివేశాలకు కొన్ని చిత్రాల నుండి, పౌరాణిక పాత్రల నుండి స్ఫూర్తి పొందినట్లు రాజమౌళి తెలియజేశారు.
RRR Movie
రాజమౌళి(Rajamouli) తన లేటెస్ట్ పాడ్ క్యాస్ట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆర్ ఆర్ ఆర్ లో అనేక అద్భుత సన్నివేశాలు ఉన్నాయి. అయితే చిత్రంలోని 'కొమురం భీముడో' సాంగ్ హైలెట్ గా నిలిచింది. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన పీక్స్ అని చెప్పాలి. తన లక్ష్యం కోసం మిత్రుడిని కఠినంగా శిక్షించాల్సి రావడంతో రామ్ ఆవేదనతో నలిగిపోతూ ఉంటే... భీమ్ భరత మాత బిడ్డగా బ్రిటీష్ దొరల ఎదుట మోకరిల్లని ధైర్యం, గర్వం చాటుతూ ఉంటాడు.
RRR Movie
థియేటర్స్ లో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించిన ఈ సాంగ్ రూపొందించటానికి రాజమౌళి బ్రేవ్ హార్ట్ మూవీ నుండి స్ఫూర్తి పొందారట. దర్శకుడు మెల్ గిబ్సన్ తెరకెక్కించిన హాలీవుడ్ మూవీ బ్రేవ్ హార్ట్ 1995లో విడుదలై మంచి విజయం సాధించింది. కొమరం భీముడో సాంగ్ తెరకెక్కించడానికి అక్కడి నుండి ప్రేరణ పొందారట.
RRR Movie
బ్రేవ్ హార్ట్ మూవీలో క్లైమాక్స్ చూసి రామ్ తన మిత్రుడు భీమ్ ని బ్రిటీష్ దొరల ఆదేశాల మేరకు శిక్షించేలా ఆలోచన చేశాను. కొమరం భీముడో సాంగ్ అలా తెరకెక్కించానని రాజమౌళి తెలియజేశారు. ఇక ఆ రెండు పాత్రల్లో ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడుని చూశాను అన్నారు.
RRR Movie
ఆర్ ఆర్ ఆర్ గురించి రాజమౌళి బయటపెట్టిన ఈ ఆసక్తికర అంశాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అదే సమయంలో రాజమౌళి ప్రతి చిత్రంపై కాపీ మరకలు పడుతూ ఉంటాయి. ఆయన హాలీవుడ్ చిత్రాల నుండి సన్నివేశాలు ఎత్తేస్తారని, కాపీ చేసి తెరకెక్కిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. రాజమౌళి మాత్రం దాన్ని స్ఫూర్తిగా చెప్పుకుంటారు. అయితే ఈ ఆరోపణలు అన్నీ సక్సెస్ లో కొట్టుకుపోతూ ఉంటాయి.
మార్చి 25న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అమెరికాలో కొన్ని థియేటర్స్ లో రీ రిలీజ్ చేయగా అద్భుత రెస్పాన్స్ దక్కింది. ఓటీటీలో సైతం ఆర్ ఆర్ ఆర్ అద్భుతాలు చేస్తుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. కీరవాణి సంగీతం అందించారు.