రాజమౌళి టీనేజ్ లవ్ స్టోరీకి సమంతతో లింక్.. జక్కన్న ప్రియురాలు ఎవరో తెలుసా..
దర్శకధీరుడు రాజమౌళి ఎక్కువగా యాక్షన్ చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. ఇలాంటి దర్శకుడి జీవితంలో లవ్ స్టోరీ ఉండే ఛాన్స్ లేదని చాలా మంది భావిస్తుంటారు. జక్కన్న కూడా భగ్న ప్రేమికుడు అట.
Rajamouli
దర్శకధీరుడు రాజమౌళి ఎక్కువగా యాక్షన్ చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. ఇలాంటి దర్శకుడి జీవితంలో లవ్ స్టోరీ ఉండే ఛాన్స్ లేదని చాలా మంది భావిస్తుంటారు. జక్కన్న కూడా భగ్న ప్రేమికుడు అట. టీనేజ్ లో రాజమౌళికి లవ్ స్టోరీ ఉంది. ది రానా దగ్గుబాటి షోలో రాజమౌళి తాజాగా పాల్గున్నారు.
అనేక విషయాలని రాజమౌళి ఓపెన్ గా చెప్పారు. తన టీనేజ్ లవ్ స్టోరీ గురించి రివీల్ చేసారు. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు భారతి అనే అమ్మాయిని లవ్ చేశాను. కానీ నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. ఒకే ఒక్క మాట ఆ అమ్మాయితో మాట్లాడాను.
photos-from z telugu
ఒకరోజు 'భారతీ' అని పిలవగానే నా పిలుపుకోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నట్లు ఉన్న అమ్మాయిలా నా వైపు ప్రేమగా చూసింది. నేను వెంటనే ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగా. దీని కోసమా నన్ను పిలిచింది అన్నట్లుగా తల అడ్డంగా ఊపి వెళ్ళిపోయింది. నా కోసం చాలా తపన పడ్డట్లు ఆ అమ్మాయి ముఖంలో కనిపించింది. కానీ నేను ధైర్యం చేయలేదు.
ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ని ఈగ చిత్రంలో సమంతలో చూపించే ప్రయత్నం చేశా. నాని, సమంత మధ్య లవ్ సీన్స్ లో ఆ అమ్మాయి ఇచ్చిన హావ భావాలని చూపించే ప్రయత్నం చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఆ విధంగా జక్కన్న తన టీజెన్ లవ్ స్టోరీని గుర్తు చేసుకున్నారు.