శేఖర్ కమ్ముల, పూరి జగన్నాధ్ సేమ్ టు సేమ్.. రాజమౌళి ఆమె పేరు చెప్పి ట్విస్ట్ ఇచ్చారుగా, అసలు ఊహించలేం
రాజమౌళి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన దర్శకుడు. పూరి జగన్నాధ్ ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన డైరెక్టర్. చాలా మంది హీరోలకు పూరి సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇక శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన శైలి కలిగిన దర్శకుడు.
రాజమౌళి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన దర్శకుడు. పూరి జగన్నాధ్ ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన డైరెక్టర్. చాలా మంది హీరోలకు పూరి సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇక శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన శైలి కలిగిన దర్శకుడు. ఆయన రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు దూరం. అయినప్పటికీ టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల బలమైన ముద్ర వేస్తున్నారు.
ఈ ముగ్గురు దర్శకులకు ఇష్టమైన చిత్రం, ఇష్టమైన దర్శకుడు, ఇష్టమైన నటి ఎవరో చాలా మందికి తెలియకపోవచ్చు. గతంలో టాలీవుడ్ వజ్రోత్సవాల వేడుక జరిగినప్పుడు ప్రముఖ నటుడు హర్షవర్ధన్, దివంగత కమెడియన్ గుండు హనుమంతరావు ఈ ముగ్గురు దర్శకులని వేర్వేరుగా ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో వారికి నచ్చిన దర్శకుడు, హీరోయిన్, చిత్రం ఏంటో అడిగి తెలుసుకున్నారు. ముందుగా పూరి జగన్నాధ్ ని అడిగారు. పూరి.. తనకి ఇష్టమైన చిత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి నటించిన మిస్సమ్మ అని తెలిపారు. ఇష్టమైన దర్శకుడు మణిరత్నం అని, ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి అని తెలిపారు.
శేఖర్ కమ్ములని కూడా ఇలాంటి ప్రశ్నలే అడిగారు. శేఖర్ కమ్ముల తనకి ఇష్టమైన దర్శకుడు బాపు అని, ఇష్టమైన హీరోయిన్ కమలినీ ముఖర్జీ అని తెలిపారు. ఇష్టమైన సినిమా మాత్రం పూరి జగన్నాధ్ కి నచ్చిన మిస్సమ్మ చిత్రమే అని శేఖర్ కమ్ముల కూడా చెప్పారు. హీరోయిన్ పేరు మాత్రం తన చిత్రాల్లో నటించిన కమలినీ ముఖర్జీ పేరు చెప్పడం విశేషం.
ఇక దర్శకధీరుడు రాజమౌళి అయితే తనకి ఇష్టమైన దర్శకుడు తన గురువు రాఘవేంద్ర రావు అని తెలిపారు. ఇష్టమైన సినిమా మాయాబజార్ అని తెలిపారు. ఇక ఇష్టమైన నటి ఎవరని అడగగా జక్కన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇష్టమైన నటి ఎవరంటే ఎవరైనా హీరోయిన్ పేరు చెబుతారు. కానీ గయ్యాళి పాత్రల్లో నటించిన సూర్యకాంతం తనకి ఇష్టమైన నటి అని రాజమౌళి అన్నారు. ఎంతైనా దర్శక ధీరుడి స్టయిలే వేరు.
Also Read: ఈగ, బాహుబలితో చెంప చెళ్లుమనేలా కొట్టారు.. ఇప్పుడు పుష్ప 2 రెడీగా ఉంది