హీరోయిన్లే నన్ను బలవంతం చేశారు, అయినా చలించలేదు.. ఎగతాళి చేశారు, శోభన్ బాబుకి ఎదురైన చేదు అనుభవం
తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడు అంటే శోభన్ బాబు. అప్పట్లోనే విపరీతంగా మహిళా అభిమానుల ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో ఆయన. శోభన్ బాబు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరహాలో టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడు అంటే శోభన్ బాబు. అప్పట్లోనే విపరీతంగా మహిళా అభిమానుల ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో ఆయన. శోభన్ బాబు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరహాలో టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగారు. ఎలాంటి క్యారెక్టర్ రోల్స్ చేయకుండా హీరోగానే రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో హీరోగానే మిగిలిపోవాలి అనేది ఆయన ఆలోచన.
Sobhan Babu
శోభన్ బాబు అంతటి హీరోకి కూడా అవమానాలు, చేదు అనుభవాలు తప్పలేదు. గతంలో శోభన్ బాబు ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టైల్ గురించి అనేక విషయాలు తెలిపారు. చెడు తిరుగుళ్ళు, మద్యం, ధూమపానం లాంటి వాటికి తాను పూర్తిగా దూరం అని శోభన్ బాబు అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ ఆల్కహాల్ ముట్టలేదు అని తెలిపారు.
Also Read : ఈగ, బాహుబలితో చెంప చెళ్లుమనేలా కొట్టారు.. ఇప్పుడు పుష్ప 2 రెడీగా ఉంది
సినిమా సన్నివేశాల్లో అవసరం అయినప్పుడు మాత్రమే సిగరెట్ స్మోకింగ్ చేసినట్లు శోభన్ బాబు తెలిపారు. మద్యం అయితే చుక్క కూడా తాగలేదు. చివరికి ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉండే షాంపైన్ కూడా తాగలేదు అని శోభన్ బాబు అన్నారు. ఒకసారి పార్టీలో తనతో నటించిన చాలా మంది హీరోయిన్లు షాంపైన్ తాగుతున్నారు.
నన్ను కూడా తాగమని అడిగారు. నేను తాగానని తేల్చి చెప్పాను. ఆడవాళ్ళం మేమే తాగుతున్నాం.. మగాడివి నీకేంటి సమస్య అంటూ ఎగతాళిగా మాట్లాడారు. అయినా అవన్నీ తాను పట్టించుకోలేదు అని శోభన్ బాబు అన్నారు.
Sobhan Babu
నిత్యం యోగ చేసేవాడిని. తనని తాను ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా తనకి బాగా ఉపయోగపడేది అని శోభన్ బాబు తెలిపారు. అప్పట్లో శోభన్ బాబు, జయలలితతో సన్నిహితంగా ఉండేవారు అంటూ అనేక రూమర్స్ ఉన్నాయి. ఆయన 2008లో తుదిశ్వాస విడిచారు.