MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈగ, బాహుబలితో చెంప చెళ్లుమనేలా కొట్టారు.. ఇప్పుడు పుష్ప 2 రెడీగా ఉంది

ఈగ, బాహుబలితో చెంప చెళ్లుమనేలా కొట్టారు.. ఇప్పుడు పుష్ప 2 రెడీగా ఉంది

రాజమౌళి బాహుబలి తర్వాత సౌత్ సినిమా బాలీవుడ్ మార్కెట్ ని కబ్జా చేసేసింది అని చెప్పొచ్చు. కేజీఎఫ్, కాంతార, హనుమాన్, కల్కి ఇలా చాలా చిత్రాలు హిందీలో అదరగొట్టాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 04 2024, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రాజమౌళి బాహుబలి తర్వాత సౌత్ సినిమా బాలీవుడ్ మార్కెట్ ని కబ్జా చేసేసింది అని చెప్పొచ్చు. కేజీఎఫ్, కాంతార, హనుమాన్, కల్కి ఇలా చాలా చిత్రాలు హిందీలో అదరగొట్టాయి. ముఖ్యంగా తెలుగు నుంచి భవిష్యత్తులో మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు సిద్ధం అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బాలీవుడ్ లో బడా దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన బాహుబలి, ఈగ చిత్రాల గురించి చెప్పిన విషయాలు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. నార్త్ లో కరణ్ జోహార్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లని రిలీజ్ చేశారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా సినిమాలో ఎమోషన్స్ యూనివర్సల్ గా ఉంటాయి. అది గ్రహించిన మొదటి దర్శకుడు రాజమౌళి అని అన్నారు. 

Also Read : చిరంజీవి వల్ల అల్లు అర్జున్ కి జరిగిన భారీ నష్టం ఏంటో తెలుసా, నిజాలు తెలుసుకోకపోతే అంతే.. గుడ్డిగా నమ్మేశాడు

35

ఎమోషన్స్ వర్కౌట్ అయినప్పటికీ అన్ని చిత్రాలు అన్ని భాషల్లో వర్కౌట్ కావు. దానికి భారీతనం ఉండాలి. బాహుబలి చిత్రంతో రాజమౌళి అది చేసి చూపించారు. ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం ఆ భాషలో మాత్రమే విజయం సాధిస్తుంది. కానీ గ్రాండ్ విజువల్స్, భారీ స్కేల్ ఉన్నప్పడే ఇండియా మొత్తం ఆదరణ ఉంటుంది. నాకు మొదట బాహుబలి చిత్ర రష్ ఫుటేజ్ చూపించారు. నేను ఒక్కటే చెప్పాను.. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అని ప్రొమోషన్స్ చేయండి అని అన్నాను. 

45

ఎందుకంటే బాహుబలి నిజంగానే ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ. అందులో ఎలాంటి అబద్దం లేదు. ఆడియన్స్ అది నమ్మి థియేటర్స్ కి వచ్చారు. మ్యాజిక్ జరిగింది అని కరణ్ జోహార్ అన్నారు. అదే రాజమౌళి గారి ఈగ చిత్రం తీసుకోండి.. ఈగ రివేంజ్ తీర్చుకోవడం అనేది అల్టిమేట్ కాన్సెప్ట్. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఆ చిత్రాన్ని నార్త్ లో రిలీజ్ చేయాలంటే ఆలోచిస్తాను.. ఎందుకంటే అది భారీ చిత్రం కాదు.. కానీ అద్భుతమైన కాన్సెప్ట్ ఉన్న చిత్రం అని కరణ్ జోహార్ అన్నారు. 

55

హిందీలో గ్రాండ్ విజువల్స్ తో ఇటీవల సినిమాలు రావడం లేదు. కేవలం సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులు మాత్రమే గ్రాండ్ విజువల్స్ ట్రై చేస్తున్నారు. బాహుబలి చిత్రం క్రియేటివిటీ పరంగా బాలీవుడ్ దర్శక నిర్మాతలకు పెద్ద చెంపదెబ్బ అని కరణ్ జోహార్ అన్నారు. కరణ్ జోహార్ వ్యాఖ్యలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ ని లాగిపెట్టి కొట్టే మరో చిత్రం వస్తోంది.. అదే పుష్ప 2 అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ గ్రాండ్ విజువల్స్, యాక్షన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఇప్పుడు పుష్ప 2 కి దక్కింది. మరి ఏం జరుగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Recommended image2
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్
Recommended image3
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved