MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రాజమౌళి Netflix డాక్యుమెంటరీపై భారీగా విమర్శలు

రాజమౌళి Netflix డాక్యుమెంటరీపై భారీగా విమర్శలు

సెన్సేషన్‌, సక్సెస్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న రాజమౌళి పై నెట్ ప్లిక్స్ వారు ఓ డాక్యుమెంటరీ రూపొందించారు.   రాజమౌళి.. జీవిత విశేషాలతో ఈ డాక్యుమెంటరీ రూపొందింది. 

2 Min read
Author : Surya Prakash
Published : Jul 23 2024, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rajamouli

Rajamouli


రాజమౌళి గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పనిలో పర్‌ఫెక్షనిస్ట్‌. అందుకే తను ఎలాంటి కథను తెరకెక్కించినా అది సూపర్‌ హిట్‌ అవుతూంటుంది. ఆయన  చూస్తే హీరోలకు పోటీ ఇచ్చే  కటౌట్‌ తో ఉంటారు. అయినా డైరక్షన్ కే ఆయన ప్రయారిటీ.  సెన్సేషన్‌, సక్సెస్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న రాజమౌళి పై నెట్ ప్లిక్స్ వారు ఓ డాక్యుమెంటరీ రూపొందించారు.   రాజమౌళి.. జీవిత విశేషాలతో ఈ డాక్యుమెంటరీ రూపొందింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


ఈ డాక్యమెంటరీని  'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు డాక్యుమెంటరీ ఎలా ఉండబోతుందో చెప్పే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవి అభిమానులు ఓ రేంజిలో అలరిస్తున్నాయి. అదే స్దాయిలో ఈ డాక్యుమెంటరీపై విమర్శలు వస్తున్నాయి. అందుకు కారణం డబ్బింగ్. 
 

37
Rajamouli

Rajamouli


 రాఘవ్‌ కన్నా దర్శకత్వంలో రానున్న ఈ ప్రాజెక్టును సమీర్‌ నాయర్, దీపక్‌ సెగల్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘నేనొక అద్భుతమైన కథ చెప్పాలనుకుంటున్నాను’ అంటూ మొదలైన ట్రైలర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లోని సినీ ప్రముఖులు రాజమౌళిపై వారికున్న అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
 

47
Rajamouli

Rajamouli


తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి డబ్బింగ్ చెప్పించిన వాయిస్ లతో ఇబ్బందిగా ఉంది అంటున్నారు ట్రైలర్ చూసిన వాళ్లు. ఈ వెర్షన్ లో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లకు వేరే ఆర్టిస్ట్ ల చేత డబ్బింగ్ చెప్పించారు. అవి చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని, ఏ విధమైన ఇంపాక్ట్ కలగచేయటం లేదని అంటున్నారు. ఈ విషయంలో నెట్ ప్లిక్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇంగ్లీష్ ట్రైలర్ లో వారి ఒరిజనల్ వాయిస్ లు ఉన్నాయి. రాజమౌళి వాయిస్ సైతం డబ్బింగ్ చెప్పించటం కాస్త ఇబ్బందే. ఆ విషయంలో విమర్శలు రావటం అభిమానుల నుంచి అనేది పెద్ద విచిత్రమైతే కాదు.

57


 
‘ఇప్పటివరకు ఎవరూ చెప్పని కథలను ప్రపంచానికి తెలిపేందుకే రాజమౌళి జన్మించారంటూ’ ఎన్టీఆర్, ‘ఇలాంటి దర్శకుడిని నేనిప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చిప్రేమ’ అంటూ ప్రభాస్, ఆయన చిత్రాల్లో తనని తాను కొత్తగా చూసుకొని ఎంతో ఆశ్చర్యపోయానంటూ రామ్‌చరణ్, హాలీవుడ్‌ దర్శకనిర్మాత జేమ్స్‌ కామెరూన్‌ మాట్లాడుతూ..‘రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం’ అని తెలుపారు.

67

 కరణ్‌ జోహార్‌ ‘ఈ దర్శకుడు ఓ లెజెండ్‌’ అని, ఆయనతో పని చేసిన వారందరూ ఆయణ్ని పని రాక్షసుడని పిలుస్తుంటారంటూ రాజమౌళి భార్య రమ ట్రైలర్‌లో వారి అభిప్రాయాల్ని తెలిపారు. ‘నిజం చెప్పాలంటే నేను కేవలం నా కథకు మాత్రమే బానిసను..’ అంటూ ట్రైలర్‌ ఆఖర్లో రాజమౌళి చెప్పిన డైలాగ్‌ సినిమాల పట్ల తనకున్న ప్రేమకు నిదర్శనం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ వచ్చే నెల 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 

77

ఇక ఇది డాక్యుమెంటరీ కాబట్టి సినిమా స్టైల్లో ఉండదు. రాజమౌళి కెరీర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైందనేది విజువల్స్ రూపంలో చూపిస్తారు. అలానే జక్కన్నతో పనిచేసిన అనుభవాన్ని ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అయితే ఇది డాక్యుమెంటరీ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. రాజమౌళి లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని చూడటం మేలు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved