MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్, రాజమౌళి కాశీలో సందడి..? కథకు కీలకం అక్కడే

మహేష్, రాజమౌళి కాశీలో సందడి..? కథకు కీలకం అక్కడే

మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 సినిమా షూటింగ్ జనవరి 2025 లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, వారణాశి నేపథ్యంలో కథ మొదలవుతుంది.

3 Min read
Author : Surya Prakash
Published : Nov 13 2024, 06:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rajamouli, Mahesh babu,varanasi

Rajamouli, Mahesh babu,varanasi

వారణాశి (కాశీ) మన భారతీయులకి పవిత్రమైన ప్రదేశం.  అందుకే ఆ ఆధ్యాత్మిక ప్రదేశం పేరు  చెప్పగానే కనెక్ట్ అవుతుంటారు. హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకుంటారు. మన సినిమావాళ్లకు ఈ విషయం బాగా తెలుసు.

అందుకే చాలా  సినిమాలకు నేపధ్యం కాశీగా తీసుకుంటారు. అక్కడో ఎపిసోడ్ అయినా ప్లాన్ చేస్తారు.   చిరంజీవి ఇంద్ర నుంచి నిన్నది ప్రభాస్ కల్కి దాకా ఈ ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. తాజాగా మహేష్ బాబు సైతం కాశీలో అడుగు పెట్టనున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Mahesh Babu and Rajamouli

Mahesh Babu and Rajamouli

మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 జనవరి 2025 లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ రచన,  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక మైథలాజికల్ ఎడ్వెంచర్  నేపథ్యంలో రూపొందించబడ్డ స్క్రిప్టు. ఈ చిత్రంలో అంతర్జాతీయంగా పేరున్న నటీనటులు కనిపించనున్నట్లు సమాచారం.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) తో  ఆస్కార్‌ను గెలుచుకున్న RRR ప్రపంచవ్యాప్తంగా ఘన  విజయం సాధించిన తరువాత, రాజమౌళి,  సూపర్ స్టార్ మహేష్ బాబుతో  చేస్తున్న ఈ సినిమాకు నెక్ట్స్ లెవిల్ లో ఉండబోతోంది. ఈ చిత్రం షూటింగ్ జనవరి 2025లో ప్రారంభం కానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల తన 'మాస్టర్ క్లాస్' సెషన్‌లో వెల్లడించారు. ఈ చిత్రం 2028లో విడుదల కానుంది.
 

37
Rajamouli, mahesh babu

Rajamouli, mahesh babu

ఈ నేపధ్యంలో  మ‌హేష్ బాబు – రాజ‌మౌళి. సూప‌ర్ స్టార్‌తో జ‌క్క‌న్న ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడో అని అభిమానులంతా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. రాజ‌మౌళి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం  పూర్తి టైమ్ తీసుకుని ఎప్పటిలాగే చెప్పే పోగ్రాం పెట్టున్నారు.

మ‌హేష్ కూడా ఈ సినిమాతో తన కెరీర్ నెక్ట్స్ లెవిల్ కు ఏ స్దాయికి చేరుకుంటుందో తెలుసు కాబట్టి ఎక్కడా కంగారుపడకుండా ముందుకు వెళ్తున్నారు.  వ‌ర్క్ షాపులకు అటెండ్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో  ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త  బయిటకి వ‌చ్చింది. ఈ క‌థ వార‌ణాసి నేప‌థ్యంలో మొద‌లవుతుంద‌ని ఫిల్మ్ నగర్  వ‌ర్గాల సమాచారం. 

47
ss rajamouli mahesh babu movie ssmb 29

ss rajamouli mahesh babu movie ssmb 29


వారణాశిలో మొదలైన ఈ కథ ఆ త‌ర‌వాత క‌థ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుంద‌ట‌. వార‌ణాసి షెడ్యూల్ మొత్తం ఓ సెట్ లో పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ భారీ సెట్ డిజైన్ చేస్తన్నారు.

మొదట ఇక్క‌డ షూటింగ్ ప్రారంభించి, ఆ త‌ర‌వాత సౌత్ ఆఫ్రికా వెళ్తారు. సినిమా ఎక్కువగా అరణ్యాలులో నడుస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాలున్న  దట్టమైన అడవుల్లో ఇప్పటికే  రెక్కీ నిర్వ‌హించారు.  జనవరి ఆఖరులో లేదా ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.  
 

57

దాదాపు పదేళ్ల క్రితమే మహేష్ బాబుతో జక్కన్న  సినిమా చేయాలని అనుకున్నారు. కానీ, ఇద్దరు మిగతా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇన్నేళ్ళు పట్టింది. ప్రముఖ సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ , శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

67


ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఇది ఊహించని  సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్‌గా చెప్పబడుతున్న ఈ చిత్రం ఎక్కువగా అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ నేపథ్యంలో సెట్ చేసారు.

దాదాపు రెండు సంవత్సరాలు స్క్రిప్ట్‌పై పనిచేసిన విజయేంద్ర ప్రసాద్, ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తిగా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని చెప్తున్నారు- ఈ సీన్స్, లొకేషన్స్ ఇంతకు ముందు భారతీయ సినిమాలో చూడనవి ఉండబోతున్నాయట. 
   

77

మహేశ్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. VFX వర్క్ కు ఈ సినిమాలో ఎక్కువ అవకాసం ఉంది.  ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళికి పెరిగిన మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని ఇంటర్నేషనల్ రిలీజ్ చేస్తారు.

 ఈ క్రమంలో అక్కడ స్టాండర్డ్స్ ని అందుకునేలా హలీవుడ్ స్దాయిలో లో ఈ సినిమా  తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో  ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ను  వాడుకోవాల‌ని దర్శకుడు భావిస్తున్న‌ట్టు  సమాచారం.  ఏఐతో తక్కువ వ్యవధిలో మంచి అవుట్ పుట్ వచ్చే అవకాశాలు ఉండటంతో, వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయ‌డానికి ఈ టెక్నాలజీ సహాయపడుతుందని భావించి అందుకు సంభందించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

Read more: నన్ను అలా పిలవకని మహేష్ బాబును లైవ్ లో హెచ్చరించిన డేరింగ్ పర్సన్, అసలు ఏం జరిగింది?

also read: సన్యాసిగా మారిపోతుందేమో అని అనుష్క పేరెంట్స్ లో టెన్షన్‌, యోగా టీచర్‌ స్వీటికి ముందే చెప్పాడా?
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali 2026 OTT Releases: దీపావళికి సినిమాల జాతర, ఓటీటీలో సందడి చేయనున్న 10 కొత్త సినిమాలు ఇవే
Recommended image2
Salman Khan: ఒక్కసారి సారీ చెబితే చాలు.. సల్మాన్‌కు బిష్ణోయ్ బంధువు ఆఫర్, నెక్స్ట్ ఏంటి?
Recommended image3
Ramayana Review: రామాయణం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved