- Home
- Entertainment
- RRR: ఆ సీన్ గురించి ఎవ్వరికీ తెలియదు, ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోతారు జాగ్రత్త.. బాంబు పేల్చిన జక్కన్న
RRR: ఆ సీన్ గురించి ఎవ్వరికీ తెలియదు, ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోతారు జాగ్రత్త.. బాంబు పేల్చిన జక్కన్న
కరోనా థర్డ్ వేవ్ అడ్డుకోకుంటే ఇప్పటికే ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ ప్రభంజనాన్ని చూసే వాళ్ళు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం మార్చి 25కి వాయిదా పడింది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఇది. దర్శక ధీరుడు రాజమౌళి నుంచి బాహుబలి తర్వాత వస్తున్న చిత్రం కావడం, ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ అభిమానులని విశేషంగా ఆకట్టుకోవడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
కరోనా థర్డ్ వేవ్ అడ్డుకోకుంటే ఇప్పటికే ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ ప్రభంజనాన్ని చూసే వాళ్ళు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం మార్చి 25కి వాయిదా పడింది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబందించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో ఇన్స్టంట్ హిట్ గా మారిపోతోంది.
డిసెంబర్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది గుర్తుందిగా. ఆ ఈవెంట్ ని లైవ్ టెలికాస్ట్ చేయలేదు. సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ ని రికార్డ్ చేసి జనవరి 1న టీవీలో టెలికాస్ట్ చేశారు. టెలికాస్ట్ రైట్స్ కారణంగా పూర్తి ఈవెంట్ ని ఆర్ఆర్ఆర్ టీం తెలుగు ప్రేక్షకులని అందించలేదు. కాగా ప్రస్తుతం ఆ ఈవెంట్ లో అందరి ప్రసంగాలని పూర్తిగా అప్ లోడ్ చేశారు.
రాజమౌళి తన స్పీచ్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం పనిచేసిన కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్, నటీనటులు ఇలా పేరు పేరునా అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీలో రాజమౌళి ఒక ప్రత్యేక సన్నివేశం గురించి చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.
ఇంట్రడక్షన్ సన్నివేశాల కోసం చరణ్, ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో రాజమౌళి వివరించారు. ఇక షూటింగ్ రెండవ రోజునే ట్రైలర్ లో చూపిన బ్రిడ్జ్ సీన్స్ తెరకెక్కించాం. ఇద్దరికీ వైర్లు కట్టి 60 అడుగులు గాల్లోకి లేపాము. అంతలా వారిద్దరిని కష్టపెట్టాను.
ఇక ఈ చిత్రంలో ఓ పర్టికులర్ సీన్ ఉంది. అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ సన్నివేశం గురించి ఎవ్వరికి కోసం ఐడియా కూడా లేదు. టీజర్స్, ట్రైలర్ లో ఎక్కడా సీన్ గురించి హింట్ కూడా ఇవ్వలేదు. ఆ సన్నివేశం గురించి ఒక్కటి మాత్రం చెప్పగలను. థియేటర్స్ లో ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు మీ బాడీలో ప్రతి నరం, కండరం బిగుసుకుంటుంది. ఊపిరి తీసుకోవడం కూడా మరచిపోతారు. మీ హార్డ్ బీట్ రెట్టింపు అవుతుంది అంటూ జక్కన్న బాంబు పేల్చాడు.
ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నిండిపోయింది. అయినప్పటికీ రాజమౌళి ఇంకా చాలా దాచిపెట్టాను అని చెబుతుంటే అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోవడం ఖాయం. ఇప్పటికే నెటిజన్లు రాజమౌళి స్పీచ్ పై కామెంట్స్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ రాజమౌళి చెప్పేది నమ్మొచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడూ నిరాశపరచరు అని కామెంట్స్ చేస్తున్నారు.