MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • `మహాభారతం` కాదు.. మరో డ్రీమ్‌ ప్రాజెక్ట్ బయటపెట్టిన రాజమౌళి.. వామ్మో జక్కన్న మామూలోడు కాదుగా!

`మహాభారతం` కాదు.. మరో డ్రీమ్‌ ప్రాజెక్ట్ బయటపెట్టిన రాజమౌళి.. వామ్మో జక్కన్న మామూలోడు కాదుగా!

దర్శకధీరుడు రాజమౌళికి మహాభారతం సినిమా తీయాలనేదే కాదు, మరో డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఉంది. ఆ విషయాన్ని బయటపెట్టారు. అది తన డ్రీమ్‌ అని చెప్పారు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : May 10 2024, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దర్శకధీరుడు రాజమౌళి ఊహలు ఎవరికి అందని స్థాయిలో ఉంటాయి. ఆయన ప్లాన్‌ చేస్తే పీక్‌లో ఉంటుంది. మరే దర్శకుడికి సాధ్యం కాదు అనేంతగా ఆయన ప్లాన్స్ ఉంటాయి. దర్శకుడిగా తనకంటూ ఓ డ్రీమ్‌ ఉంది. ఫైనల్‌గా `మహాభారతం` తీయాలనేది ఆయన చిరకాల కల. దీన్ని ఐదు పార్ట్ లుగా ప్లాన్‌ చేశారు రాజమౌళి. గతంలోనే ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రాజమౌళి తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ కి చేరుకోవడానికి, మహాభారతం సినిమా తీయడానికి కావాల్సన శక్తిని కూడగట్టుకునే పనిలో ఉన్నారు జక్కన్న. అందులో భాగంగానే `ఈగ`, `మగధీర`, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు చేస్తున్న మహేష్‌ బాబు మూవీ కూడా అందులో భాగమే. వరల్డ్ ఆడియెన్స్ కి మన సినిమా దగ్గర కావాలని, ప్రపంచ సినిమాని శాషించేస్థాయిలో `మహాభారతం` ఉండాలనేది రాజమౌళి ప్లాన్‌. `అవేంజర్స్`, `అవతార్‌` తరహాలో తాను ఈ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నారు. 

37
SS Rajamouli teams up with cricketer David Warner

SS Rajamouli teams up with cricketer David Warner

అయితే తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు రాజమౌళి. తనకు మరో డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఉందన్నారు. తన కెరీర్‌లో ఎప్పటికైనా యానిమేషన్‌ మూవీ చేయాలని ఉందట. ఇటీవల `బాహుబలి` యానిమేషన్‌ మూవీ మీడియాకి ప్రదర్శన సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

47

తనకు యానిమేషన్‌ సినిమా చేయాలనే డ్రీమ్‌ ఉందని, దానిపై అవగాహణ కోసమే `బాహుబలి` యామినేట్‌ మూవీకి ఒప్పుకున్నట్టు తెలిపారు. ఈ మూవీ ప్రాసెస్‌లో చాలా నేర్చుకున్నట్టు తెలిపారు. తాను ఎప్పటికైనా ఓ భారీ యానిమేషన్‌ చిత్రం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.ఇప్పుడు ఆడియెన్స్ ఇలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారని అన్నారు. తాను కూడా అలాంటి యానిమేషన్‌ మూవీతో మెప్పించాలనుకుంటున్నట్టు తెలిపారు రాజమౌళి. 

57

అందరిలో లాగా తాను కూడా అన్ని రకాల సినిమాలు చేసి నిరూపించుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు రాజమౌళి. `బాహుబలి` యానిమేషన్‌ ఫిల్మ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. యానిమేషన్‌ సినిమాలను చేయాలనే కోరిక ఉందని, అందుకోసమే ఇవన్నీ చేస్తున్నట్టు తెలిపారు. మున్ముందు అలాంటి సినిమా చేస్తానని తెలిపారు. 

67

ఇక `బాహుబలి`కి మరో పార్ట్ `బాహుబలి 3` చేయాలనుకున్నట్టు చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత అదే చేయాలని అనుకున్నాడట. కానీ మహేష్‌ బాబు సినిమా కారణంగా దాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. మహేష్‌ సినిమా తర్వాత `బాహుబలి 3` ఉంటుందన్నారు. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌`కి సీక్వెల్‌ కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరి అది ఎప్పుడు ఉంటుందనేది పెద్ద ప్రశ్న. 
 

77
Rajamouli

Rajamouli

మహేష్‌ బాబు హీరోగా, రాజమౌళి ఇప్పుడు `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో ఓ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఇంటర్నేషనల్‌ స్థాయిలో దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీతో అంతర్జాతీయ ఆడియెన్స్ ని టార్గెట్‌ చేస్తున్నారు. కొత్త ఆడియెన్స్ ని సినిమా చూసేందుకు తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలిపారు. మహేష్‌ సాహసికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved