- Home
- Entertainment
- Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
భారీ ఫైట్స్, గ్రాఫిక్స్, అబ్బుర పరిచే విజువల్స్ లేకుండానే సింపుల్ కథలతో కొందరు టాలీవుడ్ హీరోలు ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు అందుకున్నారు. ఆ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Chiranjeevi
టాలీవుడ్ లో వందలకోట్లు వసూళ్లు రాబట్టాలి అన్నా, ఇండస్ట్రీ రేంజ్ హిట్లు కొట్టాలి అన్నా గ్రాండ్ విజువల్స్, ఊచకోత కోసే ఫైట్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండాల్సిందే. అలాంటి చిత్రాలకే వందల కోట్ల వసూళ్లు దక్కుతున్నాయి. కానీ నమ్మశక్యంకాని విధంగా సింపుల్ కథలతో కూడా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోలు కొందరు ఉన్నారు. ఆ సినిమాల గురించి తెలిస్తే ఈ కథలతో అంత పెద్ద హిట్లు ఎలా కొట్టారు అనే సందేహం రాక మానదు. ఆ చిత్రాల జాబితా ఇప్పుడు చూద్దాం.
నువ్వే కావాలి
ఇది సింపుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ. తరుణ్, రిచా జంటగా నటించారు. తరుణ్ కి హీరోగా ఇదే తొలి చిత్రం. హీరోయిన్ కూడా ఎవరికీ అంతగా తెలియదు. అయినప్పటికీ నువ్వే కావాలి చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై సంచలన విజయం అందుకుంది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో వసూళ్లు అందుకుంది.
అత్తారింటికి దారేది
మనస్పర్థలతో పుట్టింటికి దూరమైన అత్తని తాత కోరిక మేరకు తిరిగి తీసుకువచ్చే కథ ఇది. అసలు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి ఏమాత్రం సెట్ కాని కథ. అయినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్ చేశారు. అత్తారింటికి దారేది చిత్రం మగధీర రికార్డులు బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది.
రంగస్థలం
రాంచరణ్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో. సుకుమార్ ఈ చిత్రాన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. రాంచరణ్ కి ఈ చిత్రంలో వినికిడి లోపం ఉంటుంది. పల్లెటూరి కథ అయినప్పటికీ బలమైన ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ చిత్రం ఏకంగా నాన్ బాహుబలి రికార్డులు సృష్టించింది.
శ్రీమంతుడు
ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో కొరటాల శివ మ్యాజిక్ చేశారు. అక్కడక్కడా మాస్ మూమెంట్స్ ఉంటాయి కానీ ఇది క్లాస్ గా సాగిపోయే కథ. అయినప్పటికీ భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది.
సంక్రాంతికి వస్తున్నాం
సంక్రాంతికి వస్తున్నాం మూవీ సింపుల్ గా సాగిపోయే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ వెంకటేష్ కామెడీ టైమింగ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ రాబట్టింది.
మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ కూడా అంతే. ఈ చిత్రానికి కూడా అనిల్ రావిపూడినే దర్శకుడు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 300 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది.
అల వైకుంఠపురములో
ఆసుపత్రిలో ప్రసవం సమాయంతో పిల్లలు మారిపోయే పాతకాలం కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ ఈ చిత్రం తెరకెక్కించారు. తమన్ అందించిన సంగీతం సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ మూవీ కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది.

