MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Meena : 10 కోట్ల ఇల్లును 100 కోట్లకు అమ్మేసిన హీరోయిన్, మీనా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా

Meena : 10 కోట్ల ఇల్లును 100 కోట్లకు అమ్మేసిన హీరోయిన్, మీనా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా

ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  స్టార్ హీరోయిన్‌గా వెలిగిన మీనా, 20 ఏళ్ల క్రితం కొన్న ఓ ఇంటిని ఇప్పుడు ఏకంగా 100 కోట్లకు అమ్మేశారు. ఈ డీల్ వెనుక ఉన్న అసలు కథేంటో మీకు తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు మరి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 09 2026, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా..
Image Credit : google

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా..

సహజమైన అందం, అద్భుతమైన నటనతో మీనా  తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 1980-90ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, శ్రీకాంత్, తమిళంలో.. రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, సత్యరాజ్, శరత్‌కుమార్, అజిత్ కుమార్ వంటి ఎందరో టాప్ హీరోలతో కలిసి హిట్ సినిమాల్లో నటించింది. 

ఇప్పటికీ  కూడా తమిళం, తెలుగు, మలయాళంలో బిజీ ఆర్టిస్ట్ గానే కొనసాగుతోంది మీనా.  మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి నటించిన 'దృశ్యం 3' సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వంద కోట్లకు ఇల్లు అమ్మిన మీనా
Image Credit : Google

వంద కోట్లకు ఇల్లు అమ్మిన మీనా

నటి మీనా తన బిజినెస్ టాలెంట్ ను చూపించారు. తాాజాగా మీనకు సబంధించిన  ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 20 ఏళ్ల క్రితం, ఆమె పెద్ద రిస్క్ చేసి ఓ నిర్ణయం తీసుకున్నారు. అదే ఇప్పుడు ఆమెకు భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది. ఆ రోజుల్లోనే బ్యాంకు నుంచి రూ.10 కోట్ల లోన్ తీసుకుని, తమిళనాడులో ఓ పెద్ద హెరిటేజ్ బంగ్లాను మీనా కట్టించారు. చాలామంది లగ్జరీ వస్తువులపై పెట్టుబడి పెడితే, మీనా మాత్రం స్థిరాస్తిపై ఇన్వెస్ట్ చేయడం విశేషం.

34
కళాత్మకంగా కట్టిన ఇల్లు
Image Credit : google

కళాత్మకంగా కట్టిన ఇల్లు

ఆ ఇల్లును సంప్రదాయ వాస్తుశైలిలో నిర్మించారు. చెక్కిన చెక్క స్తంభాలు, విశాలమైన ప్రాంగణం, ప్యాలెస్ తరహా డిజైన్‌తో దాన్ని తీర్చిదిద్దారు. ఆధునిక భవనాల మధ్య ఇలాంటి పాతకాలపు కళాత్మక ఇళ్లు అరుదుగా ఉండటంతో, ఈ బంగ్లాకు ప్రత్యేక విలువ వచ్చింది. దీని అందానికి ఫిదా అయిపోయిన అమెరికాకు చెందిన ఓ జంట, ఈ ఇంటిని భారీ ధరకు కొనడానికి ముందుకొచ్చారు. చివరికి, ఆ ఇంటిని సుమారు 100 కోట్ల రూపాయలకు అమ్మినట్లు సమాచారం.

44
మీనాపై ప్రశంసల వెల్లువ
Image Credit : Google

మీనాపై ప్రశంసల వెల్లువ

ఒకప్పుడు అప్పుగా అనిపించిన పెట్టుబడి, ఇప్పుడు పదింతల లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో మీనా మంచి ఇన్వెస్టర్ అని, డబ్బు విలువ తెలిసిన వ్యక్తి అని చాలామంది ప్రశంసిస్తున్నారు. 10 కోట్లకు కట్టిన ఇంటిని 100 కోట్లకు అమ్మిన మీనా టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. 

ఇక మీనాకు  నైనిక అనే కూతురు ఉంది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త సాగర్ అనారోగ్యంతో మరణించారు. ఆ బాధ నుంచి నెమ్మదిగా కోలుకుంటూ, తన కూతురిని పెంచుకుంటున్నారు. మీనా కూతురు నైనిక, 'తెరి' (తెలుగులో 'పోలీసోడు') సినిమాలో విజయ్ కూతురిగా నటించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మీనా (నటి)
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Recommended image2
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Recommended image3
2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
Related Stories
Recommended image1
Balakrishna : పొద్దు పొద్దున్నే 3 గంటలకు.. బాలయ్య బ్యాడ్ హ్యాబిట్, ఎందుకు మానలేకపోతున్నాడంటే?
Recommended image2
Sneha Reddy: అల్లు అర్జున్ భార్య సంపాదన ఎంతో తెలుసా? స్నేహా రెడ్డి ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved