- Home
- Entertainment
- Mistake in RRR: ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి చేసిన బ్లండర్ మిస్టేక్.. కనీసం ఎన్టీఆర్ అయిన చూసుకోవాలిగా!
Mistake in RRR: ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి చేసిన బ్లండర్ మిస్టేక్.. కనీసం ఎన్టీఆర్ అయిన చూసుకోవాలిగా!
ఏళ్ల తరబడి సినిమాలు చెక్కే రాజమౌళికి ఆయన మిత్రులు జక్కన్న అని పేరు పెట్టారు. ప్రతి చిన్న విషయంలో పర్ఫెక్షన్ కోరుకునే జక్కన్న... సినిమా లేటైనా పర్లేదు, పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. మరి అలాంటి జక్కన్న ఇలాంటి బ్లండర్ మిస్టేక్ చేశాడంటే నమ్ముతారా..

RRR Movie
ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)రాజమౌళి ఖాతాలో చేరిన మరో భారీ హిట్. రూ. 1100 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఓవర్ సీస్ లో కూడా ఆర్ ఆర్ ఆర్ వసూళ్ల వర్షం కురిపించింది.
RRR Movie
ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సాగింది. వెండితెరపై నందమూరి-మెగా హీరోలు విజృభిస్తుంటే పండగ చేసుకున్నారు అభిమానులు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఇద్దరూ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు. ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ విజువల్ వండర్ గా ఆర్ ఆర్ ఆర్ ని అభివర్ణించారు.
ఇంత పెద్ద సక్సెస్ సాధించిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో రాజమౌళి చేసిన బ్లండర్ మిస్టర్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ మిస్టేక్ గమనించిన నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ ఏకిపారేస్తున్నారు. ఓ నెటిజెన్ అయితే... హైదరాబాద్ పోలీస్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ట్యాగ్ చేసి, రాజమౌళిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇక రాజమౌళి(Rajamouli) చేసిన ఆ మిస్టేక్ ఏమిటంటే... ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ మారువేషం కట్టి మెకానిక్ గా మారతాడు. ఈ క్రమంలో ఆయన 20ల కాలం నాటి ఓ బైక్ వాడుతూ ఉంటారు. కాగా ఈ బైక్ డిఫరెంట్ సన్నివేశాల్లో డిఫరెంట్ నంబర్స్ కలిగి ఉండడాన్ని ఓ నెటిజెన్ గమనించారు. ఒకే బైక్ రెండు నంబర్స్ ఎలా కలిగి ఉంటుంది. ఈ మాత్రం లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ రాజమౌళిని ప్రశ్నించారు.
RRR Movie
ఇక రాజమౌళి(Rajamouli) చేసిన ఆ మిస్టేక్ ఏమిటంటే... ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ మారువేషం కట్టి మెకానిక్ గా మారతాడు. ఈ క్రమంలో ఆయన 20ల కాలం నాటి ఓ బైక్ వాడుతూ ఉంటారు. కాగా ఈ బైక్ డిఫరెంట్ సన్నివేశాల్లో డిఫరెంట్ నంబర్స్ కలిగి ఉండడాన్ని ఓ నెటిజెన్ గమనించారు. ఒకే బైక్ రెండు నంబర్స్ ఎలా కలిగి ఉంటుంది. ఈ మాత్రం లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ రాజమౌళిని ప్రశ్నించారు.
సదరు నెటిజెన్ గమనించిన మిస్టేక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడు హడావిడిలో చూసుకోలేదు అనుకో.. ఆ బైక్ ని వాడిన ఎన్టీఆర్ అయినా చూసుకోవాలిగా, అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బైక్ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నిర్మాత డివివి దానయ్య నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. అలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. ఎం ఎం కీరవాణి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంగీతం అందించారు.