MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మొన్న `పుష్ప 2`, ఇప్పుడు అట్లీ మూవీ, రేపు త్రివిక్రమ్‌తో సినిమా.. అల్లు అర్జున్‌ ప్లాన్‌ వెనుక రాజమౌళి

మొన్న `పుష్ప 2`, ఇప్పుడు అట్లీ మూవీ, రేపు త్రివిక్రమ్‌తో సినిమా.. అల్లు అర్జున్‌ ప్లాన్‌ వెనుక రాజమౌళి

Allu Arjun-Rajamouli: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తనని తాను చెక్కుకుంటూ వస్తున్నాడు. ప్రారంభంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన లుక్‌పై చాలా మంది ట్రోల్‌ చేశారు. ఇండస్ట్రీ వ్యక్తులే కాదు, సొంత తండ్రి కూడా తన లుక్‌పై జోకులు వేసుకున్నాడట. అలాంటి బన్నీ ఇప్పుడు చాలా మారిపోయాడు. నటుడిగా ఆయన ఎదిగిపోయారు. `పుష్ప` సినిమాతో ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని కూడా అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక నటుడు బన్నీ కావడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 23 2025, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Allu Arjun, Rajamouli

Allu Arjun, Rajamouli

Allu Arjun-Rajamouli: అల్లు అర్జున్‌ `పుష్ప 2` సినిమాతో తానేంటో నిరూపించుకున్నారు. ఈ చిత్రం ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేసింది. ఆల్మోస్ట్ `బాహుబలి 2` రికార్డులను బ్రేక్‌ చేసింది. రాజమౌళి దర్శకత్వంలో కాకుండానే బన్నీ ఈ రేర్‌ ఫీట్‌ని అందుకున్నారు.

క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌తో కలిసి ఈ సంచలనాలకు తెరలేపారు. ఇక ఇప్పుడు మరో భారీ సినిమాతో రాబోతున్నారు అల్లు అర్జున్‌. కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా, ఇండియాలో ఇప్పటి వరకు రాని జోనర్‌లో ఈ మూవీ చేయబోతున్నారట. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
AA22 x A6 movie

AA22 x A6 movie

ఇటీవల అట్లీ సినిమాని ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. టైమ్‌ ట్రావెల్‌, సూపర్‌ హీరోలను తలపించేలా ఈ మూవీ ఉంటుందనే విషయం తెలుస్తుంది.

సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని ప్లాన్‌ చేస్తున్నారట. సన్‌ పిక్చర్స్ నిర్మించబోతుంది. హైలీ టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో ఈ సినిమాని రూపొందిచబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంతో రెండు వేల కోట్లు కాదు, దానికి మించి టార్గెట్‌ చేసినట్టు సమాచారం. 

35
Allu Arjun, trivikram

Allu Arjun, trivikram

దీంతోపాటు నెక్ట్స్ కూడా భారీ మూవీ ప్లాన్‌ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నారు అల్లు అర్జున్‌. ఈ చిత్రం మైథలాజికల్‌ జోనర్‌లో ఉండబోతుందట. ఇది కూడా భారీ బడ్జెట్‌ మూవీ అని తెలుస్తుంది.

అల్లు అర్జున్‌ ఈ మూవీతో కూడా ఇండియన్‌ సినిమాని షేక్‌ చేయడమే కాదు, ఇంటర్నేషనల్‌ మూవీ స్టాండర్డ్స్ లో హాలీవుడ్‌ సినిమాలకు పోటీ ఇవ్వబోతున్నారట. దీంతోపాటు సందీప్‌ రెడ్డి వంగాతోనూ ఓ మూవీ చేయబోతున్నారు బన్నీ.

45
Allu Arjun, Rajamouli

Allu Arjun, Rajamouli

ఇవన్నీ ఓ ప్లాన్‌ ప్రకారం చేయబోతున్నారట. దీని వెనకాల రాజమౌళి ఉన్నారట. మరి ఆయన పాత్ర ఏంటనేది చూస్తే, ఇది బన్నీలో ఉన్న కసి అని తెలుస్తుంది. `మగధీర` సమయంలో నిర్మాత అల్లు అరవింద్‌కి, రాజమౌళికి చిన్నపాటి డిఫరెన్సెస్‌ వచ్చాయి. ఆ సమయంలో రాజమౌళి హర్ట్ అయ్యారు.

ఆ తర్వాత బన్నీతో సినిమా చేయడానికి సుముఖత చూపించలేదు. దీంతో అప్పుడే బన్నీ డిసైడ్‌ అయ్యాడట. రాజమౌళితో సినిమా చేయకుండానే ఆయన రికార్డులు బ్రేక్‌ చేయాలని, తానేంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ ప్లాన్‌ లో భాగంగానే ఆయన ముందుకు వెళ్తున్నట్టు, ఇలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

55
Allu Arjun, Rajamouli

Allu Arjun, Rajamouli

రాజమౌళితో తాను కూడా సినిమాలు చేయకూడదని డిసైడ్‌ అయ్యాడట. సోలోగానే తాను అంతర్జాతీయ నటుడిగా ఎదగాలని భావిస్తున్నారట. ఇదంతా ఓ పదేళ్ల క్రితం నుంచి జరుగుతున్న ప్లానే అని తెలుస్తుంది. ఆ ప్లాన్‌ ప్రకారమే సినిమాలు చేస్తున్నారు.

మాస్‌ పల్స్ తెలుసుకున్న బన్నీ `పుష్ప 2`తో దాన్ని టార్గెట్‌ చేశాడు. రౌండప్‌ చేశాడు, కొట్టాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ గేమ్‌ ఆడబోతున్నాడని తెలుస్తుంది. మరి గేమ్‌ ఎంత వరకు వెళ్తుంది, ఏం జరగబోతుందో చూడాలి. రాజమౌళి వర్సెస్‌ అల్లు అర్జున్‌ అనేలా వెళ్తుందా? ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 

read  more: పహల్గామ్‌ ఉగ్ర దాడి ఘటనపై మోహన్‌ బాబు, పవన్‌, రామ్‌ చరణ్‌, మంచు విష్ణు రియాక్షన్‌.. ఏం చెప్పారంటే

also read: అప్పటి చిరంజీవి ఫార్ములానే ఇప్పుడు అల్లు అర్జున్‌ ఫాలో అవుతున్నాడా?.. ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved