Brahmamudi: కావ్య ప్రవర్తన కి ఆశ్చర్యపోతున్న రాజ్.. ఊహల్లో తేలిపోతున్న స్వప్న?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భర్తలో మార్పు కోసం ఎదురుచూస్తున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య దగ్గరికి వచ్చిన ధాన్యలక్ష్మి రాజ్ లో వచ్చిన మార్పు కి ఆనందపడుతుంది. అదే విషయాన్ని కావ్యకి చెప్తూ మొత్తానికి మా రాజ్ మెప్పుని పొందావు నాకు చాలా ఆనందంగా ఉంది. తల్లితో కలిసి రాజ్ నిన్ను ఏదో ఒకటి అంటూ ఉంటే నాకు బాధగా అనిపించేది కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాజ్ మంచివాడే కానీ కాస్త కోపం ఎక్కువ అంటుంది ధాన్యలక్ష్మి. మీరు అనుకుంటున్నట్లు ఏమీ లేదు అత్తయ్య ఇంకా మార్పు రాలేదు.
వస్తుందన్న ఆశ కూడా లేదు అని బాధతో చెప్తుంది కావ్య. అప్పుడే వచ్చిన చిట్టి అలా అనుకమ్మా.. చిన్నప్పటినుంచి వాడిని చూస్తున్నాను కదా నీ భర్తలో మార్పు మొదలైంది నీ ఓపికకి ఫలితం వచ్చే రోజులు దగ్గరపడ్డాయి ఇక నీకు అంతా మంచే జరుగుతుంది అంటుంది. అప్పుడు నువ్వు మా చుట్టూ కాకుండా నీ భర్త చుట్టూ తిరుగుతావు అంటూ ఆట పట్టిస్తుంది ధాన్యలక్ష్మి. అవును ఆయన చుట్టూనే తిరుగుతాను భార్యకి సాటి మనిషికి తేడా చూపిస్తాను అనుకుంటుంది కావ్య. ఆ తర్వాత ఇంట్లో అందరూ ఉపవాసం ఉండటంతో కళ్యాణ్, ప్రకాష్ మాత్రమే భోజనానికి వస్తారు.
వాళ్ళిద్దరూ భోజనం చేస్తూ ఉండగా రాజ్ కూడా భోజనానికి వస్తాడు. ఇంతమందికి వంట చేసిన వంట చాలా రుచిగా ఉంది వదిన ఇంత పనిచేయటానికి మీకు కష్టంగా అనిపించడం లేదా అని అడుగుతాడు కళ్యాణ్. సాటి మనిషిగా అది నా బాధ్యత అని రాజ్ ని చూసి వెటకారంగా ఉంటుంది కావ్య. ఆ మాటలకి షాక్ అవుతాడు రాజ్. ఇంటి మనుషులు సాటి మనుషులు ఎలా అవుతారు మీరు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు అంటాడు కళ్యాణ్.
అలా అనటం తప్పా అంటుంది కావ్య. తప్పు కాకపోతే మరేంటి. అదే మాట అన్నయ్య మిమ్మల్ని అంటే మీరు ఎంత బాధ పడతారు అంటాడు కళ్యాణ్. ఎందులోనైనా దూకి చావాలనిపిస్తుంది అంటుంది కావ్య. ఎందుకు సాటి మనిషి అనే పదాన్ని ఎన్నిసార్లు ఒత్తి పలుకుతుంది అనుకుంటాడు రాజ్. భోజనం అయిపోయి తన రూమ్ లోకి వెళ్లి పోయిన తర్వాత నేను మమ్మీ తో అన్న మాటలు విని ఉంటుందా.. అందుకే అలా రియాక్ట్ అవుతుందా అనుకుంటాడు రాజ్.
ఇంతలోనే కావ్య వచ్చి బెడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. డోర్ రాకపోవడంతో రాజ్ హెల్ప్ చేయాలనుకుంటాడు. నాకు సాటి మనిషి సాయం అక్కర్లేదు నా పని నేను చేసుకుంటాను అంటూ తన బెడ్ తనే వే సుకుంటుంది. అర్థమైంది నువ్వు అమ్మతో అన్నమాట విన్నావు అంతే కదా అంటాడు రాజ్. అంతే కదా అని ఎంత సింపుల్గా అంటున్నారు మీరు అలా మాట్లాడినప్పుడు నా మనసు ఎంత బాధ పడిందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమిటో నా జన్మ అత్తకి అక్కడ లేని కోడలిగా భర్తకి అక్కర్లేని భార్యగా ఈ జీవితం ఎంత నరకం గా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేరు అని బాధపడుతూ పడుకుంటుంది కావ్య.
నాకు కూడా కోపం వస్తుంది, నాకు కూడా నిద్ర వస్తుంది అనుకుంటూ రాజ్ కూడా పడుకుంటాడు. అర్ధరాత్రి ఎక్కిళ్ళు వస్తే కావ్య మంచినీళ్లు ఇస్తుంది. సాటి మనిషిగా ఇస్తున్నావా అంటాడు రాజ్. మీరు మీ భార్యని అనుకున్నంత తేలిగ్గా నేను నా భర్తని సాటి మనిషి అనుకోలేను అంటుంది కావ్య. నాకు అక్కర్లేదు అంటాడు రాజ్. సాటి మనిషిగానే ఇస్తున్నాను తీసుకోండి అనటంతో మంచినీళ్లు తీసుకొని తాగుతాడు రాజ్. ముందు మనిషిని మనిషిగా చూడండి రుద్రాణి గారిని పుట్టిల్లా అత్తిల్లా అని అడిగారు అవసరమా అని క్లాస్ పీకుతుంది కావ్య.
కావ్య పడుకున్న తరువాత తను ఏంటి అచ్చు మా అమ్మ లాగా అత్త గురించి అంత పాజిటివ్గా మాట్లాడుతుంది అనుకుని తను కూడా పడుకుంటాడు రాజ్. మరోవైపు స్వప్న యాడ్ సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంది అది చూసిన రాహుల్ స్వప్నని తెగ పొగిడేస్తాడు. ఈ యాడ్ ఇంట్లో వాళ్ళందరూ చూసి నన్ను తెగ పొగుడుతారు. నాలాంటి సెలబ్రిటీతో కలిసి ఉన్నందుకు తెగ ఆనందపడతారు.
ఆ రాజ్ వచ్చి తన కంపెనీకి నన్నే మోడల్ గా ఉండమని అడుగుతాడు అని ఆనందంగా భర్తకి చెప్తుంది స్వప్న. ఊహల్లో తేలిపోతున్న స్వప్నని చూసి వాళ్లు ప్రౌడ్ గా ఫీల్ అవ్వటం కాదు నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు అనుకుంటాడు రాహుల్. తరువాయి భాగంలో యాడ్ చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంటి పరువు తీసిన స్వప్నని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి అంటుంది రుద్రాణి.