MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi: భార్యను వెనకేసుకొచ్చిన రాజ్.. కావ్యకు థాంక్స్ చెప్పి షాకిచ్చిన అపర్ణ!

Brahmamudi: భార్యను వెనకేసుకొచ్చిన రాజ్.. కావ్యకు థాంక్స్ చెప్పి షాకిచ్చిన అపర్ణ!

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్తో టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. జైల్లో ఉన్న కూతురు కోసం కంగారు పడుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Jul 07 2023, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎపిసోడ్ ప్రారంభంలో కంగారుపడుతూ కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది కావ్య. కావ్య కి ధైర్యం చెప్పి ఫోన్ ఇవ్వమని చెప్తాడు. ఫోన్లో పేమెంట్ చేస్తాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని రిసెప్షనిస్ట్ తో చెప్తాడు కళ్యాణ్. సరే అంటుంది రిసెప్షనిస్ట్. అదే విషయం డాక్టర్ కి చెప్తుంది డాక్టర్ అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. కాసేపటి తర్వాత రాజ్ కి మెలకువ వస్తుంది. డాక్టర్ని పిలుస్తుంది కావ్య.

29

ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు డాక్టర్ బానే ఉంది అని చెప్తాడు రాజ్. ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళమంటారు అని కావ్య అడిగితే ఓపిక ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోండి అని చెప్తాడు డాక్టర్. అప్పటికే కళ్యాణ్ కంపెనీ కారుని పంపించడంతో ఆ కారులో ఇంటికి వెళ్ళిపోతారు రాజ్ దంపతులు. మరోవైపు జైల్లో ఉన్న అప్పు ని చూసి కంగారు పడిపోతూ ఉంటారు కృష్ణమూర్తి దంపతులు.

39

నేను సీతారామయ్యగారిని బ్రతిమాలుతాను ఆయనే ఏదో ఒకటి చేస్తారు అంటుంది కనకం. వద్దు ఇప్పటికే మనిద్దరి కూతుర్లు ఆ ఇంట్లో కాపురాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మా కూతుర్ని రక్షించండి అని ఏం మొహం పెట్టుకొని వెళ్లి అడుగుతాము. ఇప్పుడిప్పుడే కావ్య భర్త తనతో సవ్యంగా ఉంటున్నాడు ఇప్పుడు మనం వెళ్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది.
 

49

అలా జరగడం నీకు ఇష్టమా అని భార్యని అడుగుతాడు కృష్ణమూర్తి. ఏడుస్తూ ఇష్టం లేదు అని చెప్తుంది కనకం. మరేం చేద్దాము పొద్దున్నే కోర్టు తీసుకెళ్లిపోతారట అంటుంది. కోర్ట్లో జడ్జి గారికి జరిగింది చెప్పి ప్రాధేయపడదాము ఆపై మన తలరాత అంటాడు కృష్ణమూర్తి. మరోవైపు ఇంటికి వచ్చిన భర్తకి వేడిగా వండి పెడుతుంది కావ్య.
 

59

తినటానికి ఓపిక లేదు అని రాజ్ అంటే తింటే అదే ఓపిక వస్తుంది అని బలవంతంగా అతని చేత భోజనం చేయిస్తుంది. తర్వాత అతను పడుకుంటే అతని పక్కనే కూర్చొని పడుకోకుండా కాపలా కాస్తుంది. కాసేపటి తర్వాత అపర్ణ వాళ్లు వస్తారు. జరిగిందానికి కారణం కావ్య అనుకొని తనని నానా చివాట్లు పెడుతుంది అపర్ణ మాకెందుకు చెప్పలేదు  సొంత నిర్ణయాలు తీసుకునే అంత పెద్ద దానివి అయిపోయావా అంటూ కేకలు వేస్తుంది.
 

69

 స్వప్న, రుద్రాణి కూడా కావ్య మీద కేకలు వేస్తారు. మీరందరూ ఆగండి తను ఏదో తప్పు చేసినట్లు ఎందుకు అలా నిలదీస్తారు అంటూ అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది చిట్టి. ఆయన కి ఒంట్లో బాగోకపోతే కంగారు పడిపోయాను ఆ కంగారులో నాకు ఫోన్ చేయాలని తోచలేదు అని సంజాయిషీ ఇచ్చుకుంటుంది కావ్య. అయితే మాత్రం ఫోన్ చేసి చెప్పవా..
 

79

అసలు మీ కుటుంబమే ఇంత అంటూ కావ్య కుటుంబం గురించి చులకనగా మాట్లాడుతుంది అపర్ణ. మరోవైపు కృష్ణమూర్తి దంపతుల దగ్గరికి కానిస్టేబుల్ వచ్చి నిన్నటి నుంచి ఏమీ బాధ చూడలేకపోతున్నాను అందుకే చెప్తున్నాను ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకువచ్చి కేసుని రాజీ చేయించుకోండి. కేసు ఒక్కసారి కోర్ట్కి వెళ్ళిందంటే ఇంక పోలీసుల చేతిలో కూడా ఏమీ ఉండదు అని చెప్తుంది.
 

89

కంగారు పడిపోయిన కనకం ఇంక నువ్వు ఏం చెప్పినా వినను. నేను వెళ్లి సీతారామయ్యగారి కాళ్లు పట్టుకుంటాను. ఒకవేళ కావ్య వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే తర్వాత చూసుకుందాము అని భర్తతో చెప్తుంది కనకం. పరిస్థితి చేయి దాటి పోయినప్పుడు నేను మాత్రం ఎందుకు వద్దంటాను నేను కూడా వస్తాను కదా అంటాడు కృష్ణమూర్తి. తీరా కావ్య వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి అక్కడ జరుగుతున్న ఈ గొడవను చూసి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు వీళ్ళని చూడకముందే గుమ్మంలోంచే  బయటికి వెళ్లిపోతారు.
 

99

 ఇంతలో రాజ్ కి మెలకువ రావటంతో హాల్లోకి వస్తాడు. కంగారుగా అందరూ రాజ్ దగ్గరికి వెళ్లి కుశల ప్రశ్నలు వేస్తారు. నేను బాగానే ఉన్నాను కానీ ఇందాకటి నుంచి వింటున్నాను అసలు తన తప్పు ఏమి ఉందని కళావతిని తిడుతున్నావు మమ్మీ. తను వద్దంటున్నా వినకుండా నేనే ఐస్ క్రీమ్ తిన్నాను అందుకే అలా జరిగింది. రాత్రి కష్టపడి తనే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది అని భార్యని వెనకేసుకొస్తాడు రాజ్. తరువాయి భాగంలో వంటగది  లో వున్న కావ్య దగ్గరికి వచ్చి థాంక్స్ చెప్తుంది అపర్ణ. ఆ మాటలకి షాకైపోతుంది కావ్య.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu: పేదరాలిగా చస్తా కానీ, పేదరాలిగా బతకను.. ఫ్యామిలీపై తాప్సీ ఫన్నీ కామెంట్
Recommended image2
విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట
Recommended image3
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved